(Local) Fri, 19 Jul, 2019

డిసెంబర్,15,2018,శనివారం-రోజువారీ జాతక ఫలితాలు

December 14, 2018,   10:34 PM IST
Share on:

 

మేషం

బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. కాంట్రాక్టులను దక్కించుకుంటారు. అనుకోని అతిథులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. 

 

 

వృషభం

మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగులు అనుకోని పదోన్నతులు పొందుతారు. 

 

మిథునం

ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. విలువైన ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది.

 

కర్కాటకం

 

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్ధిక లావాదేవీలు లాభిస్తాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. సంతానం కార్యసిద్ధి పొందుతారు. 

 

సింహం

ఋణాలు తీరి ఊరట చెందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

 

కన్య

కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. 

 

తుల

దూరపు బంధువులతో కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. కొత్తవ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. 

 

వృశ్చికం

చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులు కొత్త హోదాలు పొందుతారు. 

 

ధనుస్సు

 

ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇంటాబయటా ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. 

 

మకరం

 

 

ఋణ ఒత్తిడి నుంచి విముక్తులవుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. 

 

కుంభం

కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. 

 

మీనం

 

 

 

ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్ధికపరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. 

 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.