(Local) Thu, 28 May, 2020

డిసెంబర్,26,2018, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు

December 25, 2018,   10:07 PM IST
Share on:
డిసెంబర్,26,2018, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు

 

మేషం

ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో రుణ విముక్తి లభిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు తమ లక్ష్యం పట్ల పట్టుదల అధికమవుతుంది. వ్యక్తిగత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని తగ్గించడం మంచిది. బంధువులు ధనసహాయం అర్ధిస్తారు. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. 

 

వృషభం

వినోదాలకు, విలాసాలకు చేసే ఖర్చులను తగ్గించుకోవాలి. పొదుపు దిశగా ఆలోచనలు సాగుతాయి. ప్రతిష్ఠకు భంగం కలిగించే వారికి దూరంగా ఉడటం ఉత్తమం. షాపింగ్ వ్యవహారాలు, బోగస్ పథకాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలి. పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. ఒత్తిడి, ప్రలోభాలకు ఉద్యోగులు ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. అపరిచిత వ్యక్తుల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. 

 

మిథునం

దీర్ఘకాలిక పెట్టుబడుల వల్ల అధిక లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పథకాలు ఆకర్షణీయంగా ఉంటాయి. బ్యాంకు వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మిత్రులతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. అతిథి మర్యాదలు నిర్వహిస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. అధికారులతో సంభాషించేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మహిళల అవసరాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. 

 

కర్కాటకం

 

అదనపు ఆదాయం దిశగా ఆలోచనలు సాగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. రహస్య శత్రువులు తప్పుడు ప్రచారం చేసే ఆస్కారం ఉంది. కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన అవసరం. ఉద్యోగులకు పదోన్నతులు త్వరలోనే లభిస్తాయి. అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఔషధాలు, ఫ్యాన్సీ వ్యాపారాలకు లాభదాయకంగా ఉంటుంది. 

 

సింహం

అనేక మార్గాల ద్వారా ఆర్థిక లబ్ది పొందుతారు. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగుల శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు. మహిళలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొందరు ప్రలోభాలకు గురిచేసే ఆస్కారం ఉంది. సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు తొందరపాటు తగదు. శస్త్రచికిత్సలను వైద్యులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

 

కన్య

ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపార ప్రణాళికలతో దీర్ఘకాలిక ప్రయోజనం పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. ఉపాధ్యాయులు, మార్కెటింగ్ ఉద్యోగులకు ఒత్తిడి అధికమవుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. రాజకీయ నాయకులు హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 

 

తుల

క్లిష్ట సమయంలో స్నేహితుల సాయం అందుతుంది. ఆర్థిక సమస్యలు నిర్మాణాత్మక ఆలోచన సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. కోర్టు వ్యవహారాల్లో లాయర్లకు ఒత్తిడి తప్పదు. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి అవకాశాలు లభిస్తాయి. బ్యాంకు వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తారు. ఖర్చులు పెరగే ఆస్కారం ఉంది. 

 

వృశ్చికం

బంధువుల నుంచి అందిన ఓ వార్త సంతోషానికి కారణమవుతుంది. ఉమ్మడి వ్యాపారాలు, ఊహాజనిత పథకాలలో పెట్టుబడులకు దూరంగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికమవుతుంది. బ్యాంకు వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీడియా ఉద్యోగులకు మార్పులు అనుకూలిస్తాయి. ఎదుటివారికి ఉచిత సలహాలు ఇచ్చి ఇబ్బందులకు గురవుతారు. మీ నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి. 

 

ధనుస్సు

 

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొందరు మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు. అంకితభావం, కష్టించి పనిచేసే మనస్తత్వం గుర్తింపును తీసుకొస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు ఎదురవుతాయి. బంధువుల నుంచి మొహమాటాలు తప్పవు. ఆంతరంగిక విషయాల పట్ల గోప్యత పాటించాలి. వాతావరణంలో మార్పుల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. 

 

మకరం

 

 

ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నైపుణ్యాలను ప్రదర్శించి లబ్ది పొందుతారు. స్నేహితులు తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. ఉద్యోగ బాధ్యతల్లో ఆశించిన మార్పులుంటాయి. ఆకస్మిక ఖర్చుల వల్ల ఆటుపోట్లు తప్పవు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ఉత్తమం. కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన అవసరం. వృత్తిపరంగా చికాకులు లేకున్నా ఆదాయ సంతృప్తిగా ఉండదు. 

 

కుంభం

దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కోలుకుంటారు. ఆర్థిక లబ్ది పొందడానికి బాగా శ్రమించాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల పట్ల నిర్లక్ష్య వైఖరి విభేదాలకు దారితీస్తుంది. విద్యార్థులు చికాకులను ఎదుర్కొంటారు. సన్నిహితుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు అనుకూలిస్తాయి. 

మీనం

 

మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సామాజిక కార్యక్రమాలు, వినోదాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వాతావరణంలో మార్పులు రైతులకు అనుకూలిస్తాయి. ఉద్యోగుల పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు ఏకాగ్రత చాలా అవసరం.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.