(Local) Sat, 24 Aug, 2019

డిసెంబర్,28,2018, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు

December 27, 2018,   11:24 PM IST
Share on:

 

మేషం

మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకం గా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమంది. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు.

 

వృషభం

ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చు లు చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బుకానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి. అలాగే ఇతరులతో వ్యవహరించేప్పుడు కూడా జాగ్రత్త అవసరం.

 

మిథునం

ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని డబ్బురావటం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగం, వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి.

 

కర్కాటకం

 

వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగం లో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

 

సింహం

మీరు దూరప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీయానానికి సంబంధించి ఒక ముఖ్యసమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గరవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేతదర్శనం చేసుకుంటారు.

 

కన్యా

మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. నూ తన వ్యాపారానికి, ఆర్థిక లావాదేవీలకు అనుకూలదినం కాదు.

 

తుల

నూతన వ్యాపార ఒప్పందాలు కానీ, ఆర్థిక లావాదేవీ లు కాని పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన వస్ర్తాభరణాలు కొనుగోలు చేస్తా రు. వృత్తిలో అనుకూల పరిణామాలు ఏర్పడతాయి. వాహనం కొనటం కాని, మరమ్మతు చేయించటం కాని చేస్తారు.

 

వృశ్చికం

ఈ రోజు మీ వృత్తిలో అనుకోని మార్పు చోటు చేసుకుంటుంది. మీరు ఎదురు చూస్తున్న పదోన్నతికాని, పదవిలో మార్పుకాని చోటుచేసుకుంటుంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ వ్యాపార భాగస్వాములతో ఉన్న మనస్పర్థలు తొలగి పోతాయి.

 

ధనుస్సు

 

మానసికంగా ఆందోళనకు గురవుతారు. మీ సం తానం లేదా మీకు ఇష్టమైన వారి ఆరోగ్య పరిస్థితి మీ ఆందోళనకు కారణమవుతుంది. మీరు పూర్తి చేస్తానన్న పనులు పూర్తి చేయకపోవటం వలన మీ పై అధికారులు మీపై అసహనం వ్య క్తం చేస్తారు. జీవితభాగస్వామితో మనస్పర్థలు ఏర్పడవచ్చు.

 

మకరం

 

 

ఈ రోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడటం కారణంగా మానసిక అశాంతికి, ఆవేశానికి గురవుతారు. అనుకోని ఖర్చులు కాని, నష్టాలు కాని మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తాయి. ఎక్కువ ఆవేశానికి లోను కాకుండా స్థిమితంగా ఆలోచించటం వలన సమస్యల నుంచి బయటపడ గలుగుతారు.

 

కుంభం

మీ వృత్తిలో మార్పుకాని, అనుకోని ప్రయాణం కాని చోటు చేసుకుంటుంది. ఇతరుల బాధ్యతలను మీరు చేయవలసి రావచ్చు. మీ పట్టుదలతో దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సహోద్యోగులతో మెలిగేప్పుడు జాగ్రత్త అవసరం, మిమ్మల్ని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. జీవిత భాగస్వామితో విందు వినోదాల్లో పాల్గొంటారు.

మీనం

 

ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. అనవసర వాదనల వలన మీ గౌరవానికి భంగం కలిగే ప్రమాదం ఉంటుంది ఆర్థిక వ్యవహారాలలో నష్టపోయే ప్రమాదముంది. మానసికంగా స్థిరంగా ఉండటం, మీపై మీరు నమ్మకాన్ని కోల్పోకుండా ఉండటం వలన అన్ని విషయాల్లో ఇబ్బందుల నుంచి బయట పడగలుగుతారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.