(Local) Fri, 19 Jul, 2019

డిసెంబర్,29,2018, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు

December 28, 2018,   10:07 PM IST
Share on:

 

మేషం

అదృష్టవంతమైన రోజు. మీ సహోద్యోగులు లేదా పై అధికారుల ప్రశంసలు పొందుతారు. మీపై గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ పదోన్నతి విషయంలో శుభవార్త కానీ వింటారు. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి.

 

వృషభం

ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కళ్లు లేదా దంతాలకు సంబంధించిన అనారోగ్యం బారినపడే అవకాశముంటుంది. పని ఎక్కువ ఉండటం వల్ల అసహనానికి, ఉద్రేకానికి గురయ్యే అవకాశముంటుంది. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.. అలాగే ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది.

 

మిథునం

ఆహ్లాదకరమైన రోజు. ఇష్టమైనా వారితో గడుపుతారు. బంధుమిత్రుల సమాగమం. వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడం అలాగే పాత మిత్రులను కలవడం జరుగుతుంది. నీరు, ఆహారం విషయం లో జాగ్రత్త అవసరం.ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు.

 

కర్కాటకం

 

అనుకున్న పనులు అవుతాయి. చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న విషయంలో శుభవార్త వింటారు. మీ లక్ష్యం నెరవేరుతుంది. ధనలాభం కలుగుతుంది అలాగే రుచికరమైన భోజనం చేస్తారు.చేపట్టిన పనిలో విజయం వరిస్తుంది.

 

సింహం

ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఉదర లేదా ఛాతీ సంబంధ సమస్యలు వచ్చే అవకాశముంటుంది. నిదలేమి కారణంగా మానసిక ప్రశాంతత ఉండదు. అలసట, నీరసం అధికంగా ఉంటాయి.

 

కన్యా

మీ సహోద్యోగులతో, పై అధికారులతో సుహృద్భావముతో మెలగండి. వారితో గొడవలకు దిగడం మంచిది కాదు. అలాగే వారు చెప్పిన దానిని శ్రద్ధగా విని ఆచరించడానికి ప్రయత్నించడం. కోపావేశాలకు లోనుకావొద్దు.

 

తుల

మీ జీవిత భాగస్వామితో, పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారితో కలిసి వినోదయాత్ర చేసే అవకాశముంది. ఖర్చు అధికంగా ఉంటుంది. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు.విజయం మీ సొంతమవుతుంది. తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది.

 

వృశ్చికం

ఈ రోజు తలపెట్టిన కార్యములు విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. దాని కారణంగా సమాజంలో గౌరవాన్ని, గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో మార్పు కానీ, పదోన్నతి కానీ ఉంటుంది.మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది.

 

ధనుస్సు

 

ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలిగించే రోజు. ధన నష్టం కానీ, అనవసరమైన ఖర్చు కానీ ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. ఎవరికి కూడా డబ్బు విషయంలో మాట ఇచ్చి ఇబ్బంది పడకండి. ఆర్థిక నియంతణ అవసరం.

మకరం

 

ఆరోగ్య విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధ పడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.

 

కుంభం

ఈ రోజు ఆర్థికంగా కలిసి వస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. అలాగే మొండి బకాయిలు వసూలవుతాయి. భూ సంబంధ లావాదేవీలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు అందుతాయి.

మీనం

 

ఈ రోజు పనుల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఆటంకాలు వచ్చినా ప్రయత్నం మానకండి. కొద్ది శ్రమతో ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. ఆఫీస్‌లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒపికతో మెలగాల్సిన సమయం. మానసికంగా ఓటమిని ఒప్పుకోకండి, విజయం మీ వశమవుతుంది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.