(Local) Wed, 23 Oct, 2019

డిసెంబర్,30,2018, ఆదివారం -రోజువారీ జాతక ఫలితాలు

December 29, 2018,   10:40 PM IST
Share on:
డిసెంబర్,30,2018, ఆదివారం -రోజువారీ జాతక ఫలితాలు

 

మేషం

ఈ రోజు ఏ పని చేయాలన్నా బద్ధకం అధికంగా ఉంటుం ది. పనులు వాయిదా వేసి విశ్రాంతి కోరుకుంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త అవసరం. అలాగే ఇతరులతో వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మంచిది. తొందరపాటు పనికి రాదు. విందు వినోదాల్లో పాల్గొంటారు

 

వృషభం

ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తారు. ఆరోగ్యం మెరుగు పడుతుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. ఖర్చు అధికంగా ఉంటుంది. గృహ సంబంధ విషయాల్లో ఎక్కువ సమయం వెచ్చిస్తారు.

 

మిథునం

కొత్త పనులు పారంభించడానికి, వాయిదా వేస్తున్న పనులు పూర్తి చేయడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. ఇంటర్వ్యూలకు వెళ్లే ఉద్యోగార్థులు అనుకూల ఫలితం సాధిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

 

కర్కాటకం

 

ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. పెట్టుబడుల్లో అజాగ్రత్త, తొందరపాటు పనికి రాదు. మీ తొందరపాటు వల్ల డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. అలాగే మీ శత్రువుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. వారిపై ఒక కన్నేసి ఉంచండి.

 

సింహం

ఈ రోజు ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. రక్తం లేదా ఊష్ణ సంబంధ ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశమున్నది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. విందు వినోదాలు లేదా ఆరోగ్యం విషయంలో అనుకోని ఖర్చు చేయాల్సి వస్తుంది. మీ పిల్లల కారణంగా కొంత ఊరట లభిస్తుంది.

 

కన్య

మానసికంగా పశాంతంగా ఉంటారు. కొద్దికాలంగా ఇబ్బందిపెడుతున్న ఆరోగ్య సమస్య తగ్గుముఖం పడుతుంది. వాయిదా పడిన పనులు తిరిగి పారంభ మవుతాయి. రోజంతా కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఎక్కువ సమయం విశ్రాంతిని కోరుకుంటారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

 

తుల

ఈ రోజు ఎక్కువ సమయం ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది. వృత్తి పరంగా ఒక శుభవార్త వింటారు. రోజంతా ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి సహాయం లభిస్తుంది.

 

వృశ్చికం

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వివాదాలు లేదా కోర్టు కేసులు పరిష్కారానికి వస్తాయి. మిమ్మల్ని వ్యతిరేకించిన వారు మనసు మార్చుకొని మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికందుతుంది.

 

ధనుస్సు

 

ఈ రోజు ఆధ్యాత్మిక విషయాలకు, విందు వినోదాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన చేస్తారు. మీ తండ్రిగారి ఆరోగ్యం మెరుగవుతుంది. అనుకోని అదృష్టం కలిసి వస్తుంది. భూసంబంధ వివాదాలు పరిష్కారం అవుతాయి.

మకరం

 

ఈ రోజు అధిక సమయం గృహ సంబంధ వ్యవహారాలకు కేటాయిస్తారు. మీ వాహనం లేదా ఇంటికి సంబంధించిన మరమ్మతులు పూర్తి చేస్తారు. మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. వివాదాలు పరిష్కారం అవుతాయి. అప్పు తీసుకున్నవారు తిరిగి చెల్లిస్తారు.

 

కుంభం

ఈ రోజు మీ ఆవేశాన్ని కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ముఖ్యంగా మీ బంధువులతో లేదా ప్రయాణంలో తోటి ప్రయాణికులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మీ ప్రవర్తన కారణంగా వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

మీనం

 

ఈ రోజు ఆరోగ్య విషయంలో సాధారణంగా ఉంటుంది. నేత్ర సంబంధ అనారోగ్యం కానీ, మానసిక ఆందోళన కానీ ఉంటుంది. ఎక్కువ ఆహారం తీసుకోవడం మంచిది కాదు. మానసికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తారు. సంగీతం వినడం లేదా ఏదైనా వినోద కార్యక్రమంలో పాల్గొనడం మంచిది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.