(Local) Thu, 18 Jul, 2019

జూలై 12,2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు

July 11, 2019,   11:12 PM IST
Share on:

మేషరాశి : ఈ సాయంత్రాన్ని మీ పిల్లలు ఉత్తేజితం చేస్తారు. వారితోగడిపిన సమయం మీశరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది. మీకు తెలిసిన వారిద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి, మీ క్రొత్త ప్రాజెక్ట్‌లు, ప్లాన్‌ల గురించి చెప్పడానికిది మంచి సమయం. 

పరిహారాలు: పక్షులకు ఏడు రకాల ధాన్యాలు ఆహారం వేయడం వల్ల మీకు మంచి ఫలితం వస్తుంది.

వృషభరాశి : వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులలో తప్పులెంచడం మానండి. ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని మానండి. మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత ఉంచండి. ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాతకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. 

పరిహారాలు: ప్రేమ జీవితం మెరుగుపడటానికి అక్కచెల్లలను గౌరవించండి.

మిథునరాశి : ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందగలరు. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. పిల్లలపై మీ అభిప్రాయాలను రుద్దకండి. 

పరిహారాలు: తెలుపు దుస్తులు ధరించండి, తెల్లపూలతో పూజ మంచి ఫలితాన్నిస్తుంది

కర్కాటకరాశి : మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపచేస్తుంది. ఈ రోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి మీ బడ్జెట్‌కి కట్టుబడి ఉండండి. 

పరిహారాలు: దగ్గర్లోని దేవాలయంలో బియ్యన్ని ఇవ్వండి.మీ ఆర్థికస్థితి మెరుగుపడుతుంది.

సింహరాశి : మీ కుటుంబ రహస్యం ఒకటి మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తుంది. మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. ఒక సంతోషకరమైన వార్త అందవచ్చు. మీరు ఎదురు చూస్తున్న ప్రశంసలు, రివార్డ్‌లు వాయిదా పడే అవకాశం ఉంది.

పరిహారాలు: ఇంట్లో పసుపు గణపతిని ఆరాధించండి తప్పక అన్నింటా జయం కలుగుతుంది.

కన్యారాశి : కుటుంబ సభ్యులతో శాంతి పూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడపండి. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకొండి. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు. ప్రకాశింపచేయగలదు. మీ నుండి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకోండి. ఖర్చులను అదుపు చేసుకోండి.

పరిహారాలు: తులసీదళాలతో వేంకటేశ్వరస్వామికి అర్చన చేయండి తప్పక అన్నింటా శుభం కలుగుతుంది.

తులారాశి : కొత్త పథకాలను, వెంచర్లను ప్రారంభించడానికి మంచిరోజు. పాత స్నేహితులు సహాయపడుతారు. గ్రహచలనం రీత్యా, ఒకరు మీకు ప్రపోజ్ చేసే అవకాశాలున్నాయి. ఈరాశి గర్భిణీలు జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆతరువాత మీరు జీవితంలో పశ్చాత్తప పడవలసి వస్తుంది మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.
పరిహారాలు: ఈ రోజు ప్రాతఃకాలంలో సూర్యారాధన, నమస్కారాలు చేయండి, మంచి ఆరోగ్యం, కార్యజయం కలుగుతుంది.

వృశ్చికరాశి : మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు, మీ ఆశలమేరకు ఎదిగి, మీకలలను నిజం చేసే అవకాశం ఉన్నది. మీరు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి, అవి మిమ్మల్ని బాగా టెన్షన్ పెట్టి ఎక్కువ భయపడేలాగ చేస్తాయి.

పరిహారాలు: ఆనందం, ఆర్థికంగా బాగా ఉండటానికి ఈ రోజు నవగ్రహాల దగ్గర పండ్లు పట్టుకుని ప్రదక్షిణలు చేయండి.

ధనస్సురాశి : సహోద్యోగులు, కింది ఉద్యోగులు మీకు ఆందోళన, వత్తిడులకు కారణమౌతారు. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం, స్టాక్, మ్యూచ్యువల్ ఫ్‌ండ్ల లో మదుపు చేయాలి. వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం, అనుకూలమైన గాలి వీచడం వలన ఎంతో మంచిరోజు కాగలదు. 

పరిహారాలు: కుటుంబ జీవితం సాఫీగా గడవడానికి శుక్రగ్రహాన్ని ఆరాధించండి, తెల్లని దుస్తులు ధరించండి మంచి జరుగుతుంది.

మకరరాశి : కుటుంబపు తప్పనిసరి మొహమాటాలు, త్వరితమైన చర్యను అవసరమౌతాయి. ఇలాంటప్పుడు అలసత చూపితే, తరువాత భారీ మూల్యం చెల్లించ వలసి వస్తుంది. మానసిక ప్రశాంతత కోసం, ఏదో ఒక దానం లేదా ఉదార సహాయం చేయ్యండి.

పరిహారాలు: మంచి వృత్తిపరమైన జీవితం కోసం ఎరుపు రంగులో ఉన్న తీపి ఆహార పదార్థాలను స్నేహితులకు పంచండి.

కుంభరాశి : మీ చదువులను ఫణంగా మీరు బయటి ఆటలలో అతిగా పాల్గొంటుంటే, అది మీ తల్లిదండ్రులకు సంకట పరిస్థితిని కలిగిస్తుంది. స్నేహితులు, మీకు సపోర్టివ్‌గా ఉండి, మీకు సంతోషాన్ని కలిగిస్తారు. పెట్టుబడి పథకాలవిషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వాపరాలు మరిన్ని తెలుసుకొండి.

పరిహారాలు: ఈ రోజు దేవాలయంలో ప్రదక్షిణలు చేసి ప్రసాదం స్వీకరించండి. తప్పక మంచి జరుగుతుంది.

మీనరాశి : కుటుంబం, స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని వత్తిడి ఉంటుంది. మీ బరువు పై ఒక కన్ను వేసి ఉంచండి, అమితంగా తినడంలో పడిపోకండి. అవాస్తవమైన ఆర్థిక లావాదేలలో బిగుసుకుపోకుండా, జాగ్రత్త వహించండి. 

పరిహారాలు: ఆర్థిక అభివృద్ధి కోసం గంధాన్ని ధరించండి. తప్పక మంచి ఫలితం వస్తుంది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.