(Local) Sat, 24 Aug, 2019

జూలై 14,2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు

July 13, 2019,   11:54 PM IST
Share on:

మేషరాశి : మీ ప్రవర్తన, ఆహ్లాద కరమైన వ్యక్తిత్వం, మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి, పాత సంబంధాలు మెరుగు పరుచుకోవడానికి ఏర్పరచుకోవడానికి సహాయపడతాయి. ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకరాన్ని కలిగించవచ్చును. 

పరిహారాలు: పెద్దల దీవెనలతో ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు.

వృషభరాశి : ఒక మత సంబంధమయిన ప్రదేశానికి లేదా యోగి వంటివారిదగ్గరకు వెళ్ళడం గ్రహరీత్యా ఉన్నది. దీనివల్ల ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి. స్నేహితుల కలయిక, సహకారం అందిస్తారు.

పరిహారాలు: ఎగతాళిగా ఉండకూడదు, ఎల్లప్పుడూ దేవుని ఆశీర్వాదాలను గౌరవించండి. ఎందుకంటే సమయం ఎప్పుడూ స్థిరంగా ఉండదు మరియు ఎల్లప్పుడూ మారుతుంది.

మిథునరాశి : ఆర్థికపరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. పరిస్థితిపై ఒకసారి అదుపు వచ్చాక, మీ ఆతృత మాయమైపోతుంది. పెట్టుబడి విషయం వచ్చినప్పుడు తొందరపడి నిర్ణయాలు చేయవద్దు.

పరిహారాలు: శంకరుడి దగ్గర లేదా రావిచెట్టు దగ్గర 3 నిమ్మకాయలు ఉంచండం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

కర్కాటకరాశి : ఆర్థికపరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. మీరింతవరకు వెళ్ళని చోటికి రమ్మని ఆహ్వానించబడితే, హుందాగా అంగీకరించండి. మీ ఆఫీసు నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి. మీరు నిజంగా సంతోషం పొందే పనులు చెయ్యండి.

పరిహారాలు: మంచి ఆరోగ్యం కోసం శివాభిషేకం లేదా దేవాలయ ప్రదక్షిణలు చేయండి.

సింహరాశి : సముద్రాల అవతల ఉండే బంధువు ఇచ్చే బహుమతితో మీకు చాలా సంతోషం కలుగుతుంది. అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు- కనుక, మీ వద్దగల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులను పరిమితం చేసుకొండి.

పరిహారాలు: ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడానికి వ్యసనాలకు దూరంగా ఉండి, ఆదివార నియమాన్ని పాటించండి.

తులారాశి : మీ జీవిత భాగస్వామి మీ కోసం ఏదో చాలా స్పెషల్ ప్లాన్ చేశారు. దాంతో ఈ రోజు మీకు చాలా అద్భుతంగా గడవనుంది. చాలాకాలంగా ఉన్న అనారోగ్యం నుంచి విముక్తి పొందుతారు. ధనలాభాలు మీరు అనుకున్నంతగా రావు. 

పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ ప్రదక్షిణలు చేయండి మంచి జరుగుతుంది.

వృశ్చికరాశి : ఇంటిలో పరిస్థితులు సాఫీగా సాగిపోయేలాగ కనిపిస్తున్నది. మీ ప్లాన్ లకిగానూ మీరు వారినుండి, పూర్తి సహకారం కోరవచ్చును. ఈ రోజు రిలాక్స్ అయ్యేలాగ సరియైన మంచి మూడ్‌లో ఉంటారు. దుబారా ఖర్చులు పెట్టకండి. 

పరిహారాలు: కుటుంబ జీవితం సాఫీగా సాగడానికి గణపతి ఆరాధన చేయండి.

ధనస్సురాశి : కమిషన్ల నుండి- డివిడెండ్లు- లేదా రాయల్టీలు ద్వారా లబ్దిని పొందుతారు. మీకుచిరకాలంగా ఉన్న అప్పులను తీర్చెస్తారు. ఈ రోజు మీ ఆరోగ్యం గురించి బాధపడనవసరం లేదు. మీ చుట్టూరా ఉన్నవారే మీలో హుషారును నింపి మానసిక బలాన్ని ప్రేరేపిస్తారు.

పరిహారాలు: ఆనందమయమైన జీవితం కోసం సాధు జంతువులకు ఆహారాన్ని పెట్టండి.

మకరరాశి : మీ ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి, కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. ఆరోగ్య సమస్యలు చిన్నవిగా భావించకండి. మొదట్లోనే డాక్టర్‌ను సంప్రదించండి. వివాహబంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం. 

పరిహారాలు: సువాసనలు, సుగంధ పరిమళాలు వచ్చే వస్ర్తాలు వాడకం నుండి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.

కుంభరాశి : యల్ ఎస్టేట్‌లో తగినంతగా సొమ్మును మదుపు చెయ్యాలి. అవసరమైతే, మీ స్నేహితులు, ఆదుకుంటారు. మీకు చక్కని శరీర ఆకృతికోసం, ఫిట్‌నెస్ ఇంకా బరువు తగ్గే కార్యక్రమాలు సహాయ పడగలవు. 

పరిహారాలు: మంచి ఆనందమైన జీవితం కోసం తియ్యని ప్రసాదాన్ని సూర్య భగవానుడికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించండి.

మీనరాశి : రియల్ ఎస్టేట్ లపెట్టుబడి అత్యధిక లాభదాయకం. మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం మీ భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కావచ్చు. మంచిరోజులు కలకాలం నిలవవు. 

పరిహారాలు: సంతోషం కోసం ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించండి.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.