(Local) Wed, 23 Oct, 2019

జూన్ 15,2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు

June 14, 2019,   11:00 PM IST
Share on:
జూన్ 15,2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు

మేషరాశి : మిశ్రమ ఫలితాలు, అధిక ఖర్చులు, ధననష్టం, భాగస్వామితో ఇబ్బందులు, ఆరోగ్యంలో మార్పులు,ప్రయాణ సూచన.
పరిహారాలు: నవగ్రహాల దగ్గర నల్లనువ్వులు, నల్లపూలతో ప్రదక్షణలు చేయండి మంచి జరుగుతుంది.

వృషభరాశి : వస్త్రలాభం, ఆర్థికంగా పర్వాలేదు, బంధుమైత్రి, అలంకార వస్తువులు లభిస్తాయి/కొనుగోలు చేస్తారు. భాగస్వామితో ఆనందం, కుటుంబ సఖ్యత.
పరిహారాలు: దేవాలయ దర్శనం, ప్రదక్షణలు చేయండి.

మిథునరాశి : వస్త్రలాభం, కొత్తవస్తువులు కొంటారు, బంధువుల రాక, విందులు, సోదరులతో స్వల్ప ఇబ్బందులు, ప్రయాణాలు.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

కర్కాటకరాశి : లాభం, వస్తులాభం, సోదరీ, సోదరుల రాక, వ్యాపారలాభం, పనులుపూర్తి, దేవాలయాలను దర్శిస్తారు.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, ఆంజనేయస్వామి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

సింహరాశి : వ్యతిరేక ఫలితాలు, చేసేపనిలో నష్టం, అకారణ విరోధాలు, ఆరోగ్య భంగం, స్థానమార్పులు, ఔషధసేవ, ప్రయాణాలు వాయిదా.
పరిహారాలు: నవగ్రహాల దగ్గర ఉప్పు, నల్ల పూలతో ప్రదక్షణలు మంచి చేస్తాయి.

కన్యారాశి : ప్రభుత్వ మూలక ధనలాభం, బంధువుల రాక, విందుభోజనం, పనులు పూర్తి, ప్రయత్నకార్య సఫలం.
పరిహారాలు: నవగ్రహాలకు దీపారాధన, ప్రదక్షణలు చేయండి.

తులారాశి : పూర్తి వ్యతిరేక ఫలితాలు, వివాదాలు, వస్తునష్టం, అధికారులతో ఇబ్బందులు, అనవసర ఖర్చులు.
పరిహారాలు: నవగ్రహాలకు ఉప్పు, నల్లని పూలతో ప్రదక్షణలు చేయండి.

వృశ్చికరాశి : అనుకూల వాతావరణం, లాభాలు, సంతానంతో సంతోషం, అలంకార వస్తువులు కొంటారు, ఆదాయం మించి ఖర్చు, ప్రయాణసూచన.
పరిహారాలు: ఆంజనేయస్వామి దేవాలయ దర్శనం చేయండి మంచిది.

ధనస్సురాశి : మిశ్రమ ఫలితాలు, అకారణంగా విరోధాలు, చేసే పనుల్లో లాభం, స్థానమార్పులు, విందులు, వినోదాలు.
పరిహారాలు: ఆంజనేయస్వామి దేవాలయ ప్రదక్షణలు చేయండి.

మకరరాశి : వస్తు, వస్త్రప్రాప్తి, యశోభూషణ లాభం, కుటుంబ సఖ్యత, రక్త సంబంధీకుల రాక, పనులు పూర్తి, సంతోషం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రదక్షణలు మంచి ఫలితాన్నిస్తాయి.

కుంభరాశి : మిశ్రమ ఫలితాలు, కలహాలు, కీర్తిలాభం, అధిక ఆదాయం, ఖర్చులు అంతే ఉంటాయి, ఆరోగ్యం పర్వాలేదు, ప్రయాణ సూచన.
పరిహారాలు: నవగ్రహాల దగ్గర నల్లపూలతో ప్రదక్షణలు చేయండి.

మీనరాశి : వ్యతిరేక ఫలితాలు, వస్తునష్టం, అలసట, అధికశ్రమ, విచారం, ఇబ్బందులు, ప్రయాణాలు వాయిదా.
పరిహారాలు: నవగ్రహాలకు నల్లపూలతో ప్రదక్షణలు చేయండి.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.