(Local) Sun, 17 Nov, 2019

నవంబర్ 02-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..

November 02, 2019,   6:38 PM IST
Share on:
నవంబర్ 02-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం: ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. సంఘంలో గౌరవం పొందుతారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

వృషభం: చేపట్టిన పనులలో కుటుంబసభ్యుల సహాయసహకారాలు అందుకుంటారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాహనసౌఖ్యం పొందుతారు.

మిథునం: ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప ధనలాభాలు పొందుతారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు.

కర్కాటకం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తిచేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది.

సింహ: కుటుంబసభ్యులు, చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. భూములు, షేర్ల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

కన్య: రాజకీయ, కళా, సాహిత్య రంగాల వారు సన్మానాలు, సత్కారాలు పొందుతారు. జీవితంలోని కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. 

తుల: ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. అనుకోని విధంగా ప్రముఖుల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

వృశ్చికం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి కుటుంబసభ్యుల సహాయసహకారాలలో పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు.

ధనుస్సు: సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ధనలాభాలు పొందుతారు.

మకరం: ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. సంతానం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తిచేస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

కుంభం: శ్రమ అధికంగా ఉన్నా తగిన ఫలితం మాత్రం దక్కదు. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

మీనం: ఆదాయం మార్గాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక ఋణాలు కొంత వరకు తీరుతాయి. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

సంబంధిత వర్గం
ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్ ...
ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.