(Local) Fri, 28 Feb, 2020

నవంబర్ 03-2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు..

November 03, 2019,   12:42 PM IST
Share on:
నవంబర్ 03-2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం :శుభవార్తా శ్రవణం.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.సన్నిహితుల సాయంతో ముందడుగు వేస్తారు.ఆకస్మిక ధన,వస్తు లాభాలు.యత్న కార్యసిద్ధి.విలువైన వస్తువులు సేకరిస్తారు.కాంట్రాక్టులు అనూహ్యంగా దక్కుతాయి.వ్యాపారాలు పుంజుకుంటాయి.ఉద్యోగులకు ఉన్నతహోదాలు.పారిశ్రామిక,కళారంగాల వారికి చికాకులు తొలగుతాయి.ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు.విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు.మహిళలకు మానసిక ప్రశాంతత.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు.....ఎరుపు, ఆకుపచ్చ.

పరిహారాలు : సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

వృషభం : ఆదాయానికి మించిన ఖర్చులు చేయాల్సివస్తుంది.శ్రమపడ్డా అనుకున్న ఫలితం కనిపించదు.చేపట్టిన కార్యక్రమాలు నిరాశ కలిగిస్తాయి.కుటుంబంలో సమస్యలు చికాకు పరుస్తాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారికి చిక్కులు.వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగులకు అనుకోని మార్పులు ఉండవచ్చు.పారిశ్రామిక,కళారంగాల వారికి మానసిక ఆందోళన.ఐటీ నిపుణులకు కొంత గందరగోళం.విద్యార్థులకు ఒత్తిడులు.మహిళలకు మానసిక అశాంతి.షేర్ల విక్రయాలలో స్వల్ప లాభాలు.అదృష్ట రంగులు.....ఆకుపచ్చ, తెలుపు.

పరిహారాలు :  ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం :పనులు మధ్యలో ఆపివేస్తారు.ప్రయాణాల్లో విలువైన వస్తువులు జాగ్రత్త.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.కష్టం ఎక్కువగా ఉంటుంది.విలువైన వస్తువులు భద్రంగా చూసుకోండి.ఆదాయం కొంత తగ్గే సూచనలు.కాంట్రాక్టర్లకు చికాకులు.వ్యాపారాలలో ఒడిదుడుకులు.ఉద్యోగులకు స్థాన చలనం ఉండవచ్చు.పారిశ్రామిక, కళారంగాల వారికి అంతఅనుకూలం కాదు.విద్యార్థులు మరింత శ్రమపడాల్సిన సమయం.మహిళలకు కుటుంబంలో కొన్ని సమస్యలు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు.....ఎరుపు, గులాబీ.

పరిహారాలు :  శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం : సంఘంలో గౌరవప్రతిష్టలు.ప్రముఖులతో పరిచయాలు.ఆదాయం పెరుగుతుంది.కుటుంబ సమస్యలు తీరే సూచనలు.పనులు సకాలంలో పూర్తి.గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారికి నూతనోత్సాహం.వ్యాపారాలలో ముందడుగు.ఉద్యోగులకు ఉన్నతస్థాయి అవకాశాలు.పారిశ్రామిక,కళారంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది.ఐటీ నిపుణుల యత్నాలు సఫలం.విద్యార్థులు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు.మహిళలకు సంతోషకరంగా ఉంటుంది.షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.అదృష్ట రంగులు.....గులాబీ, పసుపు.

పరిహారాలు :  హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

సింహం : పలుకుబడి పెరిగి ముందడుగు వేస్తారు.సన్నిహితులతో సఖ్యత ఏర్పడి సంతోషంగా గడుపుతారు.వివాదాలు తీరి ఊరట చెందుతారు.వ్యవహారాలలో విజయం మీదే.వ్యాపారాలు సజావుగానే కొనసాగుతాయి.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి.పారిశ్రామిక, కళారంగాల వారికి గౌరవ పురస్కారాలు.ఐటీ నిపుణులకు అవకాశాలు దక్కుతాయి.విద్యార్థులకు పట్టుదల పెరుగుతుంది. లక్ష్యాలు సాధిస్తారు.మహిళలు కొంత ఆస్తి లాభం పొందుతారు.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు.....ఎరుపు, కాఫీ.

పరిహారాలు : గణేశాష్టకం పఠించండి.

కన్య : ఆదాయం నిరాశ కలిగిస్తుంది.రుణదాతల నుంచి ఒత్తిడులు.దూర ప్రయాణాలు.ఆభరణాలు, వాహనాలు జాగ్రత్త.కుటుంబసభ్యుల వైఖరి కొంత ఇబ్బంది పెడుతుంది.నేత్ర సంబంధిత రుగ్మతలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి సమస్యలు.వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.ఉద్యోగాల్లో మార్పులు ఉండవచ్చు.రాజకీయవర్గాలకు ఒత్తిడులు.ఐటీ నిపుణులకు చిక్కులు.విద్యార్థులు మరింత కష్టపడే సమయం.మహిళలకు గందరగోళం.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు.....ఎరుపు, నేరేడు.

పరిహారాలు : ఆంజనేయ దండకం పఠించండి.

తుల : పనులలో విపరీతమైన జాప్యం.విలువైన వస్తువులు భద్రంగా చూసుకోండి.శ్రమాధిక్యంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి.ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి.వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.ఆస్తి విషయాల్లో సోదరులతో వివాదాలు.కాంట్రాక్టర్లు కొంత నిరుత్సాహం చెందుతారు.వ్యాపారాలు మందగిస్తాయి.ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.రాజకీయ, కళారంగాల వారికి అంచనాలు తప్పుతాయి.ఐటీ నిపుణులకు సమస్యలు పెరుగుతాయి.విద్యార్థులకు విద్యావకాశాలు లభించినా సంతృప్తినీయవు.మహిళలకు మానసిక అశాంతి.షేర్ల విక్రయాలు సామాన్యం.అదృష్ట రంగులు.....పసుపు, తెలుపు.

పరిహారాలు : నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం : కొత్త కార్యక్రమాలు చేపడతారు.ఆలయాలు సందర్శిస్తారు.అందరిలోనూ గుర్తింపు పొందుతారు.ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు.భూ, గృహయోగాలు కలుగుతాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారికి అంచనాలు నిజమవుతాయి.వ్యాపారాలలో ముందుకు సాగుతారు. లాభాలు తథ్యం.ఉద్యోగులకు ఊహించని విధంగా పదోన్నతి అవకాశాలు.రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు.ఐటీ నిపుణులకు విశేష లాభదాయకం.విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి.మహిళలకు మానసిక ప్రశాంతత.షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.అదృష్ట రంగులు.....ఆకుపచ్చ, తెలుపు.

పరిహారాలు :  అంగారక స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు : ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.సన్నిహితులతో స్వల్ప విభేదాలు.ఆప్తుల సలహాల మేరకు కొన్ని కార్యక్రమాలు చేపడతారు.పనులు పూర్తి కోసం శ్రమిస్తారు.ఆకస్మిక ప్రయాణాలు.ఇంటాబయటా సమస్యలు వేధిస్తాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారికి వివాదాలు.వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగస్థులకు ఒత్తిడులు పెరుగుతాయి.పారిశ్రామిక, కళారంగాల వారికి మానసిక అశాంతి.ఐటీ నిపుణులకు కొత్త చిక్కులు.విద్యార్థులకు అనుకున్న ఫలితాలు కష్టమే.మహిళలకు కుటుంబంలో సమస్యలు.షేర్ల విక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి.అదృష్ట రంగులు.....ఆకుపచ్చ, నేరేడు.

పరిహారాలు :  కనకధారా స్తోత్రాలు పఠించండి.

మకరం : నూతన పరిచయాలు.శుభ వార్తలు వింటారు.సన్నిహితులు, మిత్రులు అన్నివిధాలా సహాయపడతారు.పనులు సకాలంలోç పూర్తి చేస్తారు.గతంలో చేజారిన అవకాశాలు కొన్ని మళ్లీ దక్కుతాయి.మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. రాబడి ఆశించినంతగా ఉంటుంది.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కోర్టు వివాదాలు.వ్యాపారులకు లాభాలు రాగలవు.ఉద్యోగులకు ప్రమోషన్లు.రాజకీయ,కళారంగాల వారికి విదేశీ పర్యటనలు.ఐటీ నిపుణులకు శ్రమాధిక్యం.విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి.మహిళలకు మానసిక ఆందోళన.షేర్ల విక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి.అదృష్ట రంగులు.....నీలం, నేరేడు.

పరిహారాలు :  గణేశాష్టకం పఠించండి.

కుంభం : ముఖ్యమైన కార్యక్రమాలు హఠాత్తుగా వాయిదా.శ్రమాధిక్యం.బంధువర్గంతో విరోధాలు.మానసిక అశాంతి.భూ సంబంధిత వివాదాలు.ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.ఆరోగ్య సమస్యలు .రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొత్త సమస్యలు.వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.ఉద్యోగులు బాధ్యతల విషయంలో అప్రమత్తంగా మెలగాల్సిన సమయం.పారిశ్రామిక, కళారంగాల వారికి ఒత్తిడులు పెరుగుతాయి.ఐటీ నిపుణులకు వివాదాలు.విద్యార్థులు ఆశించిన ఫలితాలు రాక సతమతమమవుతారు.మహిళలకు ఆస్తి వివాదాలు.షేర్ల విక్రయాలలో గందరగోళం.అదృష్ట రంగులు.....నలుపు, నేరేడు .

పరిహారాలు :  అంగారక స్తోత్రాలు పఠించండి.

మీనం : ప్రయత్నాలు ఫలిస్తాయి.సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి.ఉత్సాహంతో పనులు చేపడతారు.ఆలోచనలు అమలులో ముందుకు సాగుతారు.అందరిలోనూ గుర్తింపునకు తాపత్రయపడతారు.నూతన వస్తు, వస్త్రలాభాలు.ప్రముఖులతో పరిచయాలు సంతోషంకలిగిస్తాయి.ఆదాయం సంతృప్తినిస్తుంది.రియల్‌ ఎస్టేట్‌ల వారికి అవకాశాలు పెరుగుతాయి.ఉద్యోగాల్లో హోదాలు లభిస్తాయి.వ్యాపారాలలో లైసెన్సులు పొందుతారు. లాభాలు రాగలవు.పారిశ్రామిక, కళారంగాల వారికి పురస్కారాలు.ఐటీ నిపుణులకు అవార్డులు.విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు.మహిళలకు ఆస్తిలాభం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు.....పసుపు, గులాబీ.

పరిహారాలు :  లక్ష్మీ స్తోత్రాలు పఠించండి. 

సంబంధిత వర్గం
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.