(Local) Fri, 15 Nov, 2019

నవంబర్ 04-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..

November 04, 2019,   11:29 AM IST
Share on:
నవంబర్ 04-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం : శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది.పనులలో విజయం సాధిస్తారు.వాహనాలు, భూములు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.వివాహ యత్నాలు సఫలం.ఆలయాలు సందర్శిస్తారు.ఆకస్మిక ధన ప్రాప్తి.రియల్‌ ఎస్టేట్‌లకు సంబంధించిన వారికి మరింత అభివృద్ధి.వ్యాపారాలు విస్తరిస్తారు.ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి..రాజకీయ,వైద్య రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.ఐటీ నిపుణుల యత్నాలు సఫలం.విద్యార్థులు కొత్త విద్యావకాశాలు పొందుతారు.మహిళలకు సంతోషకరమైన సమాచారం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు...నీలం, తెలుపు.

పరిహారాలు : సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని పూజించండి.

వృషభం : ఆర్థిక పరిస్థితి  అంతగా అనుకూలించదు.సన్నిహితుల నుంచి అపవాదులు ఎదుర్కొంటారు.పరిస్థితులు అంతగా అనుకూలించవు.పాత సంఘటన గుర్తుకువస్తుంది.ఆరోగ్య, కుటుంబ సమస్యలు వేధిస్తాయి.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.కాంట్రాక్టులు, రియల్‌ఎస్టేట్‌ల వారికి లేనిపోని వివాదాలు.వ్యాపారాలలో ఆటుపోట్లు.ఉద్యోగులకు మార్పులు.విద్యార్థులకు చికాకులు పెరుగుతాయి.మహిళలకు నిరుత్సాహం.షేర్ల విక్రయాలలో లాభాలు స్వల్పంగా ఉంటాయి.అదృష్ట రంగులు...పసుపు, ఎరుపు.

పరిహారాలు : విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.

మిథునం : కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి.దూర ప్రయాణాలు.పరిస్థితులు అనుకూలించవు.మీ అభిప్రాయాలు  కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తారు.శారీరక  రుగ్మతలు.రాబడి కొంత తగ్గి రుణాల కోసం ప్రయత్నిస్తారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి గందరగోళంగా ఉంటుంది.వ్యాపారులు కొంత నిదానంతో సాగాలి.ఉద్యోగవర్గాలకు ఆకస్మిక బదిలీలు.పారిశ్రామికవర్గాలకు కొంత అసంతృప్తి.ఐటీ నిపుణులకు మార్పులు తథ్యం.విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందలేరు.మహిళలకు నిరుత్సాహం.షేర్ల విక్రయాలు సాదాసీదాగా ఉంటాయి.అదృష్ట రంగులు..గులాబీ, గోధుమ.

పరిహారాలు : శివ స్తోత్రాలు పఠించాలి.

కర్కాటకం : శ్రమ ఫలించే సమయం.మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు.ఇళ్లు, స్థలాలు కొంటారు.పనులు చకచకా పూర్తి చేస్తారు.తీర్థ యాత్రలు చేస్తారు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.వాహనయోగం.రియల్‌ ఎస్టేట్‌ల వారికి మరింత అనుకూల పరిస్థితి.వ్యాపార లావాదేవీల్లో ఉత్సాహం.ఉద్యోగవర్గాలకు పదోన్నతులు.రాజకీయవర్గాలకు మరింత యోగదాయకంగా ఉంటుంది.విద్యార్థులకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది.మహిళలకు ఆసక్తికరమైన సమాచారం అందుతుంది.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు...గోధుమ, గులాబీ.

పరిహారాలు : సత్యనారాయణస్వామిని పూజించండి.

సింహం : ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.సేవా, ధార్మిక  కార్యక్రమాలలో పాల్గొంటారు.చిరకాల స్వప్నం ఫలిస్తుంది.సన్నిహితులతో తగాదాలు తీరతాయి.ఆలయ దర్శనాలు..రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొత్త అవకాశాలు.వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.ఉద్యోగవర్గాలకు అనుకోని ఇంక్రిమెంట్లు.విద్యార్థులకు పరిశోధనల్లో అనుకూలత.మహిళలకు నూతనోత్సాహం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు...ఆకుపచ్చ, బంగారు.

పరిహారాలు : అంగార కస్తోత్రాలు పఠించండి.

కన్య : ప్రయాణాలలో ఆటంకాలు.కొన్ని పనులు వాయిదా వేస్తారు.బంధువులతో తగాదాలు.కష్టపడ్డా ఫలితం కనిపించదు.వ్యవహారాలలో నిదానం అవసరం.అనారోగ్యం, ఔషధ సేవనం.కాంట్రాక్టర్లకు టెండర్లు చేజారవచ్చు.వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి.ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది.రాజకీయ, వైద్య రంగాల వారికి ఒత్తిడులు.ఐటీ నిపుణులకు సమస్యలు తప్పవు.విద్యార్థులకు మానసిక అశాంతి.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు...కాఫీ, తెలుపు.

పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.

తుల : కుటుంబంలో కలహాలు.కొత్తగా రుణాలు చేస్తారు.దూర ప్రయాణాలు సంభవం.కష్టపడ్డా ఆశించిన ఫలితం అందుకోలేరు.ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.కుటుంబసభ్యులతో అకారణంగా తగాదాలు.ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారు ఆచితూచి వ్యవహరించాలి.వ్యాపార లావాదేవీలు సాధారణంగా ఉంటాయి.ఉద్యోగులకు స్థానమార్పులు.రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఒడిదుడుకులు.ఐటీ నిపుణులకు వివాదాలు నెలకొంటాయి.విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి.మహిళలకు మానసిక అశాంతి.షేర్ల విక్రయాలలో లాభాలు దక్కవు.అదృష్ట రంగులు...గోధుమ, ఆకుపచ్చ.

పరిహారాలు : దత్తాత్రేయ స్తోత్రాలు పఠించాలి.

వృశ్చికం : ఆకస్మిక ధన లాభం.అప్రయత్నకార్యసిద్ధి.బంధువులతో వివాదాలు తీరి సఖ్యత నెలకొంటుంది.వాహనాలు, ఆభరణాలు కొంటారు..ప్రముఖులతో పరిచయాలు.ఆలయాలు సందర్శిస్తారు.భూ వివాదాలు తీరతాయి.కాంట్రాక్టర్లకు అనుకూల సందేశం.వ్యాపార లావాదేవీలు మరింత లాభసాటిగా ఉంటాయి.ఉద్యోగాలలో అనుకూలత.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు సన్మానాలు.ఐటీ నిపుణులకు వివాదాల నుంచి ఊరట.విద్యార్థులకు అవకాశాలు సంతృప్తినిస్తాయి.మహిళలకు ఉత్సాహంగా ఉంటుంది.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు...కాఫీ, ఆకుపచ్చ.

పరిహారాలు : గణపతిని పూజించండి.

ధనుస్సు : వ్యవహారాలలో ఆటుపోట్లు.బంధువులతో అకారణంగా తగాదాలు.ఆలోచనలు నిలకడగా ఉండవు.ప్రత్యర్థులతో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు.ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.దూరప్రయాణాలు ఉంటాయి.కాంట్రాక్టర్ల ప్రయత్నాలు ముందుకు సాగవు.వ్యాపార లావాదేవీలలో ఒడిదుడుకులు.ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు.రాజకీయ, పారిశ్రామికవర్గాలకు చికాకులు పెరుగుతాయి.ఐటీ నిపుణులకు అంచనాలు కొన్ని తప్పుతాయి..విద్యార్థులకు ఫలితాలు నిరాశ కలిగిస్తాయి.మహిళలకు కుటుంబసమస్యలు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు... కాఫీ, పసుపు.

పరిహారాలు : శివపంచాక్షరి పఠించండి.

మకరం : ముఖ్య వ్యవహారాలలో విజయం.నిరుద్యోగులకు ఉద్యోగ లాభం.ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.భార్యాభర్తల మధ్య వివాదాలు పరిష్కారం.కాంట్రాక్టర్లు, రియల్టర్ల కృషి ఫలిస్తుంది.వ్యాపారాలు పుంజుకుని లాభాలు అందుకుంటారు.ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు.ఐటీ నిపుణులకు ప్రోత్సాహకరమైన సమయం.విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు.మహిళలకు కుటుంబంలో గౌరవం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు...పసుపు, గులాబీ.

పరిహారాలు : బుధ గ్రహ స్తోత్రాలు పఠించండి.

కుంభం : ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు.బంధువులతో అకారణంగా విభేదాలు.ఆలోచనలు స్థిరంగా ఉండవు.అనారోగ్యం, ఔషధసేవనం.ఆలయాలు సందర్శిస్తారు.రియల్‌ ఎస్టేట్‌ల వారు అనుకున్న అవకాశాలు చేజార్చుకుంటారు.వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు.ఉద్యోగవర్గాలకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు.రాజకీయవేత్తలకు అంచనాలు తప్పుతాయి.ఐటీ నిపుణులకు గందరగోళంగా ఉంటుంది.విద్యార్థులు ఆశించిన ఫలితాలు కష్టమే.మహిళలకు ఆరోగ్యభంగం.షేర్ల విక్రయాలు లాభాలు కష్టమే.అదృష్ట రంగులు...ఆకుపచ్చ, బంగారు.

పరిహారాలు : నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.

మీనం : చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి.సంఘంలో గౌరవం పెరుగుతుంది.ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.చిరకాల మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు.సంఘంలో విశేషంగా  పరపతి పెరుగుతుంది.రియల్‌ ఎస్టేట్‌ల వారు లక్ష్యాలు సాధిస్తారు.వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.ఉద్యోగులకు పదోన్నతులు సంభవం.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఊహించని సన్మానాలు.ఐటీ నిపుణులకు పురస్కారాలు, అవార్డులు.విద్యార్థులు కొత్త అవకాశాలతో ముందుకు సాగుతారు.మహిళలకు శుభవర్తమానాలు.షేర్ల విక్రయాలలో అధిక లాభాలు తథ్యం.అదృష్ట రంగులు...ఆకుపచ్చ, బంగారు.

పరిహారాలు :  వేంకటేశ్వరస్వామిని పూజించండి.

సంబంధిత వర్గం
నవంబర్ 15-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 15-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.