(Local) Thu, 05 Dec, 2019

నవంబర్ 11-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..

November 11, 2019,   11:15 AM IST
Share on:
నవంబర్ 11-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం : ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి.మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు.సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.నూతన పరిచయాలు.దేవాలయాలు సందర్శిస్తారు.వాహనాలు, ఆభరణాలు కొంటారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి మరింత ఉత్సాహం.వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి.ఉద్యోగులకు ఊహించని పదోన్నతులు.పారిశ్రామికవర్గాలకు పురస్కారాలు.ఐటీ నిపుణులు కార్యరంగంలో విజయం సాధిస్తారు..విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి.మహిళలకు అరుదైన సన్మానాలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు.... గులాబీ,లేత ఎరుపు.

పరిహారాలు : దత్తాత్రేయ స్తోత్రాలు పఠించాలి.

వృషభం : ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.సన్నిహితుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు.పరిస్థితులు అంతగా అనుకూలించవు.వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.ఒక సంఘటన ఆశ్చర్యపరుస్తుంది.ఆరోగ్య, కుటుంబ సమస్యలు వేధిస్తాయి.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.కాంట్రాక్టులు శ్రమానంతరం దక్కించుకుంటారు.వ్యాపారాలలో ఆటుపోట్లు.ఉద్యోగులకు ఊహించని బదిలీలు.విద్యార్థులకు చికాకులు పెరుగుతాయి.మహిళలకు నిరుత్సాహం.షేర్ల విక్రయాలలో లాభాలు స్వల్పంగా ఉంటాయి.అదృష్ట రంగులు.... పసుపు, ఎరుపు.

పరిహారాలు : విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.

మిథునం : కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.పలుకుబడి పెరుగుతుంది.ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.ఆలయాలు సందర్శిస్తారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి సమస్యల నుంచి విముక్తి.వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.ఉద్యోగవర్గాలకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు కొన్ని ఇబ్బందులు తొలగుతాయి.విద్యార్థులకు లక్ష్యాలు సాధిస్తారు.మహిళలకు శుభవర్తమానాలు.షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.అదృష్ట రంగులు...... కాఫీ, పసుపు.

పరిహారాలు : హనుమాన్‌ఛాలీసా పఠించండి.

కర్కాటకం : ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు.అందరిలోనూ గౌరవం పెరుగుతుంది.బంధువుల ద్వారా సమాచారం అందుతుంది.అంచనాలు నిజమవుతాయి.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.సన్నిహితుల సాయం అందుతుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.రియల్‌ ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు చిక్కులు తొలగే సమయం.ఉద్యోగవర్గాలకు సంతోషకరమైన సమాచారం.విద్యార్థులు  ఉత్సాహంగా ముందుకు సాగుతారు.మహిళలకు ఆస్తిలాభ సూచనలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు...... ఎరుపు,తెలుపు.

పరిహారాలు : దత్తాత్రేయ పూజలు మంచిది.

సింహం : అనుకున్న ప్రయాణాలు వాయిదా.ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు.ఆలోచనలు నిలకడగా ఉండవు.మిత్రులతో విభేదాలు.శారీరక రుగ్మతలు, ఔషధసేవనం.రియల్‌ ఎస్టేట్‌ల వారికి సమస్యలు ఎదురుకావచ్చు.వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి.ఉద్యోగవర్గాలకు పని భారం.పారిశ్రామికవర్గాలకు చికాకులు.ఐటీ నిపుణులకు సామాన్యస్థితి.విద్యార్థులకు కొన్ని అవకాశాలు చేజారతాయి.మహిళలకు కుటుంబసభ్యులతో విభేదాలు.షేర్ల విక్రయాలలో ఆచితూచి వ్యవహరించండి.అదృష్ట రంగులు...  పసుపు, కాఫీ.

పరిహారాలు : హనుమాన్‌చాలీసా పఠించాలి.

కన్య : కుటుంబంలో చికాకులు.కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి.నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు.ఆరోగ్య భంగం.తీర్థ యాత్రలు చేస్తారు.దూర ప్రయాణాలు చేస్తారు..వ్యాపారాలు మందగిస్తాయి.ఉద్యోగులకు చికాకులు. ఐటీ నిపుణులకు కొంత గందరగోళంగా ఉంటుంది.విద్యార్థులకు కొన్ని అవకాశాలు తప్పిపోతాయి.మహిళలకు కుటుంబ సభ్యులతో వివాదాలు.షేర్ల విక్రయాలు నత్తనడకన సాగుతాయి.అదృష్ట రంగులు....... గోధుమ, ఆకుపచ్చ.

పరిహారాలు : విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.

తుల : ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.నూతన పరిచయాలు.ఆర్థిక వ్యవహారాలలో పురోగతి.కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొన్ని వివాదాలు తీరతాయి.వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.ఉద్యోగులకు పదోన్నతులు ఉంటాయి.రాజకీయ,వైద్య రంగాల వారికి విదేశీ ఆహ్వానాలు.ఐటీ నిపుణులకు ఉత్సాహవంతమైన కాలం.విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు.మహిళలకు శుభవార్తలు అందుతాయి.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు...... పసుపు, గులాబీ.

పరిహారాలు : శివాష్టకం పఠించండి.

వృశ్చికం : కొత్త కార్యక్రమాలు చేపడతారు.ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి.కొత్త విషయాలు తెలుస్తాయి.ఆలయాలు సందర్శిస్తారు.ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.వాహనాలు, ఆభరణాలు కొంటారు.రియల్‌ ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు చిక్కులు తొలగుతాయి.వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి.ఉద్యోగులకు పదోన్నతులు.రాజకీయవేత్తలకు ఆహ్వానాలు.ఐటీ నిపుణులకు అనుకోని విజయాలు..విద్యార్థులు అనుకోని అవకాశాలు దక్కించుకుంటారు.మహిళలకు ఆస్తి లాభ సూచనలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు...... లేత పసుపు, కాఫీ.

పరిహారాలు : నృసింహస్వామిని పూజించండి.

ధనుస్సు : వ్యయ ప్రయాసలు.ముఖ్యమైన కార్యక్రమాలు మందగిస్తాయి.ఇంటాబయటా ఒత్తిడులు.కష్టపడ్డా ఫలితం ఉండదు.బంధువులతో వివాదాలు నెలకొంటాయి.భార్యాభర్తల మధ్య అపార్ధాలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఆటుపోట్లు తప్పవు.వ్యాపార లావాదేవీల్లో ఆటంకాలు.ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు.విద్యార్థులకు నిరుత్సాహమే.మహిళలకు కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు...... పసుపు, గులాబీ.

పరిహారాలు : సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మకరం : అనుకున్న పనులు ముందుకు సాగవు.ఆలోచనలు స్థిరంగా ఉండవు.ఎంత కష్టించినా ఫలితం కనిపించదు.ఆస్తులు విషయంలో ఒప్పందాలు వాయిదా.ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి.బంధువులు మీపై అభాండాలు మోపే వీలుంది.నిరుద్యోగుల యత్నాలు ఫలించవు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి మరింతగా చికాకులు.వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.ఉద్యోగాలలో ఒడిదుడుకులు.విద్యార్థులకు ఫలితాలు అనుకూలించవు.మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది.షేర్ల విక్రయాలలో స్వల్ప లాభాలు.అదృష్ట రంగులు...ఆకుపచ్చ, తెలుపు.

పరిహారాలు : హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

కుంభం : ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.సన్నిహితుల సాయం అందుతుంది.వ్యవహారాలలో ఊహించని  విజయం.శుభకార్యాలలో పాల్గొంటారు.కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు.భార్యాభర్తల మధ్య మరింత సఖ్యత నెలకొంటుంది.రియల్‌ ఎస్టేట్‌ల వారు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు.వ్యాపారాలు నూతన పెట్టుబడులతో విస్తరిస్తారు.ఉద్యోగులకు హోదాలు అప్రయత్నంగా దక్కుతాయి.పారిశ్రామికవేత్తలకు సన్మానాలు.ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం..విద్యార్థులకు అవకాశాలు ఉత్సాహాన్నిస్తాయి.మహిళలకు శుభవార్తలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు... లేత ఎరుపు, కాఫీ.

పరిహారాలు : రామరక్షా స్తోత్రాలు పఠించండి.

మీనం : రుణాలు చేస్తారు.ఆకస్మిక ప్రయాణాలు.బంధువులు, మిత్రులతో విరోధాలు.కొన్ని పనుల్లో అవాంతరాలు.నిరుద్యోగులకు నిరుత్సాహం.ఆరోగ్య సమస్యలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి తొందరపాటు నిర్ణయాలు వద్దు.వ్యాపారులు మరింతగా  ఆలోచించి ముందుకు సాగాలి.ఉద్యోగులకు విధుల్లో చికాకులు.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు గందరగోళ పరిస్థితి.విద్యార్థులకు అందిన అవకాశాలు సైతం జారిపోతాయి.మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం ఉండదు.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు.... తెలుపు, గులాబీ.

పరిహారాలు : ఆంజనేయస్వామిని పూజించండి.

 

 

 

 

 

 

 

 

సంబంధిత వర్గం
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.