(Local) Thu, 05 Dec, 2019

నవంబర్ 13-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..

November 13, 2019,   11:01 AM IST
Share on:
నవంబర్ 13-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం : ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.ఆలోచనలు స్థిరంగా ఉండవు.ఇంటాబయటా సమస్యలు పెరుగుతాయి.దూర ప్రయాణాలు ఉంటాయి.సన్నిహితులు కూడా ప్రత్యర్థులుగా మారవచ్చు.అనారోగ్య సూచనలు.ఉద్యోగులకు కొన్ని మార్పులు.పారిశ్రామికవర్గాల వారికి శ్రమే మిగులుతుంది.ఐటీ నిపుణులకు కొత్త సమస్యలు.విద్యార్థులకు కొంత అనుకూలం.మహిళలకు ఆస్తి వివాదాలు.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు... ఆకుపచ్చ, తెలుపు.

పరిహారాలు : గణపతిని ఆరాధించండి.

వృషభం : ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.సన్నిహితుల సాయంతో వ్యవహారాలు చక్కదిద్దుతారు.సేవాకార్యక్రమాల పై ఆసక్తి చూపుతారు.ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.కాంట్రాక్టర్లకు శుభవార్తలు.వ్యాపారాల విస్తరణలో పురోగతి.ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి.ఐటీ నిపుణులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.విద్యార్థులకు సంతోషకర విషయాలు తెలుస్తాయి.మహిళలకు గౌరవమర్యాదలు పెరుగుతాయి.షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.అదృష్ట రంగులు... ఆకుపచ్చ, తెలుపు.

పరిహారాలు : హనుమాన్‌ఛాలీసా పఠించండి.

మిథునం : ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.వ్యయప్రయాసలు తప్పకపోవచ్చు.కొన్ని కార్యక్రమాల్లో ఆటంకాలు.కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు.దూర ప్రయాణాలు చేస్తారు.పుణ్య క్షేత్రాల సందర్శనం.రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఇబ్బందులు.వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరగవచ్చు.విద్యార్థులకు ఫలితాలు అనుకూలించవు. మహిళలకు ఒత్తిడులు పెరుగుతాయి.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టసాధ్యమే.అదృష్ట రంగులు... ఎరుపు, తెలుపు.

పరిహారాలు : దుర్గాదేవికి కుంకుమార్చన మంచిది.

కర్కాటకం : ముఖ్యమైన పనుల్లో పురోగతి కనిపిస్తుంది.బంధువర్గంతో విభేదాలు పరిష్కారం.ఆలయాలు సందర్శిస్తారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి మరింత ప్రోత్సాహం.కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు  అందుతాయి.ఐటీ నిపుణులకు ఆహ్వానాలు.విద్యార్థులు పరిశోధనలపై ఆసక్తి చూపుతారు.మహిళలకు ఆస్థి లాభాలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు... గోధుమ, పసుపు.

పరిహారాలు : నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

సింహం : దూరపు బంధువుల నుంచి శుభవర్తమానాలు.వాహనాలు, ఆభరణాలు కొంటారు.స్థిరాస్తి వివాదాలు తీరతాయి.అదనపు రాబడి పొందుతారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.రియల్‌ ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు మరింత అభివృద్ధి.ఉద్యోగాల్లో  సమస్యలు తీరతాయి..వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం.ఐటీ నిపుణులకు విజయాలు..విద్యార్థులకు పురస్కారాలు.మహిళలకు ఆహ్వానాలు అందుతాయి.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్టరంగులు... నీలం, తెలుపు.

పరిహారాలు : వేంకటేశ్వరస్వామిని పూజించాలి.

కన్య : అనుకోని ప్రయాణాలు చేస్తారు.బంధుమిత్రుల నుంచి కొన్ని అపవాదులు..స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.శారీరక రుగ్మతలు.ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారికి వివాదాలు.వ్యాపారాలలో తొందరపాటు వద్దు.ఉద్యోగులకు స్థానచలనం.పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి ఒత్తిడులు.ఐటీ నిపుణులకు ఒడిదుడుకులు.విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. మహిళలకు కొంత ఆందోళన.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు... పసుపు, గోధుమ.

పరిహారాలు : అంగారక స్తోత్రాలు పఠించండి.

తుల : వ్యవహారాలు మందగిస్తాయి.ఆకస్మిక ప్రయాణాలు.కుటుంబంలో చికాకులు.ఆరోగ్య సమస్యలు, ఔషధసేవనం.వాహన చోదకులు నిదానం పాటించాలి.ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఇబ్బందులు.వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు.విద్యార్థులకు గందరగోళ పరిస్థితి.మహిళలకు అనారోగ్యం.షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.అదృష్ట రంగులు... ఎరుపు, తెలుపు.

పరిహారాలు : కనకధారా స్తోత్రం పఠించండి.

వృశ్చికం : పనుల్లో పురోగతి సాధిస్తారు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ఊహించని ఆహ్వానాలు అందుతాయి.కోర్టు వివాదాల నుంచి బయటపడతారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి భూలాభాలు.వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.ఉద్యోగాలలో  హోదాలు తథ్యం.పారిశ్రామికవర్గాలకు విదేశీయానం. ఐటీ నిపుణులు సమర్థత చాటుకుంటారు.విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.మహిళలకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు.... పసుపు,బంగారు.

పరిహారాలు : కనకదుర్గాదేవిని పూజించండి.

ధనుస్సు : ఆర్థికంగా లాభాలు.వాహనాలు, ఇళ్లు కొంటారు.కుటుంబ సభ్యుల ప్రోత్సాహం.ఆలయాలు సందర్శిస్తారు.వేడుకలకు హాజరవుతారు.కాంట్రాక్టర్లకు ఊహించని అభివృద్ధి.వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి.ఉద్యోగాల్లో అనుకున్న మార్పులు సంభవం.పారిశ్రామికవర్గాలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి.ఐటీ నిపుణులకు విదేశీ అవకాశాలు.విద్యార్థులు నైపుణ్యత చాటుకుంటారు.మహిళలకు సన్మానాలు.షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.అదృష్ట రంగులు.... గోధుమ, ఆకుపచ్చ.

పరిహారాలు : దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

మకరం : రాబడికి మించి ఖర్చులు ఉంటాయి.కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు.శారీరక రుగ్మతలు.కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి సమస్యలు ఎదురుకావచ్చు.వ్యాపార లావాదేవీలో ఆటుపోట్లు.ఉద్యోగులకు విధి నిర్వహణలో ఒత్తిడులు.ఐటీ నిపుణులకు మార్పులు జరిగే వీలుంది..విద్యార్థులకు ఒత్తిడులు అధికమవుతాయి.మహిళలు నిర్ణయాలలో తొందరపాటు పడరాదు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు... ఆకుపచ్చ, గోధుమ.

పరిహారాలు : గణపతిని పూజించండి.

కుంభం : పనులలో అవాంతరాలు.వివాదాలకు దూరంగా ఉండండి.సోదరులు, మిత్రులతో విభేదాలు.ఆరోగ్య సమస్యలు.వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు..బంధువులతో తగాదాలు..కాంట్రాక్టర్లు, రియల్టర్లు ఆచితూచి వ్యవహరించాలి.వ్యాపారాలలో పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించండి.ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది.విద్యార్థులకు ఒడిదుడుకులు.మహిళలకు కుటుంబసమస్యలు.షేర్ల విక్రయాలలో అనుకున్న లాభాలు కష్టమే.అదృష్ట రంగులు... గులాబీ, నీలం.

పరిహారాలు : హనుమాన్‌ పూజలు మంచిది.

మీనం : నూతన  పరిచయాలు.ఒక సమాచారం మరింత ఉత్సాహాన్నిస్తుంది.మిత్రులతో వివాదాల పరిష్కారం.భూములు కొంటారు.ఆశ్చర్యకరమైన సంఘటనలు.కాంట్రాక్టర్లకు ఊహించని విధంగా టెండర్లు దక్కుతాయి.వ్యాపారాలలో ముందుకు సాగుతారు.ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.ఐటీ నిపుణులు సత్తా చాటుకుంటారు.విద్యార్థులకు నూతన విద్యావకాశాలు.మహిళలకు శుభవార్తలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు... ఎరుపు, ఆకుపచ్చ.

పరిహారాలు : దత్తాత్రేయుని పూజించండి.

సంబంధిత వర్గం
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.