(Local) Fri, 13 Dec, 2019

నవంబర్ 14-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..

November 14, 2019,   12:46 PM IST
Share on:
నవంబర్ 14-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం : ఆదాయం అంతగా కనిపించదు.కుటుంబ సమస్యలు కొంత వేధిస్తాయి.వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.సన్నిహితులతో అకారణంగా విభేదాలు ఏర్పడవచ్చు.శారీరక సంబంధిత  రుగ్మతలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి చిక్కులు.వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు.పారిశ్రామికవర్గాలకు కలసివచ్చే కాలం.ఐటీ నిపుణులకు సంతోషదాయకంగా ఉంటుంది.విద్యార్థులకు ఒత్తిడులు.మహిళలు ఆరోగ్యపరమైన చికాకులు.షేర్ల విక్రయాలు నిరాశ కలిగిస్తాయి.అదృష్ట రంగులు....గులాబీ, పసుపు.

పరిహారాలు :  రామరక్షా స్తోత్రాలు పఠించండి.

వృషభం : ఒక వివాదం నుంచి బయటపడతారు.ఆలోచనలు అమలు చేస్తారు.చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.నిరుద్యోగులకు  ఉద్యోగాలు దక్కుతాయి.రాబడి మరింత సంతృప్తినిస్తుంది.కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.వ్యాపారాలలో పురోగతి.ఉద్యోగులకు ఉన్నతస్థాయి దక్కవచ్చు.రాజకీయవర్గాలకు ఆశించిన ప్రగతి కనిపిస్తుంది.ఐటీ నిపుణులు సమస్యల నుంచి గట్టెక్కుతారు.విద్యార్థులకు కొత్తవిద్యావకాశాలు.మహిళలకు నూతనోత్సాహం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....ఆకుపచ్చ, కాఫీ.

పరిహారాలు :  గణపతిని పూజించండి.

మిథునం : ఆకస్మిక ప్రయాణాలు.కొన్ని ఒప్పందాలు వాయిదా వేస్తారు.పనుల్లో ప్రతిబంధకాలు.భార్యాభర్తల మధ్య వివాదాలు.శ్రమకు తగిన ఫలితం దక్కక డీలా పడతారు.వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి చిక్కులు.వ్యాపారాలలో లాభాలు అంతగా ఉండవు.ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.రాజకీయ, పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు.ఐటీ నిపుణులకు కొన్ని వివాదాలు తప్పవు.విద్యార్థులకు ఒడిదుడుకులు.మహిళలకు ఆరోగ్యసమస్యలు.షేర్ల విక్రయాలు నిరాశ కలిగిస్తాయి.అదృష్ట రంగులు....కాఫీ, బంగారు.

పరిహారాలు :  దత్తాత్రేయుని పూజించండి.

కర్కాటకం : ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.నూతన వ్యక్తుల పరిచయం.బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు.ఆస్తి వివాదాల పరిష్కారం.ఇంటాబయటా మరింత సానుకూలత.ఆలయాలు సందర్శిస్తారు.చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి చిక్కులు తొలగుతాయి.వ్యాపార లావాదేవీలలో పురోగతి.ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.రాజకీయవర్గాలకు పదవీయోగం.ఐటీ నిపుణులు సత్తా చాటుకుంటారు.విద్యార్థులు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి.షేర్ల విక్రయాలలో అధికలాభాలు.అదృష్ట రంగులు....కాఫీ, పసుపు.

పరిహారాలు :  లక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

సింహం : ఉద్యోగ యత్నాలు సానుకూలం.ప్రముఖులతో పరిచయాలు.ఆలోచనలు అమలు చేస్తారు.పదిమందిలోనూ గౌరవమర్యాదలకు లోటు ఉండదు.ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి.అదనపు రాబడి దక్కి ఉత్సాహంగా గడుపుతారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి సమస్యల నుంచి ఉపశమనం.వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి.ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు రాగలవు.రాజకీయ, పారిశ్రామికవేత్తలకు కృషి ఫలిస్తుంది.ఐటీ నిపుణులకు విశేష గుర్తింపు.విద్యార్థులకు అనుకోని అవకాశాలు.మహిళలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి.షేర్ల విక్రయాలలో అధిక లాభాలు.అదృష్ట రంగులు....తెలుపు,పసుపు.

పరిహారాలు :  ఆదిత్య హృదయం పఠించండి.

కన్య : కుటుంబంలో చికాకులు.వివాదాలకు దూరంగా ఉండండి.భార్యాభర్తల మధ్య విభేదాలు.అనుకోని ప్రయాణాలు.శ్రమ మరింతగా పెరుగుతుంది.ఆదాయం నిరుత్సాహపరుస్తుంది.రియల్‌ఎస్టేట్‌ల వారికి సామాన్యమే.వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.ఉద్యోగాల్లో మార్పులు ఉండవచ్చు..విద్యార్థులకు ఒత్తిడులు తప్పకపోవచ్చు.మహిళలకు అనారోగ్యం.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు....లేత పసుపు, గులాబీ.

పరిహారాలు :  విష్ణు ధ్యానం చేయండి.

తుల : ప్రయాణాలు మధ్యలో వాయిదా వేసుకుంటారు.పనులలో అవాంతరాలు.ఆప్తుల నుంచి సమస్యలు.నిరుద్యోగుల అంచనాలు తప్పుతాయి.బంధువర్గం నుంచి ఒత్తిడులు.భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు.రాబడి కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.ఉద్యోగులకు విధి నిర్వహణలో చిక్కులు.వ్యాపారులు మరింత నిదానం పాటించడం ఉత్తమం.పారిశ్రామిక,రాజకీయవర్గాలకు చికాకులు.ఐటీ నిపుణులకు అదనపు బాధ్యతలు.విద్యార్థులకు ఒత్తిడులు తప్పవు.మహిళలు మానసిక ఆందోళన చెందుతారు.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు....నీలం, కాఫీ.

పరిహారాలు :  రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం : అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఆర్థిక వ్యవహారాలలో పురోగతి.గృహ నిర్మాణయత్నాలు.సోదరులతో కుటుంబ విషయాలు చర్చిస్తారు.శుభకార్యాల్లో పాల్గొంటారు.కొత్త కాంట్రాక్టులు పొందుతారు.విచిత్రమైన సంఘటనలు.వాహన యోగం.వ్యాపారాలు సజావుగా సాగుతాయి.ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కే సూచనలు.రాజకీయ, వైద్య రంగాల వారికి యోగదాయకమైన కాలం.ఐటీ నిపుణులు సామర్ధ్యాన్ని నిరూపించుకుంటారు.విద్యార్థులకు పరిశోధనలు అనుకూలిస్తాయి.మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు....పసుపు, గోధుమ.

పరిహారాలు :  దేవీ ఖడ్గమాల పఠించండి.

ధనుస్సు : దూర ప్రాంతాల నుంచి శుభవర్తమానాలు.ఆప్తుల సలహాలు పాటిస్తారు..అందరిలోనూ మీ మాటే చెల్లుతుంది.నూతన ఉద్యోగ ప్రాప్తి.ఆలోచనలు అమలు చేస్తారు.భార్యాభర్తల మధ్య సయోధ్య.ఆకస్మిక ధన లాభం.వ్యాపారాలు మరింత ఊపందుకుంటాయి.ఉద్యోగులకు ఉన్నత హోదాలు.రాజకీయ, వైద్య రంగాలవారికి సన్మానాలు.విద్యార్థులకు అరుదైన పురస్కారాలు.మహిళలకు ఇంటాబయటా గౌరవం పెరుగుతుంది.షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.అదృష్ట రంగులు....కాఫీ, ఆకుపచ్చ.

పరిహారాలు :  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మకరం : చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు.అనుకోని ప్రయాణాలు.సోదరులతో ఆస్తి వివాదాలు నెలకొంటాయి.ఆత్మీయుల సలహాలు కోరతారు.ఆరోగ్య సమస్యలు.నిరుద్యోగులకు పరిస్థితులు అనుకూలించవు.మిత్రులు శత్రువులుగా మారతారు.రియల్‌ఎస్టేట్‌ల వారికి కొన్ని చిక్కులు.వ్యాపారాలలో కొంత నిరాశ.ఉద్యోగులకు స్థాన మార్పులు.పారిశ్రామిక,రాజకీయవర్గాలకు ఆటుపోట్లు.ఐటీ నిపుణులకు ఒత్తిడులు.విద్యార్థులకు చికాకులు పెరుగుతాయి.మహిళలు నిర్ణయాలలో తొందరపడరాదు.షేర్ల విక్రయాలు స్వల్పంగా ఉంటాయి.అదృష్ట రంగులు....కాఫీ,ఎరుపు.

పరిహారాలు :  అంగారక స్తోత్రాలు పఠించండి.

కుంభం : ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.వ్యవహారాలలో ఆటంకాలు.దూర ప్రయాణాలు.ముఖ్య  కార్యక్రమాలు కాస్త మందగిస్తాయి.కుటుంబ సభ్యులతో వివాదాలు.వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.ఉద్యోగాల్లో చికాకులు.పారిశ్రామిక,వైద్య రంగాల వారికి శ్రమ పెరుగుతుంది.ఐటీ నిపుణులకు శ్రమాధిక్యం.విద్యార్థులకు  విద్యావకాశాలు నిరాశ కలిగిస్తాయి.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు....గోధుమ, ఎరుపు.

పరిహారాలు :  లక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

మీనం : దూరపు బంధువుల కలయిక.ఇంటాబయటా ప్రోత్సాహం.ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.గత సంఘటనలు నెమరువేసుకుంటారు.సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరి అడుగు ముందుకు వేస్తారు.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.రాజకీయ,వైద్య రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.ఐటీ నిపుణులకు కొత్త ఆశలు.విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి.మహిళలకు శుభవర్తమానాలు.షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.అదృష్ట రంగులు....ఆకుపచ్చ, గోధుమ.

పరిహారాలు :  నృసింహ స్తోత్రాలు పఠించండి.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.