(Local) Wed, 01 Apr, 2020

నవంబర్ 19-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..

November 19, 2019,   11:54 AM IST
Share on:
నవంబర్ 19-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం : మిత్రులతో అకారణ వైరం.రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి.ఆలోచనలు  కలసిరావు.స్వల్ప శారీరక రుగ్మతలు వేధిస్తాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారు అనుకున్న విధంగా క్రయవిక్రయాలు జరుపుతారు.వ్యాపారులకు స్వల్ప లాభాలు.ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తప్పవు.పారిశ్రామికవేత్తలకు చికాకులు పెరుగుతాయి.ఐటీ నిపుణులకు కొద్దిపాటి సమస్యలు.విద్యార్థులకు అవకాశాలు ఎట్టకేలకు దక్కుతాయి.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు...తెలుపు, పసుపు.

పరిహారాలు : సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృషభం : చేపట్టిన పనులు కొంత నిదానిస్తాయి.అందరిలోనూ గుర్తింపు కోసం యత్నిస్తారు.ఆర్థిక లావాదేవీలు మందగించినా అవసరాలు తీరతాయి.ఆస్తి వివాదాలు తీరి లాభపడతారు.రియల్‌ ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు సామాన్యంగా ఉంటుంది.వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది. విస్తరణ యత్నాలు సానుకూలం.ఉద్యోగులకు పై స్థాయి నుంచి అభినందనలు.పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వ్యవహారాలలో విజయం.ఐటీ నిపుణులకు ఒత్తిడులు తప్పకపోవచ్చు..విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు.మహిళలకు శుభవర్తమానాలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు...నీలం, లె లుపు.

పరిహారాలు : గణపతిని ఆరాధించండి.

మిథునం : ఆర్థిక విషయాలలో కొంత పురోగతి.బంధువర్గంతో విరోధాలు ఏర్పడవచ్చు.శ్రమకు ఫలితం కొంత కనిపిస్తుంది.శారీరక రుగ్మతలు.రియల్‌ ఎస్టేట్‌ల వారి యత్నాలు ఫలిస్తాయి.వ్యాపారులు నిదానంగా వ్యవహరించాలి.ఉద్యోగాల్లో ఒత్తిడులు అధికమవుతాయి.రాజకీయవర్గాలకు మందకొడిగా ఉంటుంది.ఐటీ నిపుణులకు అవకాశాలు దక్కినా కొంత నిరాశ తప్పదు.విద్యార్థులకు అవకాశాలు తప్పిపోతాయి.మహిళలకు నిరుత్సాహమే.షేర్ల విక్రయాలు నత్తనడకన సాగుతాయి.అదృష్ట రంగులు...గులాబీ, లేత ఎరుపు.

పరిహారాలు : గణేశ్‌ ప్రార్ధనలు చేయండి.

కర్కాటకం : నూతన  ఉద్యోగావకాశాలు లభిస్తాయి.సేవాకార్యక్రమాల పై దృష్టి సారిస్తారు.సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి.వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.చేపట్టిన కార్యక్రమాలు కొంత నిరాశ పరుస్తాయి.పలుకుబడి పెరుగుతుంది.ఆలయ దర్శనాలు చేసుకుంటారు.కాంట్రాక్టర్ల శ్రమ కొంత వృథా కాగలదు.వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.ఉద్యోగులకు  ఉన్నత హోదాలు లభించే అవకాశం.ఐటీ రంగం వారికి ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది.రాజకీయవర్గాలకు సన్మానాలు, విదేశీ పర్యటనలు.ఐటీ నిపుణులకు మరింత ఉత్సాహం..విద్యార్థులు కొత్త విద్యావకాశాలు దక్కించుకుంటారు.మహిళలకు ఆస్తిలాభాలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు...ఎరుపు, ఆకుపచ్చ.

పరిహారాలు : నరసింహ స్తోత్రాలు పఠించాలి.

సింహం : వ్యయప్రయాసలు ఎదురైనా అనుకున్న పనులు పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో విరోధాలు.దూర ప్రయాణాలు ఉండవచ్చు.రాబడి కొంత నిరుత్సాహపరుస్తుంది.రియల్‌ఎస్టేట్‌ల వారికి గందరగోళంగా ఉంటుంది.వ్యాపారాలలో ఆటుపోట్లు తప్పవు.ఉద్యోగులకు స్థాన మార్పులు.కళాకారులకు  ఆటంకాలు ఎదురవుతాయి.ఐటీ నిపుణులకు ఒక ఆహ్వానం ఊరటనిస్తుంది.విద్యార్థులకు నిరాశ తప్పదు.మహిళలకు మానసిక అశాంతి.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు...గోధుమ, కాఫీ.

పరిహారాలు : వేంకటేశ్వరస్వామిని పూజించాలి.

కన్య : అంచనాలు నిజమై ఊరట చెందుతారు.ఆలోచనలు కలిసి వస్తాయి.కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదాలు.ఆర్థిక పరిస్థితి నిరాశ పర్చినా అవసరాలకు లోటు రాదు.సోదరులతో సంతోషంగా గడుపుతారు.రియల్‌ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్ల యత్నాలు మందగిస్తాయి.వ్యాపారాలు సజావుగా సాగుతాయి.ఉద్యోగులు ఉత్సాహంగా సాగుతాయి.రాజకీయవర్గాల యత్నాలు సఫలం.ఐటీరంగం వారికి నూతన అవకాశాలు.పారిశ్రామిక, వైద్యరంగాల వారికి పురస్కారాలు.విద్యార్థులు అనుకున్న లక్షాలు సాధిస్తారు.మహిళలకు శుభవార్తలు వింటారు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు...ఆకుపచ్చ, కాఫీ.

పరిహారాలు : శివ స్తోత్రాలు పఠించాలి.

తుల : బంధువుల సూచనలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి.ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి.చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.రియల్‌ ఎస్టేట్‌ల వారి కృషి ఫలించవచ్చు.వ్యాపారాలు ఊహించిన విధంగా ఉంటాయి.ఉద్యోగులకు ప్రోత్సాహకరమైన కాలం.కళాకారులకు నూతనోత్సాహం, అవార్డులు దక్కుతాయి.ఐటీ నిపుణులకు అంచనాలు కొంత తప్పుతాయి.పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు.విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు.మహిళలకు ఆస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు...ఆకుపచ్చ, నలుపు.

పరిహారాలు :  హనుమాన్‌ చాలీసా పఠించండి.

వృశ్చికం : చేపట్టిన కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది.బంధువర్గంతో విరోధాలు.శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు.ఆరోగ్య ,కుటుంబ సమస్యలు వేధిస్తాయి.ఉద్యోగావకాశాలు నిరాశకలిగిస్తాయి.రియల్‌ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు కొంత ఊరట లభిస్తుంది.వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు.ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు.పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.ఐటీ రంగం వారికి కొన్ని చిక్కుల నుంచి ఉపశమనం.విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.అదృష్ట రంగులు...నీలం, ఆకుపచ్చ.

పరిహారాలు : గణేశ్‌ ప్రార్ధనలు చేయండి.

ధనుస్సు : కొత్త రుణాలు కోసం యత్నిస్తారు.కుటుంబ సభ్యులతో కీలక అంశాలపై చర్చలు.పనుల్లో కొంత పురోగతి.బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారు కొంత నిరాశకు లోనవుతారు.వ్యాపారాలలో నత్తనడకన సాగుతాయి.ఉద్యోగులకు స్థానచలన సూచనలు.రాజకీయవర్గాలకు పదవులు ఊరిస్తాయే తప్ప దరిచేరవు.ఐటీ రంగం వారికి ముఖ్య సమాచారం అందుతుంది.విద్యార్థులకు అనుకున్న ఫలితాలు కష్టమే.మహిళలకు కుటుంబసభ్యులతో విభేదాలు.షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.అదృష్ట రంగులు...ఎరుపు, పసుపు.

పరిహారాలు :  వేంకటేశ్వరస్వామిని పూజించాలి.

మకరం :రావలసిన సొమ్ము అందుతుంది.వ్యవహారాలలో విజయం.శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు.మీ అంచనాలు నిజమవుతాయి.సేవాకార్యక్రమాలో పాల్గొంటారు.ఇంటి నిర్మాణాలు చేపడతారు.కాంట్రాక్టర్ల యత్నాలు నెమ్మదిగా సాగుతాయి.వ్యాపారాలు అభివృద్ధిదిశగా సాగుతాయి.ఉద్యోగాలలో ఉన్నతస్థితి.పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు.ఐటీరంగం వారికి అనుకూల మార్పులు..విద్యార్థులకు పరిశోధనల్లో గుర్తింపు.మహిళలకు ఆస్తిలాభాలు.షేర్ల విక్రయాలులాభిస్తాయి.అదృష్ట రంగులు...గోధుమ, కాఫీ.

పరిహారాలు : వేంకటేశ్వరస్వామిని పూజించండి.

కుంభం : అదనపు ఆదాయం సమకూరుతుంది.సన్నిహితులు, మిత్రులతో విభేదాలు తొలగుతాయి.చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం.తీర్థ యాత్రలు చేస్తారు.రియల్‌ ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్ల యత్నాలలో కదలికలు.వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.దుకు సాగుతాయి.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.రాజకీయవర్గాలకు పదవీయోగం.ఐటీ రంగం వారికి అవకాశాలు నిరాశ పరుస్తాయి.విద్యార్థులకు పురస్కారాలు.మహిళలకు శుభవర్తమానాలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు...పసుపు, ఆకుపచ్చ.

పరిహారాలు : విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

మీనం : వ్యవహారాలలో ఎట్టకేలకు విజయం.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.అనుకోని ఖర్చులు ఉంటాయి.బంధువులు, మిత్రులతో కలహాలు.కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు.వివాదాలకు దూరంగా ఉండండి.ఆలయాలు సందర్శిస్తారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది.వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.ఉద్యోగులకు హోదాలు సంతృప్తినీయవు.పారిశ్రామికవేత్తలకు నిరుత్సాహమే.ఐటీ రంగం వారికి అనుకోని మార్పులు జరిగే సూచనలు.విద్యార్థులు అనుకున్న ఫలితాల కోసం శ్రమపడాలి.మహిళలకు కుటుంబసమస్యలు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు...గులాబీ, లేత పసుపు.

పరిహారాలు :  హనుమాన్‌ చాలీసా పఠించండి.

సంబంధిత వర్గం
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 17-2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 17-2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.