(Local) Sun, 15 Dec, 2019

నవంబర్ 27-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..

November 27, 2019,   11:58 AM IST
Share on:
నవంబర్ 27-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం : రుణాలు చేస్తారు.ఆకస్మిక పయాణాలు సంభవం.మిత్రుల నుంచి సమస్యలు ఎదుర్కొంటారు.కష్టపడ్డా ఫలితం స్వల్పంగానే ఉంటుంది.సోదరులను కలుసుకుని ముఖ్యవిషయాలు చర్చిస్తారు.శారీరక సంబంధిత రుగ్మతలు.కాంట్రాక్టర్లకు శుభవర్తమానాలు.వ్యాపారాలలో ఒడిదుడుకులు.ఉద్యోగులకు బదిలీ సూచనలు.కళాకారులు, పారిశ్రామికవర్గాల వారు నిదానంగా వ్యవహరించాలి..ఐటీ నిపుణులకు కొంత ఉత్సాహవంతంగా ఉంటుంది.విద్యార్థులకు కొత్త ఆశలు.మహిళలకు స్వల్ప అస్వస్థత.షేర్ల విక్రయాలలో స్వల్ప లాభాలు.అదృష్ట రంగులు...ఎరుపు, పసుపు.

పరిహారాలు : హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

వృషభం : వ్యవహారాలలో పురోగతి.కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన.రెండుమూడు విధాలుగా ధన లాభంసన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు.ప్రయత్నాలు ఫలించే సమయం.ఉద్యోగాల్లో  అనుకూల వాతావరణం.వ్యాపారులకు లాభాలు.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు  సత్కారాలు.ఐటీ నిపుణులకు చికాకులు.విద్యార్థులకు కొంత గందరగోళం.మహిళలకు స్వల్ప ధనలబ్ధి.షేర్ల విక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి.అదృష్ట రంగులు...ఎరుపు, పసుపు.

పరిహారాలు : గణేశాష్టకం పఠించండి.

మిథునం : ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి.ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయినూతన విద్యావకాశాలు పొందుతారు.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.మిత్రుల నుంచి «మాటసహకారం అందుతుంది.వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఆకస్మిక ధన, వస్తులాభాలు.ఉద్యోగులకు ఊహించని ఆహ్వానాలు.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు.ఐటీ నిపుణుల సేవలకు సరైన గుర్తింపు లభిస్తుంది.విద్యార్థులకు కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది.మహిళలకు నిరుత్సాహం.షేర్ల విక్రయాలు మందకొడిగా సాగుతాయి.అదృష్ట రంగులు...తెలుపు, గులాబీ.

పరిహారాలు : వినాయకునికి అర్చనలు చేయండి.

కర్కాటకం : ఆకస్మిక ప్రయాణాలు.ఆదాయానికి మించిన ఖర్చులు.బంధువులతో మాట పట్టింపులు.ఆలోచనలు కలసిరావు.ఆరోగ్య భంగం. ఔషధసేవనం.కుటుంబంలో కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది.వ్యాపారులు పెట్టుబడుల్లో నిదానంగా వ్యవహరించాలి.ఉద్యోగాలలో అనుకోని మార్పులు.పారిశ్రామికవేత్తలకు నిరుత్సాహం తప్పదు.ఐటీ నిపుణులకు కొన్ని చికాకులు.విద్యార్థులకు ఫలితాలు కాస్త ఊరటనిస్తాయి.మహిళలకు కుటుంబసభ్యులతో మాటపట్టింపులు.షేర్ల విక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి.అదృష్ట రంగులు...ఆకుపచ్చ, తెలుపు.

పరిహారాలు : గణేశాష్టకం పఠించండి.

సింహం : పనుల్లో ఆటంకాలు.వ్యయప్రయాసలు.బంధు గణంతో వివాదాలు.ఆలోచనలు అంతగా కలిసిరావు.శారీరక రుగ్మతలు.కుటుంబంలో చికాకులు పెరుగుతాయి.వ్యాపారాలలో ఒడిదుడుకులు.ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.రాజకీయ, కళా రంగాల వారికి ఒత్తిడులు.ఐటీ నిపుణులకు కొంత అనుకూలత ఉంటుంది.విద్యార్థులకు పరిస్థితులు అనుకూలించవు.మహిళలకు శ్రమాధిక్యం.షేర్ల విక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి.అదృష్ట రంగులు...నీలం, తెలుపు.

పరిహారాలు : విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కన్య : బంధువులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు.ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.సన్నిహితుల నుంచి ధన లాభం.ప్రయత్నాలు ఫలిస్తాయి.ప్రముఖుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది.భూములు, వాహనాలు కొంటారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది.వ్యాపారాలలో పురోభివృద్ధి.ఉద్యోగులకు ఉన్నత పోస్టులు.పారిశ్రామిక, కళారంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది.ఐటీ నిపుణులకు మార్పులు.విద్యార్థులకు ఒత్తిడులు.మహిళలకు కొంత నిరాశ.షేర్ల విక్రయాలు కొంత లాభిస్తాయి.అదృష్ట రంగులు...ఎరుపు, కాఫీ.

పరిహారాలు : అంగారక స్తోత్రాలు పఠించండి.

తుల : మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.ఏ పనిచేపట్టినా మందకొడిగా సాగుతుంది.నిర్ణయాలలో మరింత నిదానం అవసరం.ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.దూర ప్రయాణాలు ఉంటాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారి యత్నాలు కొంత ఫలిస్తాయి.వ్యాపారాలలో చిక్కులు.ఉద్యోగులకు మానసిక ఆందోళన.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.ఐటీ నిపుణులకు అంచనాలు కొన్ని నిజం కాగలవు.విద్యార్థుల కృషి ఫలించదు.మహిళలకు బంధువుల నుంచి సమస్యలు.షేర్ల విక్రయాలలో నిదానం అవసరం.అదృష్ట రంగులు...కాఫీ, బంగారు.

పరిహారాలు : అంగారక స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం : బంధు మిత్రుల నుంచి ప్రోత్సాహం.నిరుద్యోగులకు పోటీ పరీక్షల్లో విజయం.బంధువుల నుంచి అనుకూల సమాచారం.పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఆర్థిక లావాదేవీలు ఊహించిన విధంగా ఉంటాయి.గృహ నిర్మాణ యత్నాలు సాగిస్తారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి అంచనాలు కొన్ని తప్పుతాయి.వ్యాపారాలలో ముందడుగు.ఉద్యోగులకు పదోన్నతి సూచనలు.పారిశ్రామిక, కళారంగాల వారికి సత్కారాలు.ఐటీ నిపుణులకు సరైన గుర్తింపు.విద్యార్థులకు అనుకూల ఫలితాలు.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.అదృష్ట రంగులు...ఆకుపచ్చ, గోధుమ.

పరిహారాలు : ఆంజనేయ దండకం పఠించండి.

ధనుస్సు : ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు.ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది.కుటుంబ సభ్యులతో విభేదాలు తప్పకపోవచ్చు.అంచనాలు తప్పి నిరాశ కలిగిస్తాయి.ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది.సన్నిహితుల సాయం అందుతుంది.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొద్దిపాటి చికాకులు.వ్యాపారులకు లాభాలు స్వల్పంగా ఉంటాయి.ఉద్యోగాల్లో లక్షసాధనలో వెనకడుగు.రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా.ఐటీ నిపుణులకు ఒక కీలక సమాచారం.విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది.మహిళలకు మానసిక ప్రశాంతత.షేర్ల విక్రయాలలో తొందరవద్దు.అదృష్ట రంగులు...నలుపు, తెలుపు.

పరిహారాలు : దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

మకరం : దూరపు బంధువులను కలుసుకుంటారు.ఇంటాబయటా ఉత్సాహంగా గడుస్తుంది.ప్రముఖులతో పరిచయాలు.ఆదాయం కొంత పెరుగుతుంది.కాంట్రాక్టర్ల యత్నాలు నిదానిస్తాయి.వ్యాపారాలు విస్తరిస్తారు. .ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.పారిశ్రామిక, కళారంగాల వారికి సన్మానయోగం.ఐటీ నిపుణులకు నిర్ణయాలలో నిదానం అవసరం.విద్యార్థులకు ఫలితాలపై నిరుత్సాహం.మహిళలకు శుభవార్తలు.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు...గోధుమ, ఎరుపు.

పరిహారాలు : గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

కుంభం : దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు.ఆర్థికంగా బలం చేకూరుతుంది.సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.ఇంటిలో శుభకార్యాలపై చర్చలు. నిర్వహణ.సంఘంలో మీకంటూ గౌరవం పెరుగుతుంది.కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి.వ్యాపారులకు లాభాలు దక్కుతాయి.ఉద్యోగాల్లో కొంత ఆశాజనకంగా ఉంటుంది.రాజకీయ, పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం.ఐటీ నిపుణులకు కొంత అసంతృప్తి.విద్యార్థులకు నిరాశాజనకంగా ఉంటుంది.మహిళలకు కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు.షేర్ల విక్రయాలలో లాభాలు అందుతాయి.అదృష్ట రంగులు...పసుపు, ఆకుపచ్చ.

పరిహారాలు : లక్ష్మీస్తుతి మంచిది.

మీనం : వ్యయప్రయాసలు.పనుల్లో ఆటంకాలు.ఆరోగ్య, కుటుంబసమస్యలు.వివాదాలు చికాకు పరుస్తాయి.దూర ప్రయాణాలు ఉంటాయి.ఆశ్చర్యకరమైన సంఘటనలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి.వ్యాపారులకు లాభ నష్టాలు సమాన స్థాయిలో ఉంటాయి.ఉద్యోగాలలో ఒత్తిడులు.పారిశ్రామిక, కళారంగాల వారికి అన్నింటా ఒడిదుడుకులే.ఐటీ నిపుణులకు కొత్త ఆశలు.విద్యార్థులకు అంచనాలు కొన్ని నిజం కాగలవు.మహిళలకు ఆసక్తికర సమాచారం.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు...గోధుమ, ఎరుపు.

పరిహారాలు :  హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.