(Local) Sun, 15 Dec, 2019

నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

November 29, 2019,   11:54 AM IST
Share on:
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం : కొత్త రుణ యత్నాలు.దూర ప్రయాణాలు.కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.సేవాకార్యక్రమాల పై ఆసక్తి.కాంట్రాక్టులు చేజారతాయి.వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.ఉద్యోగులకు పని ఒత్తిడులు పెరుగుతాయి.రాజకీయ, కళారంగాల వారికి అవకాశాలు అంతగా దక్కవు.ఐటీ నిపుణులకు ఆహ్వానాలు.విద్యార్థులకు మరింత అనుకూలం.మహిళలకు కొంత నిరాశ.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు....ఆకుపచ్చ, లేత ఎరుపు.

పరిహారాలు : లక్ష్మీస్తుతి మంచిది.

వృషభం : ఆకస్మిక ప్రయాణాలు.ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.బంధుమిత్రులతో అకారణంగా తగాదాలు.ఇతరులకు సలహాలు ఇవ్వడంలో నిదానంగా వ్యవహరించండి.రియల్‌ ఎస్టేట్‌ల వారికి గందరగోళం.వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.పారిశ్రామిక, కళారంగాల వారికి ప్రభుత్వం నుంచి సహాయం తగ్గే సూచనలు.ఐటీ నిపుణులకు శుభవార్తలు.విద్యార్థుల యత్నాలు నిదానిస్తాయి.మహిళలకు ఆస్తిలాభం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....గోధుమ,పసుపు.

పరిహారాలు :  కనకధారా స్తోత్రాలు పఠించండి.

మిథునం : పనుల్లో అనుకూలత ఉంటుంది.సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది.ఆధ్యాత్మిక కార్యక్రమాల పై ఆసక్తి చూపుతారు.అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు.రాబడి అనూహ్యంగా పెరుగుతుంది.రియల్‌ ఎస్టేట్‌ల వారికి వివాదాలు పరిష్కారం.వ్యాపారాలు అభివృద్ధి దాయకంగా ఉంటాయి.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కే అవకాశం.పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు.విద్యార్థులకు కొన్ని ఇబ్బందులు.మహిళలకు కుటుంబంలో సమస్యలు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు....ఎరుపు, గోధుమ.

పరిహారాలు :  హనుమాన్‌ చాలీసా పఠించండి.

కర్కాటకం : మిత్రులతో ఆనందంగా గడుపుతారు.వ్యవహారాలలో విజయం సాధిస్తారు.సంఘంలో గౌరవం పెరుగుతుంది.కుటుంబ సభ్యులు అన్నింటా సహకరిస్తారు.ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు చేసుకుంటారు.కాంట్రాక్టర్లకు యత్నాలు ముందుకు సాగవు.వ్యాపారాలు సజావుగా సాగుతాయి.ఉద్యోగాల్లో చిక్కులు అధిగమిస్తారు.విద్యార్థులకు ఫలితాల పై నిరాశ.మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు.షేర్ల విక్రయాలు సామాన్యంగా లాభిస్తాయి.అదృష్ట రంగులు....కాఫీ, తెలుపు.

పరిహారాలు :  విష్ణుసహస్రనామ పారాయణ మంచిది.

సింహం : రుణ యత్నాలు ఫలిస్తాయి.వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.ఇంటాబయటా సమస్యలు పెరుగుతాయి.సన్నిహితులతో వివాదాలు నెలకొంటాయి.గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా.వ్యాపారాలలో చికాకులు.ఉద్యోగులకు స్థాన మార్పు ఉండవచ్చు.పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు రద్దు కాగల అవకాశం.ఐటీ నిపుణులకు సమస్యల నుంచి విముక్తి.విద్యార్థులకు ఒత్తిడులు.మహిళలకు ఆస్తి వివాదాలు.షేర్ల విక్రయాలలో లాభాలు అంతగా కనిపించవు.అదృష్ట రంగులు....గోధుమ, ఆకుపచ్చ.

పరిహారాలు :  శ్రీ రామ స్తోత్రాలు పఠించండి.

కన్య : ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.కొత్త ప్రయత్నాలు మందగిస్తాయి.అనుకోని ప్రయాణాలు ఉంటాయి.కొన్ని వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది.పనులు నత్తనడకన సాగుతాయి.మిత్రులతో అకారణంగా తగాదాలు.శారీరక రుగ్మతలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొన్ని సమస్యలు వే«ధిస్తాయి.వ్యాపార లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి.ఉద్యోగవర్గాలకు విధి నిర్వహణలో ఆటంకాలు.రాజకీయ, పారిశ్రామికవేత్తలకు చికాకులు.ఐటీ నిపుణులకు ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది.విద్యార్థులకు పోటీపరీక్షల్లో అనుకోని విధంగా విజయం.మహిళలకు శ్రమాధిక్యం.షేర్ల విక్రయాలలో స్వల్ప లాభాలు.అదృష్ట రంగులు....నీలం, పసుపు.

పరిహారాలు : గణేశ్‌ను పూజించండి.

తుల : కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు.పనులు శ్రమ పెరిగినా సకాలంలో పూర్తి చేస్తారు.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.ఆలయాలు సందర్శిస్తారు.సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొన్ని ఒడిదుడుకులు.వ్యాపారాలలో ముందుకు సాగుతారు.ఉద్యోగులకు ఉన్నత స్థాయి నుంచి ఆహ్వానాలు.పారిశ్రామిక,కళారంగాల వారికి సన్మానాలు,ఐటీ నిపుణులకు శుభవార్తలు.విద్యార్థులకు గందరగోళం తొలగుతుంది.మహిళలకు సోదరులతో మాటపట్టింపులు.షేర్ల విక్రయాలలో స్వల్ప లాభాలు.అదృష్ట రంగులు....బంగారు, పసుపు.

పరిహారాలు : విష్ణు ధ్యానం చేయండి.

వృశ్చికం : కుటుంబ సభ్యులతో విభేదాలు.కొన్ని అవకాశాలు దగ్గరకు వచ్చి చేజారతాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది.సన్నిహితుల నుంచి విమర్శలు.పుణ్య క్షేత్రాల సందర్శనం.కాంట్రాక్టర్లకు ఒత్తిడులు కొంత తొలగుతాయి.వ్యాపారాలలో లాభాలు సంతృప్తికరంగా ఉండవు.ఉద్యోగులకు పని భారం తప్ప ఫలితం ఉండదు.రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ఒత్తిడులు ఎదుర్కొనవలసి వస్తుంది.ఐటీ నిపుణులకు కొంత నిరుత్సాహం.విద్యార్థులకు శుభవార్తలు.మహిళలకు భూలాభాలు.షేర్ల విక్రయాలలో స్వల్ప లాభాలు.అదృష్ట రంగులు....ఎరుపు, కాఫీ.

పరిహారాలు : కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు : కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.ఆర్థిక విషయాలు ఆశించిన విధంగా ఉంటాయి.విలువైన వస్తువులు, వాహనాలు కొంటారు.ఒక కేసు విషయంలో చికాకులు.కాంట్రాక్టర్లకు అవకాశాలు చేజారవచ్చు.వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.రాజకీయ, కళారంగాల వారికి నూతనోత్సాహం.ఐటీ నిపుణులకు వివాదాలు తీరతాయి.విద్యార్థులు కొంత గందరగోళంలో పడతారు.మహిళలకు లేనిపోని చికాకులు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు....గోధుమ, తెలుపు.

పరిహారాలు : లక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

మకరం : కష్టం ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది.సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.మిత్రులు, బంధువులతో విరోధాలు.ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తప్పవు.వ్యూహాలు తప్పే అవకాశముంది.రాబడి కొంత తగ్గి రుణాలు చేస్తారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి అంతంత మాత్రంగా ఉంటుంది.వ్యాపార విస్తరణ యత్నాలు మందగిస్తాయి.ఉద్యోగులకు స్థాన మార్పులు ఉండవచ్చు.రాజకీయ, కళారంగాల వారికి అవకాశాలు అంతంత మాత్రంగా ఉంటాయి.ఐటీ నిపుణులకు వివాదాలు తప్పవు.విద్యార్థులు శ్రమ పడ్డా ఫలితం ఉండదు.మహిళలకు సోదరులతో వివాదాలు.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు....కాఫీ, గోధుమ.

పరిహారాలు : బుధ గ్రహ స్తోత్రాలు పఠించండి.

కుంభం : ప్రముఖులతో పరిచయాలు.ఆర్థిక ,వస్తులాభాలు.అప్రయత్నంగా పనులు పూర్తి.సోదరులు, మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది.రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఇబ్బందులు ఎదురుకావచ్చు.కొత్త వ్యాపారాల ప్రారంభానికి యత్నాలు సాగిస్తారు.ఉద్యోగుల సేవకు గుర్తింపు లభిస్తుంది.రాజకీయ, కళారంగాల వారికి అనూహ్యంగా అవకాశాలు, ఆహ్వానాలు.ఐటీ నిపుణులు చాకచక్యంగా కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు.విద్యార్థులకు ఫలితాలపై నిరాశ.మహిళలకు మానసిక ప్రశాంతత.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు....నలుపు, పసుపు.

పరిహారాలు : ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.

మీనం : ప్రముఖులతో పరిచయాలు.పుణ్య క్షేత్రాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు.మిత్రులతో కష్టసుఖాలు విచారిస్తారు.ఆదాయం ఊహించని రీతిలో పెరుగుతుంది.రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారులకు అధిక లాభాలు.ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి.పారిశ్రామిక, కళారంగాల వారికి చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.ఐటీ నిపుణులకు ఒక కీలక సమాచారం.విద్యార్థులకు అవకాశాలు చేజారవచ్చు.మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది.షేర్ల విక్రయాలు మందకొడిగా సాగుతాయి.అదృష్ట రంగులు....గులాబీ, లేత ఎరుపు.

పరిహారాలు : దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.