(Local) Fri, 13 Dec, 2019

అక్టోబర్ 28-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..

October 27, 2019,   11:53 PM IST
Share on:
అక్టోబర్ 28-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం : వ్యవహారాల్లో విజయం.శుభకార్యాల్లో పాల్గొంటారు.పాత మిత్రులను కలుసుకుంటారు.యుక్తితో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు.జీవిత భాగస్వామి సలహాలతో ముందుకు సాగుతారు.రాబడి సంతృప్తికరంగా ఉంటుంది.రియల్‌ ఎస్టేట్‌ల వారికి అంచనాలు కొన్ని తప్పుతాయి.వ్యాపారాలు సజావుగా సాగుతాయి.ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కే సూచనలు.పారిశ్రామిక,కళారంగాల వారికి విదేశాల నుంచి ఆహ్వానాలు.ఐటీ రంగం వారికి సామాన్యంగా ఉంటుంది.విద్యార్థులకు కొంత అనుకూలం.మహిళలకు కుటుంబంలో గౌరవం.షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.అదృష్ట రంగులు... లేత పసుపు, గులాబీ.

పరిహారాలు : గణేశాష్టకం పఠించండి.

వృషభం : కుటుంబ సభ్యులతో తగాదాలు.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.సన్నిహితుల నుంచి వ్యవహారాల్లో ఒత్తిడులు.ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు.మనశ్శాంతి లోపిస్తుంది.ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొంత అనుకూలస్థితి.వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఉద్యోగులకు చికాకులు తప్పవు.విద్యార్థులు కొత్త అవకాశాలు సాధిస్తారు.మహిళలకు మానసిక అశాంతి.షేర్ల విక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి.అదృష్ట రంగులు... ఆకుపచ్చ, నలుపు.

పరిహారాలు : దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

మిథునం : వ్యయప్రయాసలు, మానసిక ఆందోళన.భూ వివాదాలు, కోర్టు కేసులు చికాకు పరుస్తాయి.బంధువులతో విరోధాలు ఉంటాయి.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి.కాంట్రాక్టర్లకు అంచనాలు కొన్ని నిజమవుతాయి.వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.ఉద్యోగులకు స్థాన చలనం.రాజకీయ, కళా రంగాల వారికి ఒత్తిడులు.ఐటీ నిపుణులకు కొన్ని సమస్యలు తీరతాయి.విద్యార్థులకు అనుకూల ఫలితాలు.మహిళలకు అనారోగ్యం.అదృష్ట రంగులు... తెలుపు, గులాబీ.

పరిహారాలు : సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

కర్కాటకం : కొత్త విషయాలు తెలుసుకొంటారు.పరిస్థితులు అనుకూలిస్తాయి.నిరుద్యోగులకు జీవిత స్థిరత్వం ఏర్పడుతుంది.సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది.కొత్త కాంట్రాక్టులు చేజారతాయి.బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి.రాబడి ఆశాజనకంగా ఉంటుంది.వ్యాపారాలు లాభిస్తాయి.ఉద్యోగులకు పదోన్నతి సూచనలు.రాజకీయ, కళారంగాల వారికి యోగవంతంగా ఉంటుంది.ఐటీ నిపుణులకు గందరగోళం.విద్యార్థులకు చికాకులు.మహిళలకు మానసిక అశాంతి.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు... పసుపు, ఆకుపచ్చ.

పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.

సింహం :కొత్త రుణ యత్నాలు.ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు.దూర ప్రయాణాలు.బంధువులతో మాటపట్టింపులు.కొన్ని కార్యక్రమాలను ఎట్టకేలకు పూర్తి చేస్తారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొంత ఊరట లభిస్తుంది.వ్యాపారాలలో ఆటుపోట్లు.ఉద్యోగులకు బదిలీలు ఉండవచ్చు.పారిశ్రామిక, కళారంగాల వారికి మనశ్శాంతి లోపిస్తుంది.ఐటీ నిపుణులకు ఒత్తిడులు.విద్యార్థులు మరింత శ్రమపడాలి.మహిళలకు ఆరోగ్య సమస్యలు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు... గులాబీ, లేత ఎరుపు.

పరిహారాలు :  ఆంజనేయ దండకం పఠించండి.

కన్య : నూతన కార్యక్రమాలు చేపడతారు.ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.సన్నిహితులు, మిత్రుల నుంచి శుభవర్తమానాలు.బహుమతులు అందుతాయి.ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది.వ్యాపారాలు విస్తరిస్తారు.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభించే అవకాశం.రాజకీయ వర్గాలకు పదవీయోగం.ఐటీ నిపుణులు అవార్డులు అందుకుంటారు.విద్యార్థులకు శ్రమ కొంత ఫలిస్తుంది.మహిళలకు బంధువులతో తగాదాలు.షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.అదృష్ట రంగులు... ఎరుపు, కాఫీ.

పరిహారాలు :  శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.

తుల : ప్రయాణాలు వాయిదా వేస్తారు.బంధువులతో తగాదాలు.ఆరోగ్యం మందగిస్తుంది, ఔషధసేవనం.విలువైన వస్తువులు చేజారతాయి.మిత్రులు శత్రువులుగా మారతారు.ఒక సంఘటన కలవరపరుస్తుంది.దేవాలయాలు సందర్శిస్తారు.వ్యాపారాలలో చికాకులు.ఉద్యోగులకు పని ఒత్తిడులు పెరుగుతాయి.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.ఐటీ నిపుణులకు అంచనాలు తప్పుతాయి.విద్యార్థులకు కొంత గందరగోళం.మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది.షేర్ల విక్రయాలలో స్వల్ప లాభాలు.అదృష్ట రంగులు... గులాబీ, నీలం.

పరిహారాలు : హనుమాన్‌ఛాలీసా పఠించండి.

వృశ్చికం : ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి.చిరకాల కోరిక నెరవేరే సూచనలు.పరిచయాలు పెరుగుతాయి.ఆశ్చర్యకరమైన సంఘటనలు.ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది.సన్నిహితులు మీసహాయం కోరతారు.ఇళ్లు,  వాహనాలు కొంటారు.రియల్‌ఎస్టేట్‌ల వారికి అవకాశాలు చేజారవచ్చు.వ్యాపారాలలో లక్ష్యాలు సా«ధిస్తారు.ఉద్యోగులకు సమస్యలు తీరతాయి.రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు.ఐటీ నిపుణులకు అంచనాలు తప్పుతాయి.విద్యార్థులు కొంత శ్రమపడాలి.మహిళలకు ఆశ్చర్యకర సంఘటనలు ఎదురవుతాయి.షేర్ల విక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి.అదృష్ట రంగులు... తెలుపు, తెలుపు.

పరిహారాలు :  శ్రీ కృష్ణ స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు : పరిచయాలు పెరుగుతాయి.సన్నిహితుల నుంచి శుభవార్తలు.ఆర్థిక వ్యవహారాలు ఆశించిన స్థితిలో ఉంటాయి.వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.సంఘంలో గౌరవం పెరుగుతుంది.కొన్ని కాంట్రాక్టులు నిరాశ పరుస్తాయి.వ్యాపారులకు అధిక లాభాలు.ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.ఐటీ నిపుణులకు అంచనాలు కొన్ని తప్పుతాయి.విద్యార్థులు కొంత కష్టపడాలి.మహిళలకు మానసిక ఆందోళన.షేర్ల విక్రయాలలో నిరుత్సాహం.అదృష్ట రంగులు... ఎరుపు, కాఫీ.

పరిహారాలు :  నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

మకరం : కొత్త రుణాలు చేస్తారు.దూర ప్రయాణాలు ఉంటాయి.బంధువుల నుంచి ప్రతి విషయంలోనూ ఆటంకాలు.ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది.వివాదాలకు దూరంగా ఉండండి.శారీరక రుగ్మతలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కాస్త ఊరట.వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.ఉద్యోగులకు స్థాన మార్పు ఉండవచ్చు.పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు కొంత అనుకూలం.విద్యార్థులు ఫలితాలపై పెదవి విరుస్తారు.మహిళలకు కుటుంబంలో కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది.షేర్ల విక్రయాలలో స్వల్ప లాభాలు.అదృష్ట రంగులు... నలుపు,తెలుపు.

పరిహారాలు : అంగారక స్తోత్రాలు పఠించండి.

కుంభం : ఆర్థిక ఇబ్బందులు. మానసిక ఆందోళన.పనుల్లో ఆటంకాలు.నిర్ణయాలలో తొందరపాటు వద్దు.ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.కష్టపడ్డా ఫలితం అంతగా ఉండదు.ఆలోచనలు నిలకడగా ఉండవు.ఆలయ దర్శనాలు.రియల్‌ఎస్టేట్‌ల వారు అనుకున్నది సాధిస్తారు.వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి.ఉద్యోగులకు చికాకులు పెరుగుతాయి.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.ఐటీ నిపుణులకు శుభవర్తమానాలు.విద్యార్థులకు అనుకూలత.మహిళలకు కొంత అశాంతి.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్టరంగులు... గులాబీ, ఎరుపు.

పరిహారాలు : గణేశాష్టకం పఠించండి.

మీనం : కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కరించుకుంటారు.సన్నిహితులు మరింత దగ్గరవుతారు.ఆలోచనలు అమలు చేస్తారు.చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.ధార్మిక కార్యక్రమాలు చేపడతారు.ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొద్దిపాటి చికాకులు.వ్యాపారాలు విస్తరిస్తారు.ఉద్యోగులకు విధి నిర్వహణలో ఉత్సాహంగా ఉంటుంది.పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు.ఐటీ నిపుణులకు కొంత నిరాశ.విద్యార్థులకు పురస్కారాలు.మహిళలకు మానసిక ప్రశాంతత.షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.అదృష్ట రంగులు...నీలం, ఆకుపచ్చ.

పరిహారాలు : దుర్గాదేవికి అర్చనలు చేయండి.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.