(Local) Wed, 16 Oct, 2019

అక్టోబర్ 01-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..

October 01, 2019,   10:19 AM IST
Share on:
అక్టోబర్ 01-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం : ఆర్థిక విషయాలలో మరింత పురోగతి కనిపిస్తుంది.పనులలో విజయం.బంధువులతో ఆనందంగా గడుపుతారు.సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.నిరుద్యోగుల చిరకాల కోరిక నెరవేరుతుంది.ఇంటి నిర్మాణాలు చేపడతారు.రియల్‌ఎస్టేట్‌ల వారికి పట్టింది బంగారమే.వ్యాపారాలు పుంజుకుంటాయి.ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.మహిళలు భూ, గృహ యోగాలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు.... గోధుమ, కాఫీ.

పరిహారాలు : విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం : ఒక వ్యవహారంలో విజయం.ఆదాయం ఆశించిన రీతిలో పెరుగుతుంది.చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు.అందరిలోను గౌరవం పెరుగుతుంది.వాహన యోగం.బంధువర్గం ప్రోత్సాహం అందుతుంది.ఆలయాలు సందర్శిస్తారు.ఉద్యోగస్తులకు ఈతి బాధలు తొలగుతాయి.విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి.మహిళలకు మనోధైర్యం పెరుగుతుంది.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు.... గులాబీ, ఎరుపు.

పరిహారాలు : హనుమాన్‌ చాలీసా పఠించండి.

మిథునం : కొంత వ్యయప్రయాసలు తప్పవు.బంధుమిత్రులతో అకారణంగా విభేదాలు.ముఖ్యమైన పనులు ముందుకు సాగవు.ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి.శారీరక రుగ్మతలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి చిక్కులు.వ్యాపారాలలో  లాభాలు కష్టమే.ఉద్యోగులకు పని ఒత్తిడులు.రాజకీయ, పారిశ్రామికవేత్తలకు నిదానంగా అవసరం.ఐటీ నిపుణులకు కొంత నిరుత్సాహంవిద్యార్థులకు అంచనాలు తప్పుతాయి.మహిళలకు మానసిక అశాంతి.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు.... నీలం, పసుపు.

పరిహారాలు : వినాయకునికి పూజించాలి.

కర్కాటకం : ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.పనులలో  అవాంతరాలు.ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.సన్నిహితులు శత్రువులుగా మారతారు.ఆప్తులతో అకారణంగా విభేదాలు.ఆలోచనలు అంతగా కలసిరావు.ఆరోగ్య సమస్యలు.ఉద్యోగులకు అదనపు పనిభారం.రాజకీయవేత్తలకు పదవులు దూరం కావచ్చు.ఐటీ నిపుణులకు గందరగోళ పరిస్థితి.విద్యార్థులకు కొత్త అవకాశాలు సంతృప్తినీయవు.మహిళలకు కుటుంబససమస్యలు.షేర్ల వియ్రాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు....గోధుమ, పచ్చ.

పరిహారాలు : దత్తాత్రేయుని పూజించాలి.

సింహం : ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి.ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.పనులలో విజయం సాధిస్తారు.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.కొన్ని వివాదాలు తీరి ఒడ్డునపడతారు.రియల్‌ఎస్టేట్‌ల వారికి కొత్త ఆశలు.వ్యాపారాలు పుంజుకుంటాయి.ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు.రాజకీయ, పారిశ్రామికవేత్తలకు మరింత ఉత్సాహంగా ఉంటుంది.మహిళలకు ఆస్తి లాభం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు.... పసుపు, గులాబీ.

పరిహారాలు : హనుమాన్‌ చాలీసా పఠించండి.

కన్య : ఆకస్మిక ప్రయాణాలు.ఆలయాలు సందర్శిస్తారు.బంధువులతో విభేదాలు.ఆరోగ్యం మందగిస్తుంది.రాబడి కొంత తగ్గి అప్పులు చేస్తారు.ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి.నిరుద్యోగుల యత్నాలు ఫలించకపోవచ్చు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఒత్తిడులు తప్పవు.ఉద్యోగులకు స్థానమార్పు.విద్యార్థులకు కొంత నిరాశ తప్పదు.మహిళలకు గందరగోళంగా ఉంటుంది.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు.... ఆకుపచ్చ, తెలుపు.

పరిహారాలు :  శివ స్తోత్రాలు పఠించండి.

తుల : అంచనాలు నిజమవుతాయి.ఆర్థిక లావాదేవీలు ఆశాజనంగా ఉంటాయి.ఇంటాబయటా మరింత పోత్సాహం.బంధువుల నుంచి  కొత్త విషయాలు తెలుసుకుంటారు.నూతన కార్యక్రమాలు చేపడతారు.రావలసిన బాకీలు అందుతాయి.ఉద్యోగార్ధులకు శుభవార్తలు.ఉద్యోగాల్లో మీ హోదాలు పెరుగుతాయి.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీయానం ఉండవచ్చు.ఐటీ నిపుణులకు శుభ వర్తమానాలు.విద్యార్థుల యత్నాలు సఫలం.మహిళలకు ఆస్తి విషయాలలో వివాదాలు పరిష్కారం.అదృష్ట రంగులు....ఆకుపచ్చ, తెలుపు.

పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.

వృశ్చికం : కుటుంబ సభ్యులతో వివాదాలు.ఆర్థిక సమస్యలు వేధిస్తాయి.కష్టపడ్డా ఫలితం అందుకోలేరు.శారీరక రుగ్మతలు.ఇంటాబయటా విమర్శలు.పరిస్థితులు అంతగా అనుకూలించవు.అనుకోని సంఘటనలు.ఉద్యోగులకు సామాన్యంగా ఉంటుంది.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఒత్తిడులు.ఐటీ నిపుణులకు కొత్త సమస్యలు.విద్యార్థులకు కొంత గందరగోళంగా ఉంటుంది.మహిళలకు మానసిక ఆందోళన.షేర్ల విక్రయాలు నత్తనడకన సాగుతాయి.అదృష్ట రంగులు....పసుపు, కాఫీ.

పరిహారాలు :  ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు : ముఖ్య వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు.ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది..ఇంటిలో శుభకార్యాలు.ఆప్తులు సహాయం అందిస్తారు.ప్రముఖులతో పరిచయాలు.ఆస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు.సేవాకార్యక్రమాలో పాల్గొంటారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి వివాదాల నుంచి విముక్తి.వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.ఉద్యోగులకు మరింత అనుకూలం.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు శ్రమ ఫలిస్తుంది.ఐటీ నిపుణులకు అంచనాలు తప్పుతాయి.విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు.మహిళలకు శుభవర్తమానాలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు.... నలుపు, నీలం.

పరిహారాలు :   వేంకటేశ్వరస్వామిని పూజించండి.

మకరం : పనులు సకాలంలో పూర్తి చేస్తారు.సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు.ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.ప్రముఖులతో పరిచయాలు.నిరుద్యోగులకు ఉద్యోగలాభం.రియల్‌ఎస్టేట్‌ల వారి యత్నాలు సఫలం.రాజకీయవేత్తలకు పదవీయోగం.ఐటీ నిపుణులకు అవకాశాలు మరింత పెరుగుతాయి.విద్యార్థులకు అనుకూల ఫలితాలు.మహిళలకు భూ, గృహయోగాలు కలుగుతాయి.షేర్ల విక్రయాలలోలాభాలు.అదృష్ట రంగులు....ఎరుపు, తెలుపు.

పరిహారాలు :   విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

కుంభం : వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురుకావచ్చు.ఆదాయానికి మించి ఖర్చులు.వివాదాలకు కొంత దూరంగా ఉండండి.రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఆస్తి వివాదాలు పెరుగుతాయి.వ్యాపారాలు అంతగా లాభించవు.ఉద్యోగులకు విధి నిర్వహణలో చికాకులు.రాజకీయ, పారిశ్రామికవేత్తలకు అంచనాలు తారుమారు.ఐటీ నిపుణులకు కొత్త చిక్కులు.విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలలో ఆచితూచి వ్యవహరించండి.అదృష్ట రంగులు....ఎరుపు, పసుపు.

పరిహారాలు :  శివాలయ దర్శనం చేసుకోండి..

మీనం : కొత్త రుణాల కోసం అన్వేషణ.బంధువులతో విభేదాలు.ఆకస్మిక ప్రయాణాలు.ముఖ్యమైన ఒప్పందాలు వాయిదా.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొత్త సమస్యలు.వ్యాపారులకు కొంత మందకొడిగా సాగుతుంది.ఉద్యోగులకు స్థాన మార్పులు ఉండవచ్చు.రాజకీయవేత్తలకు ఒత్తిడులు.ఐటీ నిపుణులకు గందరగోళం.విద్యార్థులకు ఫలితాలపై నిరాశ.మహిళలు నిర్ణయాలలో తొందరపడవద్దు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు....ఆకుపచ్చ, కాఫీ.

పరిహారాలు :  గాయత్రీ ధ్యానం మంచిది

సంబంధిత వర్గం
అక్టోబర్ 15-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
అక్టోబర్ 15-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.