(Local) Wed, 16 Oct, 2019

అక్టోబర్ 03-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..

October 03, 2019,   12:21 AM IST
Share on:
అక్టోబర్ 03-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం :మిత్రులతో విభేదాలు ఏర్పడతాయి.పనులు నత్తనడకన సాగుతాయి.ఆలోచనలు నిలకడగా ఉండవు.ఆదాయం కొంత నిరాశ కలిగిస్తుంది.కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు తప్పవు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.కాంట్రాక్టర్లకు సమస్యలు ఎదురుకావచ్చు.వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి.ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు .మహిళలకు కుటుంబసభ్యులతో అకారణంగా వైరం.షేర్ల విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి.అదృష్ట రంగులు....గోధుమ, తెలుపు.

పరిహారాలు :  గణేశాష్టకం పఠించండి. 

వృషభం : ఆలోచనలు కార్య రూపం దాలుస్తాయి.పలుకుబడి పెరుగుతుంది.పనుల్లో అవాంతరాలు తొలగుతాయి.ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.జీవిత భాగస్వామితో విభేదాలు తొలగుతాయి..ఆస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.ఉద్యోగాల్లో అనుకూల మార్పులు.పారిశ్రామికవేత్తలకు చిక్కులు.ఐటీ నిపుణులకు కొన్ని సమస్యలు తీరతాయి.విద్యార్థులకు ఉత్సాహంగా ఉంటుంది.మహిళలకు శుభ వార్తలు అందుతాయి.షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.అదృష్ట రంగులు....కాఫీ, బంగారు.

పరిహారాలు :  హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

మిథునం : సంఘంలో గౌరవం పెరుగుతుంది.సన్నిహితుల నుంచి సహాయసహకారాలు అందుతాయి.ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది.మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు.భూములు, గృహం కొంటారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి.రాజకీయవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.ఐటీ నిపుణుల సమర్థత వెలుగులోకి వస్తుంది.విద్యార్థుల  ప్రతిభ వెలుగులోకి వస్తుంది.మహిళలకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....బంగారు, పసుపు.

పరిహారాలు :  వేంకటేశ్వరస్వామిని పూజించండి.

కర్కాటకం : ముఖ్య వ్యవహారాల్లో ఆటంకాలు.బంధువులు, మిత్రులతో విభేదాలు.పనులు కొంత మందగిస్తాయి.ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.మిత్రులు కూడా శత్రువులుగా మారతారు.ఆలోచనలుస్థిరంగా ఉండవు.ఆకస్మిక ప్రయాణాలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి వివాదాలు.వ్యాపారాలలో ఆటుపోట్లు.ఐటీ నిపుణుల యత్నాలు ముందుకు సాగవు.విద్యార్థులు అవకాశాలు చేజార్చుకుంటారు.మహిళలకు కుటుంబసభ్యులతో వివాదాలు.షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.అదృష్ట రంగులు....గోధుమ, గులాబీ.

పరిహారాలు :  నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.

సింహం : కుటుంబ సభ్యులతో విభేదాలు నెలకొంటాయి.పనుల్లో అవాంతరాలు.ఆలోచనలు స్థిరంగా ఉండవు.వివాదాలకు దూరంగా మెలగండి.ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు.ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉంటుంది.రాజకీయ, పారిశ్రామికవేత్తలకు పర్యటనలు వాయిదా.ఐటీ నిపుణులు కొంత నిరాశ చెందుతారు.విద్యార్థులకు అంచనాలు తప్పి నిరాశ కలుగుతుంది.మహిళలకు అనారోగ్యం.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు.... నీలం, ఆకుపచ్చ.

పరిహారాలు :  సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కన్య : మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.ప్రముఖుల నుంచి పిలుపు అందుతుంది.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.వాహనాలు, భూములు కొంటారు.స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు.ఉద్యోగ, వివాహయత్నాలు ఫలిస్తాయి..సభలు,సమావేశాల్లో పాల్గొంటారు.కాంట్రాక్టర్ల యత్నాలు ఫలిస్తాయి.వ్యాపారాలు విస్తరిస్తారు..ఉద్యోగాల్లో హోదాలు మరింత పెరుగుతాయి.ఐటీ నిపుణులకు అవార్డులు.విద్యార్థులకు అవకాశాలు దగ్గరకు వస్తాయి.మహిళలకు కుటుంబ సభ్యులతో సఖ్యత.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు.... పసుపు,కాఫీ.

పరిహారాలు :   ఆంజనేయ దండకం పఠించాలి.

తుల : రుణ యత్నాలు ముమ్మరం చేస్తారు.ఆకస్మిక ప్రయాణాలు.శారీరక రుగ్మతలు.బంధువులతో వివాదాలు నెలకొంటాయి.సోదరుల నుంచి ఒత్తిడులు, విమర్శలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఒత్తిడులు.ఉద్యోగులకు స్థాన మార్పులు ఉండవచ్చు.వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.మహిళలకు కుటుంబంలో చిక్కులు.షేర్ల విక్రయాలలో లాభాలు కనిపించవు.అదృష్ట రంగులు....తెలుపు, కాఫీ.

పరిహారాలు :   హయగ్రీవస్తోత్రాలు పఠించండి. 

వృశ్చికం : ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.అందరిలోనూ  ప్రత్యేకత నిలుపుకుంటారు.కొన్ని సమస్యలు ఎట్టకేలకు పరిష్కరించుకుంటారు.దేవాలయాలు సందర్శిస్తారు.వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు.గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి.వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారికి మరింత లాభాలు.ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.వ్యాపారాలు లాభాలదిశగా సాగుతాయి.మహిళలకు విదేశీ పర్యటనలు ఉంటాయి.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....ఆకుపచ్చ, బంగారు.

పరిహారాలు :  శివాలయంలో అభిషేకం చేయించుకోవాలి.

ధనుస్సు : పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.విచిత్రమైన సంఘటనలు.ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు.ఉదర సంబంధ రుగ్మతలు బాధిస్తాయి.దేవాలయాలు సందర్శిస్తారు.ఉద్యోగాలలో ఒడిదుడుకులు.రాజకీయవేత్తలకు కొత్త సమస్యలు.ఐటీ నిపుణులకు వివాదాలు పెరుగుతాయి.విద్యార్థులకు శ్రమ తప్ప ఫలితం అంతగా ఉండదు.మహిళలకు మానసిక ఆందోళన.షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.అదృష్ట రంగులు....కాఫీ, తెలుపు.

పరిహారాలు :  శివాలయంలో  ప్రదక్షణలు చేయాలి.

మకరం : ముఖ్యమైన పనులు సకాలంలో  పూర్తి చేస్తారు.ధార్మిక ,సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.సంఘంలో విశేష గౌరవం.రాబడి సంతృప్తికరంగా ఉంటుంది.ఇంటాబయటా అనుకూలం.కొత్త వ్యక్తుల పరిచయం.కాంట్రాక్టర్లు, రియల్టర్లకు ఊహించని లాభాలు.వ్యాపారాలలో నూతన పెట్టుబడులు,ఉద్యోగులకు ఊహించని ఇంక్రిమెంట్లు.పారిశ్రామికవేత్తలకు అరుదైన ఆహ్వానాలు.ఐటీ నిపుణులకు శుభవార్తలు.విద్యార్థులకు ఉత్సాహవంతమైనకాలం.మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగుతాయి.అదృష్ట రంగులు....నలుపు, లేత ఎరుపు.

పరిహారాలు :  సుబ్రహ్మణ్యాష్టకం పఠించాలి.

కుంభం : ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.ఆలోచనలు అమలు చేస్తారు.కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన.జీవిత భాగస్వామి నుంచి ఆస్తి ధన లాభం.ఆదాయానికి లోటు ఉండదు.కాంట్రాక్టులు దక్కించుకుంటారు.వ్యాపారాల్లో అనుకున్న లాభాలు అందుకుంటారు.ఉద్యోగాల్లో పదోన్నతులు లభిస్తాయి.విద్యార్థులకు సాంకేతిక విద్యలలో ప్రవేశం లభిస్తుంది.మహిళలకు శుభ వర్తమానాలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....నీలం, పచ్చ.

పరిహారాలు :   హనుమాన్‌ చాలీసా పఠించండి.

మీనం : పనుల్లో జాప్యం.ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి.ప్రయాణాలు వాయిదా.కుటుంబ సభ్యులతో విభేదాలు.ఆప్తులు మీ పై కొంత అలక వహిస్తారు.ఇంటాబయటా ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.రియల్టర్ల కృషి ఫలించదు.వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.ఉద్యోగులు విధుల్లో ప్రతిబంధకాలు ఎదుర్కొంటారు.విద్యార్థులు కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు.మహిళలకు ఆరోగ్య సమస్యలు.షేర్ల విక్రయాలలో కొంత అసంతృప్తి.అదృష్ట రంగులు....పసుపు,గులాబీ.

పరిహారాలు :    అంగారక స్తోత్రం పఠించాలి.

సంబంధిత వర్గం
అక్టోబర్ 15-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
అక్టోబర్ 15-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.