(Local) Wed, 16 Oct, 2019

అక్టోబర్ 04-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

October 04, 2019,   10:44 AM IST
Share on:
అక్టోబర్ 04-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు. ...

మేషం : వ్యవహారాల్లో ఆటంకాలు.రుణాలు చేయవలసిన పరిస్థితి.ఆకస్మిక ప్రయాణాలు సంభవం.భార్యాభర్తల వైరం.ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారికి గందరగోళమే.వ్యాపారాలు నిరాశాజనం.ఉద్యోగులకు ఒత్తిడులు.మహిళలకు మానసిక అశాంతి.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు....ఎరుపు, ఆకుపచ్చ.

పరిహారాలు : గణపతిని పూజించండి. 

వృషభం : స్నేహితులతో సఖ్యత నెలకొంటుంది.ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.ఇంటాబయటా మరింత ప్రోత్సాహం.నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది.వేడుకలలో పాల్గొంటారు.రియల్‌ ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు చిక్కులు తొలగుతాయి.వ్యాపారాలలో అనుకున్న లాభాలు సాధిస్తారు.ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు..మహిళలకు ఆస్తిలాభాలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....గులాబీ, లేత ఎరుపు.

పరిహారాలు :  కనకధారా స్తోత్రం పఠించాలి.

మిథునం : రాబడి మరింత పెరుగుతుంది.సోదరులు, మిత్రులతో సఖ్యత.ప్రముఖుల నుంచి శుభవర్తమానాలు.కార్యక్రమాలు సజావుగా సాగుతాయి.ఇళ్లు, వాహనాల కొనుగోలు చేస్తారు.రియల్‌ఎస్టేట్‌ల వారికి అంచనాలు నిజమవుతాయి.వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి.ఉద్యోగులకు మరింత అనుకూలం.ఐటీ నిపుణులకు పట్టింది బంగారమే.మహిళలకు ఆస్తిలాభాలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....తెలుపు, ఆకుపచ్చ.

పరిహారాలు :  హనుమాన్‌ పూజలు చేయండి.

కర్కాటకం : ముఖ్యమైన కార్యక్రమాలలో కొద్దిపాటి అవాంతరాలు.సన్నిహితులు, మిత్రులతో విభేదాలు.ఆర్థిక ఇబ్బందులు, రుణాలు చేయాల్సిన సమయం.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.శారీరక రుగ్మతలు బాధిస్తాయి.కాంట్రాక్టులు చేజారవచ్చు.వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు.మహిళలకు కొంత ఆందోళన చెందుతారు.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు....పసుపు, ఆకుపచ్చ.

పరిహారాలు :   నరసింహస్వామిని పూజించాలి.

సింహం : ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.ఆలోచనలు నిలకడగా ఉండవు.వివాదాలకు దూరంగా ఉండండి.మిత్రులే శత్రువులుగా మారతారు.ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.రియల్‌ఎస్టేట్‌ల వారికి కొత్త చిక్కులు.వ్యాపార లావాదేవీలు నిరాశాజనకమే.ఉద్యోగవర్గాలకు నిరుత్సాహం.ఐటీ నిపుణుల యత్నాలు ముందుకుసాగవు..మహిళలు కుటుంబసభ్యులతో విభేదిస్తారు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు....గోధుమ, కాఫీ.

పరిహారాలు :  అష్టలక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

కన్య : కొత్త వ్యక్తులు పరిచయం.పలుకుబడి మరింత పెరుగుతుంది.భార్యాభర్తల మధ్య విభేదాలు తీరతాయి.సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి అంచనాలు తప్పుతాయి.భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి.ఉద్యోగులకు ఉన్నతహోదాలు.విద్యార్థులు కోరుకున్న అవకాశాలు పొందుతారు.మహిళలకు ఆస్తి లాభాలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....గోధుమ, కాఫీ.

పరిహారాలు :  ఆదిత్య హృదయం పఠించండి.

తుల : ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.కష్టపడినా ఫలితం అందదు.వివాదాలకు దూరంగా ఉండండి.భార్యాభర్తల మధ్య అకారణంగా తగాదాలు.దూర ప్రయాణాలు ఉంటాయి..రియల్‌ ఎస్టేట్‌ల వారికి చిక్కులు.వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.ఉద్యోగులకు అదనపు పనిభారం.పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు తప్పవు.ఐటీ నిపుణులకు ఒడిదుడుకులు.మహిళలకు కుటుంబంలో చికాకులు.విద్యార్థుల శ్రమ వృథా కాగలదు.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టసాధ్యమే.అదృష్ట రంగులు....గోధుమ, కాఫీ.

పరిహారాలు :   దత్తాత్రేయుని పూజించండి.

వృశ్చికం : వివాదాల నుంచి బయటపడతారు.ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.శత్రువులు కూడా మిత్రులుగా మారతారు.భవనాలు, వాహనాలు కొంటారు.రాబడి ఆశాజనకంగా ఉంటుంది.వ్యాపారాలు అభివృద్ధి దిశగా సాగుతాయి.ఉద్యోగులకు హోదాలు.పారిశ్రామికవేత్తలు, కళాకారులకు చెప్పుకో తగ్గ ప్రగతి ఉంటుంది.ఐటీ నిపుణుల యత్నాలు సఫలం.మహిళలకు ఆస్తి వివాదాలు తీరతాయి.విద్యార్థులు మరిన్ని అవకాశాలు సాధిస్తారు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు.... గోధుమ, పసుపు.

పరిహారాలు :  హనుమాన్‌కు పూజలు చేయండి.

ధనుస్సు : రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు.పనుల్లో అవాంతరాలు ఎదురుకావచ్చు.నిర్ణయాలలో నిదానం పాటించండి.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.కాంట్రాక్టర్లు, రియల్టర్లకు ఒత్తిడులు.వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.ఉద్యోగులకు మరింత పనిభారం.రాజకీయవేత్తలు, కళాకారులకు అవకాశాలు చేజారతాయి.ఐటీ నిపుణులకు చిక్కులు.విద్యార్థులకు అవకాశాలు అంతగా కనిపించవు.మహిళలకు కుటుంబసభ్యుల నుంచి సహాయ నిరాకరణ.షేర్ల విక్రయాలు నిరాశ కలిగిస్తాయి.అదృష్ట రంగులు.... పసుపు, కాఫీ.

పరిహారాలు :  సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మకరం : పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.దూర ప్రాంతాల నుంచి అనుకూల సమాచారం..నిరుద్యోగులకు శుభవార్తలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి సమస్యలు కొన్ని తీరతాయి.వ్యాపారాలలో అనుకున్న లాభాలు పొందుతారు.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రావచ్చు.రాజకీయవేత్తలు, కళాకారులకు చిక్కులు తొలగుతాయి.విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు.మహిళలకు కార్యజయం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు.... నీలం, తెలుపు.

పరిహారాలు :  లక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

కుంభం : పాతబాకీలు వసూలవుతాయి.ఆలోచనలు అమలు చేస్తారు.నిరుద్యోగులకు కోరుకున్న  ఉద్యోగాలు దక్కుతాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.రియల్‌ ఎస్టేట్‌ల వారికి గందరగోళం తొలగుతుంది.వ్యాపారాలలో అభివృద్ధి.ఉద్యోగులకు ప్రోత్సాహకరమైన కాలం.ఐటీ నిపుణులకు కొత్త ఆశలు.మహిళలకు కుటుంబసమస్యలు తీరతాయి.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....గులాబీ, కాఫీ.

పరిహారాలు :   శివాలయంలో అర్చనలు చేయండి. 

మీనం : శ్రమ వృధా కాగలదు.ఆదాయానికి మించిన ఖర్చులు ఎదురవుతాయి.భార్యాభర్తల మధ్య అకారణ వైరం.శారీరక రుగ్మతలు.ఆలోచనలు స్థిరంగా ఉండవు.దూరప్రయాణాలు చేస్తారు.వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి.ఉద్యోగులకు విధుల్లో ఒత్తిడులు పెరుగుతాయి..పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నిరాశాజనకంగా ఉంటుంది.ఐటీనిపుణులకు చిక్కులు ఎదురుకావచ్చు.విద్యార్థులు మరింత శ్రద్ధ వహించాలి.మహిళలకు మానసిక అశాంతి.షేర్ల విక్రయాలలోలాభాలు కష్టమే.అదృష్ట రంగులు....గులాబీ, నీలం.

పరిహారాలు :   హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

 

 

సంబంధిత వర్గం
అక్టోబర్ 15-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
అక్టోబర్ 15-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
అక్టోబర్ 03-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
అక్టోబర్ 03-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.