(Local) Sun, 23 Feb, 2020

అక్టోబర్ 05-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..

October 05, 2019,   11:01 AM IST
Share on:
అక్టోబర్ 05-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం : ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయడంలో అవాంతరాలు.అనుకోని ప్రయాణాలు ఉంటాయి.ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది.సన్నిహితులు, మిత్రులతో విభేదిస్తారు.విద్యార్థులు ఎంత కష్టించినా ఫలితం పొందలేరు.వివాదాలకు మరింత దూరంగా ఉండండి.ఆస్తి విషయంలో ఒప్పందాలు మార్పుచుకుంటారు.రియల్‌ఎస్టేట్‌ల వారికి అంతగా కలిసిరాదు.వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.ఉద్యోగాలలో ఒడిదుడుకులు.రాజకీయవేత్తలు, కళాకారులకు వివాదాలు.విద్యార్థుల కృషి ఫలించదు.మహిళలకు మానసిక ఆందోళన.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు.... ఆకుపచ్చ, తెలుపు.

పరిహారాలు : సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృషభం : పనుల్లో జాప్యం.ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించక రుణాలు చేస్తారు.ఆలోచనలు స్థిరంగా ఉండవు.కుటుంబ సభ్యులతో విభేదాలు.ఆరోగ్యం పై శ్రద్ధ వహించండి.దూర ప్రయాణాలు చేస్తారు.ఆలయాలు సందర్శిస్తారు.ఇతరులను సమాధానం పర్చడంతోనే కాలం గడిచిపోతుంది.కోపతాపాలకు దూరంగా మెలగండి.రియల్‌ఎస్టేట్‌ల వారికి ఒత్తిడులు.వ్యాపారాలలో చికాకులు.ఉద్యోగాలలో మార్పులు.విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు.మహిళలకు కొన్ని చికాకులు.షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.అదృష్ట రంగులు....గులాబీ, లేత పసుపు.

పరిహారాలు :  ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం : పరిచయాలు మరింత పెరుగుతాయి.ఆత్మీయులతో వివాదాలు పరిష్కారం.శుభకార్యాలలో పాల్గొంటారు.పాత బాకీలు కొన్ని వసూలవుతాయి.శ్రమకు తగిన ఫలితం దక్కించుకుంటారు.ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి.కాంట్రాక్టులు దక్కించుకుంటారు.వాహన, గృహయోగాలు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.విద్యార్థులకు ఒడిదుడుకులు.మహిళలకు మానసిక ఆందోళన.షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.అదృష్ట రంగులు....ఎరుపు, నేరేడు.

పరిహారాలు :  గణేశాష్టకం పఠించండి.

కర్కాటకం : పరిచయాలు విస్తృతమవుతాయి.ఆలోచనలు పదిమందితో పంచుకుంటారు.ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి.పరిస్థితులు అనుకూలించి ముందడుగు వేస్తారు.భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు సఫలం.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.వివాదాలు కొన్ని పరిష్కరించుకుంటారు.సభలు, సమావేశాలలో పాల్గొంటారు.ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పురస్కారాలు.ఐటీ నిపుణులకు ఆహ్వానాలు.విద్యార్థులకు ఫలితం ఊరటనిస్తాయి.మహిళలకు సోదరులతో వివాదాలు తీరతాయి.షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.అదృష్ట రంగులు....నేరేడు, గులాబీ.

పరిహారాలు :  ఆంజనేయ దండకం పఠించండి.

సింహం : వ్యతిరేకులు మరింత పెరిగి సమస్యలు సృష్టిస్తారు.ఆలోచనలు స్థిరంగా ఉండవు.కుటుంబంలో సమస్యలతో కుస్తీపడతారు.ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించండి.చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి పరిస్థితులు అనుకూలించవు.వ్యాపారాలు కొంత సామాన్య స్థితిలో సాగుతాయి.ఉద్యోగాలలో మార్పులు అనివార్యం.పారిశ్రామికవేత్తలు, కళాకారులకు చిక్కులు పెరుగుతాయి.ఐటీ నిపుణులకు కొన్ని అవాంతరాలు ఎదురుకావచ్చు.మహిళలకు మానసిక ఆందోళన.అదృష్ట రంగులు....ఆకుపచ్చ, తెలుపు.

పరిహారాలు :  శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.

కన్య : ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు.నిరుద్యోగుల ప్రయత్నాలు ముందుకు సాగవు.ఎంత కష్టించినా ఫలితం దక్కక నిరాశ చెందుతారు.ఆస్తుల వ్యవహారాలలో కొత్త చిక్కులు.దూరప్రయాణాలు ఉంటాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు.అనారోగ్యం, వైద్య సేవలు పొందుతారు.వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి.విద్యార్థులు మరింత  కృషి చేయాలి.మహిళలకు కుటుంబ సభ్యులతో వైరం.అదృష్ట రంగులు....ఎరుపు, ఆకుపచ్చ.

పరిహారాలు :  వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.

తుల : కొత్త వ్యక్తుల పరిచయం.శుభకార్యాలకు హాజరై ఉత్సాహంగా గడుపుతారు.ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది.భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు లోటు ఉండదు.కొన్ని వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు.నూతన వ్యక్తుల పరిచయం.శుభకార్యాలలో పాల్గొంటారు.రావలసిన బాకీలు వసూలవుతాయి.వ్యాపార లావాదేవీలు మరింత ఉత్సాహాన్నిస్తాయి.ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి.విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం.మహిళలకు ఆస్తి లాభం.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు.... గులాబీ, నేరేడు.

పరిహారాలు :  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం : చేపట్టిన కార్యక్రమాలు వాయిదా వేస్తారు.ఆలోచనలు అంతగా కలసిరావు.బంధువులతో అకారణంగా తగాదాలు.ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.మీ పట్ల కొందరు వ్యతిరేకత చూపుతారు.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.స్థిరాస్తి వివాదాలతో కొంత గందరగోళంగా ఉంటుంది.దేవాలయాలు సందర్శిస్తారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొత్త సమస్యలు.వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఉద్యోగాలలో పని భారం.పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒత్తిడులు, విమర్శలు తప్పవు.ఐటీ నిపుణులకు మార్పులు ఉండవచ్చు.విద్యార్థులకు ఫలితాలపై నిరుత్సాహం.మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది.షేర్ల విక్రయాలలో లాభాలు కనిపించవు.అదృష్ట రంగులు.... ఎరుపు, నీలం.

పరిహారాలు :  శ్రీ రామ స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు : కొత్త వ్యక్తుల పరిచయం.శుభకార్యాలలో పాల్గొంటారు.ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి.పలుకుబడి మరింత పెంచుకుంటారు.భూవివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు.వాహన యోగం.నిరుద్యోగులు ఉద్యోగాలు దక్కించుకుంటారు.కాంట్రాక్టులు దక్కించుకుంటారు.వ్యాపారాలు పుంజుకుంటాయి.ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి.విద్యార్థుల శ్రమ, కృషి ఫలిస్తాయి.మహిళలకు తండ్రి తరఫు నుంచి ఆస్తి లేదా ధనలాభాలు.షేర్ల విక్రయాలలో అనుకున్న లాభాలు పొందుతారు.అదృష్ట రంగులు.... ఎరుపు, నేరేడు.

పరిహారాలు :  కనకధారా స్తోత్రాలు పఠించండి.

మకరం : ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు.ఆస్తి వివాదాలు తలనొప్పి గా మారవచ్చు.సోదరులు,సోదరీలతో విభేదాలు.నిరుద్యోగులకు నిరుత్సాహమే.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.కాంట్రాక్టులు తృటిలో తప్పిపోతాయి.వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి.ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీయానం.విద్యార్థులకు కొత్త సమస్యలు.మహిళలకు కుటుంబసభ్యులతో విభేదాలు.అదృష్ట రంగులు....ఆకుపచ్చ, నేరేడు.

పరిహారాలు :  నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

కుంభం : కొత్త కార్యక్రమాలు చేపట్టి ఉత్సాహంగా సాగుతారు.ఆత్మీయులు, బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.పలుకుబడి పెరుగుతుంది.కొన్ని అంచనాలు ఫలించి ముందడుగు వేస్తారు.ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తినిస్తుంది.కొన్ని సమస్యలు వాటంతట అవే తీరతాయి.ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.ఐటీ నిపుణులకు అరుదైన ఆహ్వానాలు.విద్యార్థులకు చిక్కులు తొలగుతాయి.మహిళలకు ఆస్తి లాభ సూచనలు.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు....గులాబీ, ఆకుపచ్చ.

పరిహారాలు :  అంగారక స్తోత్రాలు పఠించండి.

మీనం : చేపట్టిన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు.ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది.సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు.వివాదాలు తొలగి ఊరట లభిస్తుంది.కాంట్రాక్టులు దక్కి మరింత లాభపడతారు.వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.ఉద్యోగాలలో  సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు.విద్యార్థులకు అనుకూల ఫలితాలు.మహిళలకు భూ లాభాలు.షేర్ల విక్రయాలలో లాభాలు అందుతాయి.అదృష్ట రంగులు....గులాబీ, తెలుపు.

పరిహారాలు :  శ్రీ కృష్ణ స్తోత్రాలు పఠించండి.

సంబంధిత వర్గం
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.