(Local) Sun, 23 Feb, 2020

అక్టోబర్ 07-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..

October 07, 2019,   12:39 PM IST
Share on:
అక్టోబర్ 07-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం : ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు.ప్రయాణాలు వాయిదా.పనులలో అవరోధాలు.కుటుంబసభ్యులతో విభేదాలు.ఆలయాలు సందర్శిస్తారు.రియల్‌ఎస్టేట్‌ల వారికి ఇబ్బందికరంగా ఉంటుంది.వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి.ఉద్యోగులకు బదిలీలు.పారిశ్రామికవేత్తల యత్నాలు ముందుకు సాగవు.ఐటీ నిపుణులకు గందరగోళంగా ఉంటుంది.విద్యార్థులకు అవకాశాలు చేజారవచ్చు.మహిళలకు కుటుంబ సమస్యలు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు....నీలం, లేత గులాబీ.

పరిహారాలు :  వేంకటేశ్వరస్వామిని పూజించాలి. 

వృషభం : ఆలోచనలు అమలు చేస్తారు.మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు..ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.పాత బాకీలు సైతం వసూలవుతాయి.భూములు, స్థలాలు కొంటారు.రియల్టర్లు, కాంట్రాక్టర్లకు మరింత అనుకూలం.వ్యాపారాలకు లాభాలు దక్కుతాయి.ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.విద్యార్థులకు విలువైన సమాచారం.మహిళలు సంతోషకరమైన వార్తలు వింటారు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు.... తెలుపు, గులాబీ.

పరిహారాలు :  ఆదిత్య హృదయం పఠించాలి.

మిథునం : అనుకోని విధంగా ధన లబ్ధి.ఉద్యోగ యత్నాలలో పురోగతి.చిరకాల ప్రత్యర్థుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.ప్రయాణాల్లో నూతనోత్సాహం.ముఖ్యమైన పనులుసాఫీగా సాగుతాయి.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.ఉద్యోగులకు ఉన్నతస్థాయి నుంచి సహాయం..విద్యార్థులు మరిన్ని అవకాశాలు సాధిస్తారు.మహిళలకు శుభ వర్తమానాలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు.... కాఫీ, బంగారు.

పరిహారాలు : ఆంజనేయస్వామికి అర్చన చేయండి.

కర్కాటకం : కుటుంబ  సభ్యులతో వివాదాలు.అనుకోని ప్రయాణాలు ఉంటాయి.ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.ఆస్తి వివాదాలు నెలకొనవచ్చు.ఆలయాలు సందర్శిస్తారు.భార్యాభర్తల మధ్య అకారణంగా తగాదాలు..రాబడి తగ్గుతుంది.ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు.కళాకారులు, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలలో ఆటంకాలు.విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు.... పసుపు, ఎరుపు.

పరిహారాలు : సుబ్రహ్మణ్యస్వామిని పూజించాలి.

సింహం : శ్రమానంతరం పనులు పూర్తి చేస్తారు.మానసిక అశాంతికి లోనవుతారు.ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.కుటుంబ సభ్యులతో తగాదాలు.దూరపు బంధువులను కలుసుకుంటారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఒత్తిడులు.వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఐటీ నిపుణులకు వివాదాలు.విద్యార్థులకు అవకాశాలు కొంత నిరాశ పరుస్తాయి.మహిళలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు.షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.అదృష్ట రంగులు....గోధుమ, పసుపు.

పరిహారాలు : గణపతిని పూజించండి.

కన్య : ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి.ప్రముఖుల నుంచి ఆహ్వానాలు రాగలవు..వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఆదాయం మరింత పెరుగుతుంది.ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం.ఐటీ నిపుణులకు మరింత లాభదాయకం.విద్యార్థుల యత్నాలు సఫలం.మహిళలకు శుభవర్తమానాలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు.... ఎరుపు, తెలుపు.

పరిహారాలు : దత్తాత్రేయుని పూజించండి.

తుల : దూర ప్రయాణాలు ఉంటాయి.బంధువులతో తగాదాలు.శారీరక రుగ్మతలు తప్పవు.ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి.కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు.ఆలోచనలు స్థిరంగా ఉండవు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఆటుపోట్లు.వ్యాపారులకు ఒడిదుడుకులు.ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.విద్యార్థులకు కష్టమే తప్ప ఫలితం కనిపించదు.మహిళలకు మానసిక అశాంతి.షేర్ల విక్రయాలు మందకొడిగా సాగుతాయి.అదృష్ట రంగులు.... నీలం, నలుపు.

పరిహారాలు :  ఆంజనేయ దండకం పఠించండి.

వృశ్చికం : ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.భార్యాభర్తల మధ్య వివాదాలు సద్దుబాటు కాగలవు.బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు.వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి.పారిశ్రామికవేత్తల కృషి ఫలిస్తుంది. ఐటీ నిపుణులకు విశేషంగా కలిసి వస్తుంది.విద్యార్థులకు అనూహ్యమైన అవకాశాలు.మహిళలకు ఆస్తిలాభం.అదృష్ట రంగులు.... గోధుమ, ఆకుపచ్చ.

పరిహారాలు :  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు : ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది.అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు.సోదరులు, జీవిత భాగస్వామితో విభేదాలు.పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.పాత మిత్రులను కలుసుకుంటారు.కాంట్రాక్టులు చేజారవచ్చు.వ్యాపారాలలో గందరగోళంగా ఉంటుంది.ఉద్యోగులకు విధుల్లో మార్పులు..కళాకారులు, రాజకీయవేత్తలకు కొత్త సమస్యలు.ఐటీ నిపుణులకు నిరుత్సాహం.విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి.మహిళలకు కుటుంబంలో సమస్యలు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు.... ఆకుపచ్చ, గోధుమ.

పరిహారాలు : గణపతికి అర్చన చేయించుకోండి.

మకరం : బంధువుల నుంచి ముఖ్య సమాచారం.ఆహ్వానాలు అందుతాయి.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.శత్రువులు మిత్రులుగా మారతారు.ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి.వేడుకలు, సమావేశాల్లో పాల్గొంటారు.వ్యాపారులకు లాభాలు అందుతాయి.ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు.ఐటీ నిపుణులు నైపుణ్యతను చాటుకుంటారు.విద్యార్థులు ఆశించిన అవకాశాలు పొందుతారు.మహిళలకు ఉత్సాహంగా ఉంటుంది.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు.... కాఫీ, పసుపు.

పరిహారాలు :  కనకధారా స్తోత్రం పఠించండి.

కుంభం : అందరిలోనూ గుర్తింపు రాగలదు.మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు..స్థలాలు, వాహనాలు కొంటారు.చిరకాల కోరిక నెరవేరుతుంది.భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి.ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి..పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది..విద్యార్థులు మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారు.మహిళలకు కుటుంబంలో గౌరవం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు... ఆకుపచ్చ, ఎరుపు.

పరిహారాలు :  ఆదిత్య హృదయం పఠించండి.

మీనం : వ్యవహారాలలో ఆటంకాలు.ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.బంధువుల నుంచి మాటపడాల్సివస్తుంది.భార్యాభర్తల మ«ధ్య అపార్ధాలు..ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.శారీరక రుగ్మతలు బాధిస్తాయి.వ్యాపారాలలో లాభాలు అంతగా కనిపించవు.ఉద్యోగులకు విధుల్లోకొద్దిపాటి చికాకులు.ఐటీ నిపుణులకు మార్పులు ఉండవచ్చు.విద్యార్థులకు నిరుత్సాహం.మహిళలు కుటుంబసభ్యులతో మాటపట్టింపులు.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు... నీలం, ఆకుపచ్చ.

పరిహారాలు :   ఆదిత్య హృదయం పఠించాలి.

సంబంధిత వర్గం
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.