(Local) Wed, 16 Oct, 2019

అక్టోబర్ 09-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..

October 09, 2019,   12:27 AM IST
Share on:
అక్టోబర్ 09-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం : సంఘంలో గౌరవం పెరుగుతుంది.ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.భార్యాభర్తల మధ్య మరింత అన్యోన్యత.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.పనులు చకచకా సాగుతాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారి యత్నాలు ఫలించే సమయం.వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.ఉద్యోగులకు అనుకోని పదోన్నతులు సంభవం.పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.ఐటీ నిపుణులకు మరింత సానుకూలం.మహిళలకు శుభవర్తమానాలు.షేర్ల విక్రయాలలో అధిక లాభాలు తథ్యం.అదృష్ట రంగులు...ఆకుపచ్చ, బంగారు.

పరిహారాలు :  వేంకటేశ్వరస్వామిని పూజించండి.

వృషభం : ఆర్థిక వ్యవహారాలలో ఒడిడుకులు.దూర ప్రయాణాలు సంభవం.కష్టపడ్డా ఆశించిన ఫలితం అందుకోలేరు.శారీరక రుగ్మతలు.కుటుంబ సభ్యుల వైఖరితో విభేదిస్తారు.దైవ దర్శనాలు.వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు.ఉద్యోగులకు స్థాన మార్పులు.ఐటీ నిపుణుల యత్నాలు ఫలించవు.మహిళలకు మానసిక అశాంతి.షేర్ల విక్రయాలలో లాభాలు దక్కవు.అదృష్ట రంగులు...గోధుమ, ఆకుపచ్చ.

పరిహారాలు :  దత్తాత్రేయ స్తోత్రాలు పఠించాలి.

మిథునం : పనులు కొంత నత్తనడకన సాగుతాయి.రాబడి అంతగా కనిపించదు. రుణదాతలు ఒత్తిడులు పెంచుతారు.కుటుంబ సభ్యులతో వివాదాలు.కష్టమే తప్ప ఫలితం కనిపించదు.కాంట్రాక్టర్లు, రియల్టర్లకు గందరగోళంగా ఉంటుంది.వ్యాపారులు కొంత నిదానంతో సాగాలి.ఉద్యోగవర్గాలకు ఆకస్మిక బదిలీలు.మహిళలకు నిరుత్సాహం.షేర్ల విక్రయాలు సాదాసీదాగా ఉంటాయి.అదృష్ట రంగులు... గులాబీ, గోధుమ.

పరిహారాలు :  శివ స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం : ముఖ్య కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి.వివాహయత్నాలు ఫలిస్తాయి.రాబడి కొంత పెరుగుతుంది.వాహనాలు, స్థలాలు కొంటారు.కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు.వ్యాపారులకు అధిక లాభాలు.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు.రాజకీయవేత్తలు, కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి.మహిళలకు పురస్కారాలు దక్కుతాయి.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు... గోధుమ, తెలుపు.

పరిహారాలు :  శ్రీ రమా సత్యనారాయణస్వామి స్తోత్రాలు పఠించండి.

సింహం : పనులు విజయవంతంగా ముగిస్తారు.ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకం.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.పాత మిత్రుల కలయిక.వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.వివాహయత్నాలు ముమ్మరం చేస్తారు.ఆలయాలు సందర్శిస్తారు.రియల్‌ ఎస్టేట్‌ల వారి యత్నాలు సఫలం.వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు.ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.మహిళలకు సంతోషకరమైన సమాచారం.అదృష్ట రంగులు...నీలం, తెలుపు.

పరిహారాలు :  సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని పూజించండి.

కన్య : కార్యక్రమాలు ముందుకు సాగవు.బంధువులతో తగాదాలు.కష్టపడ్డా ఫలితం కనిపించదు.సోదరుల నుంచి సైతం ఒత్తిడులు.శారీరక రుగ్మతలు బాధిస్తాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారు కొంత నిదానం పాటించాలి.వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి.ఉద్యోగులకు శ్రమాధిక్యం.కళాకారులు, రాజకీయవేత్తలకు ప్రయత్నాలు ఫలించవు.ఐటీ నిపుణులకు మరిన్ని బాధ్యలు మీదపడతాయి.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు...కాఫీ, తెలుపు.

పరిహారాలు :  ఆదిత్య హృదయం పఠించండి.

తుల : వ్యవహారాలలో ఆటుపోట్లు.భార్యాభర్తల మధ్య అపోహలు.ఆలోచనలు నిలకడగా ఉండవు.ప్రత్యర్థులు సమస్యలు సృష్టిస్తారు.ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.దూర ప్రయాణాలు ఉంటాయి.వ్యాపార లావాదేవీలలో ఒడిదుడుకులు.ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు.రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలకు కొన్ని చిక్కులు.ఐటీ నిపుణులకు లేనిపోని చికాకులు.మహిళలకు కుటుంబ సమస్యలు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు...కాఫీ, పసుపు.

పరిహారాలు :  హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం : ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.చిరకాల కోరిక నెరవేరుతుంది.సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి.తీర్థయాత్రలు చేస్తారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి మరింత అనుకూలత.వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.ఉద్యోగవర్గాలకు ఇంక్రిమెంట్లు.పారిశ్రామికవేత్తలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.ఐటీ నిపుణులు శ్రమ ఫలించి మరింత ఉత్సాహంగా గడుపుతారు.మహిళలకు నూతనోత్సాహం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు... ఆకుపచ్చ, బంగారు.

పరిహారాలు :  అంగారక స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు : ఆర్థిక పరిస్థితి  సాధారణంగా ఉంటుంది..సన్నిహితుల నుంచి సమస్యలు ఎదుర్కొంటారు.వివాదాలకు దూరంగా ఉండండి.ఆరోగ్య, కుటుంబసమస్యలు వేధిస్తాయి.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారికి చిక్కులు.వ్యాపారాలలో ఆటుపోట్లు.ఉద్యోగులకు ఊహించని మార్పులు.రాజకీయవేత్తలకు నిరాశాజనకం.మహిళలకు నిరుత్సాహం.షేర్ల విక్రయాలలో లాభాలు స్వల్పంగా ఉంటాయి.అదృష్ట రంగులు...పసుపు, ఎరుపు.

పరిహారాలు :  విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.

మకరం : పరిస్థితులు అనుకూలిస్తాయి.చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.పనులు చకచకా సాగుతాయి.తీర్థ యాత్రలు చేస్తారు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.భార్యాభర్తల మధ్య వివాదాలు తీరతాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారికి సమస్యలు తీరతాయి.వ్యాపార లావాదేవీల్లో మరింత అనుకూలం.ఉద్యోగవర్గాలకు పదోన్నతులు.కళాకారులు, పారిశ్రామికవేత్తలకు మరింత అనుకూలత.ఐటీ నిపుణులు  అనుకున్న ప్రగతి సాధిస్తారు.మహిళలకు ఆసక్తికరమైన సమాచారం అందుతుంది.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు... గోధుమ, గులాబీ.

పరిహారాలు :  దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కుంభం : ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.బంధువులతో తగాదాలు ఏర్పడతాయి.ఆలోచనలు స్థిరంగా ఉండవు.అనారోగ్య సూచనలు.ఆలయాలు సందర్శిస్తారు.వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు.ఉద్యోగవర్గాలకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు.పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు.ఐటీ నిపుణులకు మానసిక అశాంతి.మహిళలకు ఆరోగ్య భంగం.షేర్ల విక్రయాలు లాభాలు కష్టమే.అదృష్ట రంగులు...ఆకుపచ్చ, బంగారు.

పరిహారాలు :  నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.

మీనం : శుభ వార్తలు అందుతాయి.వ్యవహారాలు అనుకూలిస్తాయి.చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి.ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి, ధన లాభ సూచనలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి మరింత అనుకూల వాతావరణం.వ్యాపారాలు పుంజుకుంటాయి.ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు ఉండవచ్చు.ఐటీ నిపుణులకు శుభవార్తలు.మహిళలకు కుటుంబంలో గౌరవం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు...పసుపు, గులాబీ.

పరిహారాలు :  దుర్గాదేవిని పూజించండి.

సంబంధిత వర్గం
అక్టోబర్ 15-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
అక్టోబర్ 15-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
అక్టోబర్ 07-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
అక్టోబర్ 07-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.