(Local) Fri, 13 Dec, 2019

అక్టోబర్ 29-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..

October 29, 2019,   12:19 PM IST
Share on:
అక్టోబర్ 29-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం : పనుల్లో  విజయం.శుభకార్యాలకు హాజరవుతారు.చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆలోచనలు అమలు చేస్తారు.సంఘంలో గౌరవం పెరుగుతుంది.సన్నిహితులు మీకు చేదోడుగా నిలుస్తారు.కొన్ని కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు.వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.పారిశ్రామిక, వైద్యరంగాల వారు ఉత్సాహంగా గడుపుతారు.విద్యార్థులకు నూతనోత్సాహం.మహిళలకు కుటుంబంలో గౌరవం.షేర్ల విక్రయాలులాభిస్తాయి.అదృష్ట రంగులు....గోధుమ, కాఫీ.

పరిహారాలు : దుర్గామాతకు కుంకుమార్చన చేయించుకోండి.

వృషభం : ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి.అందరితోనూ ఉల్లాసంగా గడుపుతారు.సేవా కార్యక్రమాల పై ఆసక్తి.కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.కొన్ని అంచనాలు నిజం చేసుకుంటారు.ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలోఉంటాయి.నిరుద్యోగులకు ఉద్యోగయోగం.రియల్‌ ఎస్టేట్‌ల వారు నేర్పుగా సమస్యలు అధిగమిస్తారు.వ్యాపారాలలో నూతన పెట్టుబడులు.ఉద్యోగులకు ఊహించని విధంగా ఇంక్రిమెంట్లు.రాజకీయ, వైద్యరంగాల వారికి అనూహ్యమైన అవకాశాలు.ఐటీ నిపుణులకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి.విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు.మహిళలకు గౌరవ పురస్కారాలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....తెలుపు, గోధుమ.

పరిహారాలు : లక్ష్మీనరసింహ స్తోత్రాలు పఠించండి.

మిథునం : రుణ బాధలు చికాకు పరుస్తాయి.దూర ప్రయాణాలు.సన్నిహితులతో వివాదాలు.ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి.ఎంత కష్టించినా ఫలితం దక్కని స్థితి.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొన్ని ఇబ్బందులు.వ్యాపారాలలో స్వల్పæ లాభాలతో సరిపెట్టుకోవాలి.ఉద్యోగులకు మార్పులు ఉంటాయి.రాజకీయ, పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహం.విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలు సామాన్యం.అదృష్ట రంగులు....పసుపు, గులాబీ.

పరిహారాలు :  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం : పనులలో మరింత జాప్యం.ప్రయాణాలు చివరిలో రద్దు.బంధువర్గంతో విరోధాలు.శ్రమ పెరుగుతుంది.మిత్రులు శత్రువులుగా మారే అవకాశం.ఆదాయం నిరుత్సాహపరుస్తుంది.ఉద్యోగులకు అదనపు పనిభారం.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.ఐటీ నిపుణులకు అంచనాలు తప్పుతాయి.విద్యార్థులు ఒత్తిడులకు లోనవుతారు.మహిళలకు మానసిక ఆందోళన.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు....నలుపు, ఆకుపచ్చ.

పరిహారాలు :  ఆదిత్య హృదయం పఠించండి.

సింహం : పట్టుదలతో వ్యవహారాలు పూర్తి చేస్తారు.ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి.సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.అందరిలోనూ గుర్తింపు పొందుతారు.ఆలయాలు సందర్శిస్తారు.కాంట్రాక్టర్లకు చిక్కులు తొలగుతాయి.వ్యాపారాలలో ముందడుగు.ఉద్యోగులకు ఉన్నత హోదాలు.పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి.విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు.మహిళలకు కుటుంబంలో గౌరవం.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు.... నీలం, పసుపు.

పరిహారాలు :  శివాలయంలో అర్చన చేయించుకుంటే మంచిది.

కన్య : ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి.వివాదాలకు దూరంగా ఉండండి.ముఖ్య నిర్ణయాలలో  ఆచితూచి వ్యవహరించాలి.ఆరోగ్య పరంగా చికాకులు.ఆకస్మిక ప్రయాణాలు సంభవం.కాంట్రాక్టర్లు, రియల్టర్లకు కొద్దిపాటి సమస్యలు ఎదురవుతాయి.వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.ఉద్యోగులకు స్థానమార్పులు.రాజకీయ, పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు.ఐటీ నిపుణులకు వివాదాలు నెలకొంటాయి.విద్యార్థులకు శ్రమాధిక్యం.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలు సామాన్యం.అదృష్ట రంగులు....నీలం, ఆకుపచ్చ.

పరిహారాలు :  గణపతికి అర్చన చేయించుకుంటే మంచిది.

తుల : ముఖ్యమైన విషయాలు తెలుకుసుంటారు.నిరుద్యోగుల యత్నాలుసానుకూలం.దూరపు బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది.పనులు సకాలంలో పూర్తి చేస్తారు.పలుకుబడి పెరుగుతుంది.ఆలోచనలు కార్య రూపం దాలుస్తాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.రియల్‌ఎస్టేట్‌ల వారికి మరింత ప్రోత్సాహం.వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.రాజకీయ, పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతమైన కాలం.ఐటీ నిపుణులు విదేశీ అవకాశాలు సాధిస్తారు.విద్యార్థులకు ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి.మహిళలకు శుభవర్తమానాలు.అదృష్ట రంగులు....గోధుమ, పసుపు.

పరిహారాలు :  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం : బంధువులతో తగాదాలు.ముఖ్యమైన పనులలో ఆటంకాలు.వ్యయ ప్రయాసలు.శారీరక రుగ్మతలు.వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.కాంట్రాక్టర్లకు కొత్త సమస్యలు.వ్యాపార  లావాదేవీలు మందగిస్తాయి.ఉద్యోగులకు అదనపు పనిభారం.దూరపు బంధువులను కలుసుకుంటారు.రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా.ఐటీ నిపుణులకు లేనిపోని చికాకులు.విద్యార్థులు లక్ష్యాలలో వెనుకబడతారు.మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతాయి.అదృష్ట రంగులు....తెలుపు, గులాబీ.

పరిహారాలు :  హనుమాన్‌ చాలీసా పఠించండి.

ధనుస్సు : పనుల్లో విజయం.దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు.ఆర్థికాభివృద్ధి ఉంటుంది.కుటుంబపరంగా నిర్ణయాలు తీసుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగయోగం.చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు.సేవాకార్యక్రమాల్లోచురుగ్గా పాల్గొంటారు.విలువైన వస్తువులు సేకరిస్తారు.వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి.ఉద్యోగులకు ప్రశంసలు.ఐటీ నిపుణులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.విద్యార్థులకు అనుకూల ఫలితాలురావచ్చు.మహిళలకు కుటుంబంలో గౌరవం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....ఆకుపచ్చ, గోధుమ.

పరిహారాలు :  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మకరం : నూతన ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి.సోదరులు,మిత్రులతో వివాదాల పరిష్కారం..వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.నిరుద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో సాధిస్తారు.శుభకార్యాలకు హాజరవుతారు.రాబడి పెరిగే సూచనలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి.వ్యాపారాలలో నూతనోత్సాహం.ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.పారిశ్రామికవేత్తలకు అవకాశాలు పెరుగుతాయి.ఐటీ నిపుణులకు ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది.విద్యార్థులు కొత్త లక్ష్యాలతో సాగుతారు.మహిళలకు గందరగోళం తొలగుతుంది.షేర్ల విక్రయాలలో అధిక లాభాలు.అదృష్ట రంగులు.... కాఫీ, ఎరుపు.

పరిహారాలు :  హనుమాన్‌ చాలీసా పఠించండి.

కుంభం : కుటుంబంలో చికాకులు.ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి.ముఖ్య నిర్ణయాలలో ఆచితూచి అడుగువేయండి.ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.బంధువులతో విభేదాలు.ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారికి గందరగోళంగా ఉంటుంది.వ్యాపారాలలో ఆటుపోట్లు.ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి.రాజకీయవేత్తల యత్నాలు ఫలించవు.ఐటీ నిపుణులకు అనుకోని వివాదాలు.విద్యార్థులు మరింత కృషి చేయాలి.మహిళలకు నిరుత్సాహం.షేర్ల విక్రయాలు నత్తనడకనసాగుతాయి..అదృష్ట రంగులు.... ఎరుపు, గులాబీ.

పరిహారాలు :  లక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

మీనం : వ్యవహారాలు మందగిస్తాయి.అనుకోని ఖర్చులు ఎదురవుతాయి.శ్రమ తప్ప ఫలితం ఆశించిన స్థాయిలో ఉండదు.ఆలయ దర్శనాలు,ఉద్యోగ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి.కొన్ని నిర్ణయాలు వాయిదా వేస్తారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఆటుపోట్లు, సమస్యలు ఎదురుకావచ్చు.కొత్త వ్యాపారాల ఆలోచనలు కలిసిరావు.ఉద్యోగులకు ఊహించని మార్పులు.రాజకీయవర్గాలకు ఒడిదుడుకులు.ఐటీ నిపుణులకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి.విద్యార్థులకు గందరగోళంగా ఉంటుంది.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలు నత్తనడకన సాగుతాయి..అదృష్ట రంగులు....నీలం, నలుపు.

పరిహారాలు :  ఆదిత్య హృదయం పఠించండి.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.