(Local) Thu, 05 Dec, 2019

అక్టోబర్ 30-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..

October 30, 2019,   11:21 AM IST
Share on:
అక్టోబర్ 30-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం : ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు.ఆస్తి విషయాలలో వివాదాలు.కొత్త రుణయత్నాలు. రాబడి అంతగా కనిపించదు.దూర ప్రయాణాలు.సేవాకార్యక్రమాల పై ఆసక్తి.కాంట్రాక్టులు చివరిలో చేజారవచ్చు.వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.ఉద్యోగులకు పని ఒత్తిడులు పెరుగుతాయి.రాజకీయ, పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహమే.ఐటీ నిపుణులకు మార్పులు తథ్యం.విద్యార్థులకు ఫలితాలలో నిరుత్సాహం.మహిళలకు మానసిక ఆందోళన.షేర్ల విక్రయాలు మందకొడిగా సాగుతాయి.అదృష్ట రంగులు.... ఆకుపచ్చ, లేత ఎరుపు.

పరిహారాలు : గణపతి అర్చన చేయించుకోండి.

వృషభం : పనుల్లో విజయం.సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది.కీలక  నిర్ణయాలు తీసుకుంటారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు.అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు.రాబడి పెరుగుతుంది.కాంట్రాక్టర్లకు మరింత ఉత్సాహం.వ్యాపారాలు అభివృద్ధి కనిపిస్తుంది.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కే అవకాశం.ఐటీ నిపుణులకు విశేష అభివృద్ధి.విద్యార్థులకు కొత్త ఆశలు.మహిళలకు నూతనోత్సాహం.షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.అదృష్ట రంగులు....ఎరుపు, గోధుమ.

పరిహారాలు : హనుమాన్‌ చాలీసా పఠించండి. 

మిథునం : మిత్రులతో ఆనందంగా గడుపుతారు.వ్యవహారాలలో విజయం సాధిస్తారు.సంఘంలో గౌరవం పెరుగుతుంది.కుటుంబ సభ్యులు అన్నింటా సహకరిస్తారు.ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు చేసుకుంటారు.వ్యాపారాలు మరింత లాభదాయకంగా సాగుతాయి.ఉద్యోగాల్లో చిక్కులు అధిగమిస్తారు.పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు.ఐటీ నిపుణులు అవార్డులు స్వీకరిస్తారు.విద్యార్థులకు అనుకున్న ఫలితాలు రావచ్చు.మహిళలకు ఆస్తి లాభం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....కాఫీ, తెలుపు.

పరిహారాలు : హనుమాన్‌ చాలీసా పఠించండి.

కర్కాటకం : ఆకస్మిక ప్రయాణాలు.ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.బంధుమిత్రులతో అకారణంగా తగాదాలు.నిర్ణయాలలో తొందరపాటు వద్దు.ఆరోగ్యపరమైన చికాకులు తప్పవు.వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.పారిశ్రామిక, వైద్యరంగాల వారికి ఒడిదుడుకులు.ఐటీ నిపుణులకు కోర్టు వివాదాలు.విద్యార్థులకు అనుకున్న ఫలితాలు కష్టమే.మహిళలకు నిరుత్సాహం.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు...గోధుమ,పసుపు.

పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.

సింహం : రుణ యత్నాలు ముమ్మరం చేస్తారు.ముఖ్య వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు.సన్నిహితులతో వివాదాలు నెలకొంటాయి.వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా.శారీరక రుగ్మతలు.వ్యాపారాలలో చికాకులు.ఉద్యోగులకు స్థానమార్పు ఉండవచ్చు.పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా.ఐటీ నిపుణులకు కొత్త సమస్యలు.విద్యార్థులు అంచనాలలో పొరపాట్లు దొర్లుతాయి.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.అదృష్ట రంగులు....గోధుమ, ఆకుపచ్చ.

పరిహారాలు : గణపతిని పూజించండి.

కన్య : కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు.పనులు సకాలంలో పూర్తి చేస్తారు.భూములు, ఇళ్లు కొనుగోలు చేస్తారు.ఆత్మీయుల ప్రేమానురాగాలు పొందుతారు.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.ఆలయాలు సందర్శిస్తారు.వ్యాపారాలలో ముందుకు సాగుతారు.ఉద్యోగులకు ఉన్నతస్థాయి నుంచి అభినందనలు.పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు.ఐటీ నిపుణులకు అవార్డులు దక్కవచ్చు.విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు.మహిళలకు కుటుంబసమస్యలు తీరతాయి.షేర్ల క్రయవిక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు.... బంగారు, పసుపు.

పరిహారాలు :  శివ స్తోత్రాలు పఠించండి.

తుల : ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.ఉద్యోగ  ప్రయత్నాలు మందగిస్తాయి.అనుకోని ప్రయాణాలు ఉంటాయి.నిరుద్యోగుల శ్రమ వృథా కాగలదు.పనులు నత్తనడకన సాగుతాయి.మిత్రులతో అకారణంగా తగాదాలు.శారీరక రుగ్మతలు.కాంట్రాక్టర్లకు అవకాశాలు చేజారవచ్చు.వ్యాపార లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి.ఉద్యోగవర్గాలకు విధి నిర్వహణలో ఆటంకాలు.రాజకీయ, పారిశ్రామికవేత్తలకు శ్రమాధిక్యం.విద్యార్థులకు కొంత ఆందోళన తప్పదు.మహిళలకు కుటుంబసభ్యులతో తగాదాలు.షేర్ల విక్రయాలలో లాభాలు అంతగా కనిపించవు.అదృష్ట రంగులు....నీలం, పసుపు.

పరిహారాలు :  హనుమాన్‌ చాలీసా పఠించండి.

వృశ్చికం : కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.శ్రేయోభిలాషుల నుంచి పిలుపు రాగలదు.సంఘంలో గౌరవం పెరుగుతుంది.విలువైన వస్తువులు, వాహనాలు కొంటారు.ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.రాజకీయవర్గాలకు నూతనోత్సాహం.ఐటీ నిపుణులకు విదేశీ అవకాశాలు దక్కుతాయి.విద్యార్థులు పరిశోధనలలో విజయం సాధిస్తారు.మహిళలకు కుటుంబంలో ఉత్సాహంగా గడుస్తుంది.షేర్ల విక్రయాలలో లాభాలు..అదృష్ట రంగులు....గోధుమ, తెలుపు.

పరిహారాలు :  ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు : ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు.కష్టపడ్డా ఫలితం కనిపించదు.కుటుంబ సభ్యులతో విభేదాలు.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.సన్నిహితులు నిందలు మోపే అవకాశం.పుణ్య క్షేత్రాల సందర్శనం.రియల్‌ ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు ఒక సమాచారం నిరాశ పరుస్తుంది.వ్యాపారాలలో లాభాలు సంతృప్తికరంగా ఉండవు.ఉద్యోగులకు పనిభారం తప్ప ఫలితం ఉండదు.రాజకీయ, పారిశ్రామికరంగాల వారికి ఒత్తిడులు.విద్యార్థులకు ఫలితాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు....ఎరుపు, కాఫీ.

పరిహారాలు :  నరసింహస్వామిని పూజించండి.

మకరం : ప్రముఖులతో పరిచయాలు.ఆర్థిక ,వస్తు లాభాలు.అప్రయత్నంగా ముఖ్యమైన పనులు పూర్తి.సోదరులు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు.బంధువుల నుంచి సహాయం.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.రియల్‌ఎస్టేట్‌ల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.వ్యాపారాల విస్తరణకు యత్నాలు సాగిస్తారు.ఉద్యోగుల సేవకు గుర్తింపు లభిస్తుంది.విద్యార్థులు అనుకూల ఫలితాలతో సంతోషంగా గడుపుతారు.మహిళలకు ఆస్తిలాభం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....నలుపు, పసుపు.

పరిహారాలు :  దుర్గామాతకు అర్చనలు చేయండి.

కుంభం : నూతన పరిచయాలు.అందరిలోనూ గౌరవం పొందుతారు.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు.కుటుంబ సభ్యులతో వివాదాలు తీరతాయి.నిరుద్యోగులకు ఒక వార్త సంతోషం కలిగిస్తుంది.ఆదాయం పెరుగుతుంది.రియల్‌ఎస్టేట్‌ల వారికి కోర్టు వివాదాలు తీరతాయి.వ్యాపారులకు అధిక లాభాలు.ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి.పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఆహ్వానాలు.ఐటీ నిపుణులకు పురస్కారాలు.విద్యార్థులకు మరిన్ని అవకాశాలు.మహిళలకు పురస్కారాలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి..అదృష్ట రంగులు....గులాబీ, లేత ఎరుపు.

పరిహారాలు :  హనుమాన్‌ చాలీసా పఠించండి.

మీనం : శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు.ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు.దూర ప్రయాణాలు.సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.మిత్రులు, బంధువులతో విభేదాలు.ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తప్పవు.రాబడి కొంత తగ్గి రుణాల కోసం అన్వేషిస్తారు.కాంట్రాక్టర్లకు చిక్కులు.వ్యాపార విస్తరణ యత్నాలు మందగిస్తాయి.ఉద్యోగులకు అనుకోని మార్పులు తథ్యం.రాజకీయవేత్తలకు అంచనాలు తప్పుతాయి.ఐటీ నిపుణులు ఆచితూచి వ్యవహరించాలి.విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి.మహిళలకు కుటుంబసమస్యలు.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే..అదృష్ట రంగులు....కాఫీ, గోధుమ.

పరిహారాలు :  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సంబంధిత వర్గం
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.