(Local) Fri, 13 Dec, 2019

అక్టోబర్ 31-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..

October 31, 2019,   12:25 PM IST
Share on:
అక్టోబర్ 31-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం : ముఖ్యమైన  వ్యవహారాల్లో ఆటంకాలు.వ్యయప్రయాసలు తప్పవు.బంధువర్గంతో విరోధాలు.నిర్ణయాలలో పొరపాట్లు దొర్లుతాయి.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు.ఆరోగ్య సమస్యలు, వైద్య సేవలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి అంచనాలు తారుమారు.వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.ఉద్యోగులకు స్థానమార్పు ఉండవచ్చు.విద్యార్థులు కష్టానికి తగ్గ ఫలితం పొందలేరు.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి..అదృష్ట రంగులు....కాఫీ, తెలుపు.

పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.

వృషభం : ఉత్సాహంగా పనులు చేపడతారు.ఉద్యోగావకాశాలు పొందుతారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.వాహనాలు,స్థలాలు కొంటారు.ఆదాయం పెరుగుతుంది.కాంట్రాక్టర్లకు సమస్యల నుంచి ఉపశమనం.వ్యాపారాలలో ఆటంకాలు అధిగిమిస్తారు.ఉద్యోగులకు ఉత్సాహంగా గడుస్తుంది.విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు.మహిళలకు కుటుంబంలో గౌరవం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....పసుపు, గులాబీ.

పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం : పనులు సకాలంలో చక్కదిద్దుతారు.కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు.ఆలయాలు సందర్శిస్తారు.సంఘంలో విశేష గౌరవం పొందుతారు.ఆస్తి వివాదాలు చొరవ తీసుకుని పరిష్కరించుకుంటారు.భూ, గృహయోగ సూచనలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఆస్తిలాభం.వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.విద్యార్థులు కొత్త కోర్సులు దక్కించుకుంటారు.మహిళలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....ఎరుపు, గులాబీ.

పరిహారాలు :  నరసింహస్వామిని పూజించండి.

కర్కాటకం : కార్యక్రమాలలో కొన్ని  అవరోధాలు.మానసిక అశాంతి తప్పదు.దూర ప్రయాణాలు ఉండవచ్చు.వివాదాలకు దూరంగా ఉండండి.బంధువుల నుంచి ఒత్తిడులు.ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది.ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.శారీరక రుగ్మతలు.వ్యాపారాలలో ఆటుపోట్లు.ఉద్యోగులకు శ్రమాధిక్యం. అధిక పనిభారం.పారిశ్రామికవర్గాలకు కొంత గందరగోళ పరిస్థితి.ఐటీ నిపుణులకు విదేశీ పర్యటనలు వాయిదా.విద్యార్థులు అంచనాలు తప్పి నిరాశ చెందుతారు.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....పసుపు, బంగారు.

పరిహారాలు : విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహం : ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి.ఆకస్మిక ప్రయాణాలు.బంధుమిత్రులతో విరోధాలు.కొన్ని విషయాలలో అంచనాలు తప్పుతాయి.పరిస్థితులు అంతగా అనుకూలించవు.ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి.దేవాలయాల సందర్శనం.వ్యాపారాలలో ఒడిదుడుకులు.ఉద్యోగులు విధి నిర్వహణలో సమస్యలు.రాజకీయ, పారిశ్రామికవర్గాలు నిరుత్సాహం చెందుతారు.ఐటీ నిపుణులకు వివాదాలు.విద్యార్థులకు అవకాశాలు దూరమవుతాయి.మహిళలకు కొంత గందరగోళంగా ఉంటుంది.షేర్ల విక్రయాలు నిరాశ పరుస్తాయి.అదృష్ట రంగులు....గోధుమ, పసుపు.

పరిహారాలు : హనుమాన్‌ చాలీసా పఠించండి.

కన్య : బంధువులతో సత్సంబంధాలు.ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది.రావలసిన బాకీలు అందుతాయి.పనుల్లో పురోగతి ఉంటుంది.సన్నిహితుల ప్రశంసలు.శ్రమకు ఫలితం దక్కుతుంది.వాహనాలు, స్థలాలు కొంటారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి చికాకులు తొలగుతాయి.వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి.ఉద్యోగవర్గాలకు పదోన్నతులు దక్కవచ్చు.పారిశ్రామికవర్గాలకు అరుదైన అవకాశాలు.విద్యార్థులకు కృషి ఫలిస్తుంది.మహిళలకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది.షేర్ల విక్రయాలు లాభిస్తాయి..అదృష్ట రంగులు....కాఫీ, ఆకుపచ్చ.

పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.

తుల : ఇంటాబయటా ఒత్తిడులు.ఆదాయానికి మించి ఖర్చులు తప్పవు.ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు.ముఖ్యమైన వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి.బంధువులతో వివాదాలు.దైవ దర్శనాలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి శ్రమ పెరుగుతుంది.వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడులు.విద్యార్థులకు అనుకున్న అవకాశాలు దూరమవుతాయి.మహిళలకు మానసిక అశాంతి.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు....నీలం, నలుపు.

పరిహారాలు : ఆంజనేయ దండకం పఠించండి.

వృశ్చికం : పాత మిత్రుల కలయిక.ఇంటిలో శుభకార్యాలు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.శత్రువులు కూడా మిత్రులుగా మారవచ్చు.పనులు అనుకున్న రీతిలో సాగుతాయి.గృహ, వాహన యోగాలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి మరింత ఉత్సాహంగా ఉంటుంది.వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.ఉద్యోగులకు కొన్ని చిక్కులు తొలగుతాయి.విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు.మహిళలకు మానసిక ప్రశాంతత.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....ఎరుపు, లేత పసుపు.

పరిహారాలు : గణపతిని పూజించండి.

ధనుస్సు : కుటుంబ సభ్యులతో అకారణంగా విరోధాలు.శ్రమాధిక్యంతో వ్యవహారాలు పూర్తి.ఆర్థిక ఇబ్బందులు తప్పవు.ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.కాంట్రాక్టర్లకు చిక్కులు తప్పవు.వ్యాపారాలలో లాభాలు కష్టమే.ఉద్యోగులకు బదిలీ అవకాశాలు.పారిశ్రామిక, సాంకేతిక వర్గాలకు నిరుత్సాహం.ఐటీ నిపుణులకు చిక్కులు తప్పవు.విద్యార్థులకు అనుకున్న ఫలితాలు కష్టమే.మహిళలకు కుటుంబసమస్యలు.షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.అదృష్ట రంగులు....గోధుమ, తెలుపు.

పరిహారాలు : హనుమాన్‌కు అర్చనలు చేయండి.

మకరం : కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు.ఆలోచనలు అమలు చేస్తారు.వ్యవహారాలలో విజయం.సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.ఆహ్వానాలు అందుతాయిప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.వ్యాపారాలలో కొత్త ఆశలు.ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి.ఐటీ నిపుణులకు మరింత ఆశాజనకంగా ఉంటుంది.విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు.మహిళలకు ఆస్తిలాభం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....ఆకుపచ్చ, గోధుమ.

పరిహారాలు : దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

కుంభం : పనుల్లో విజయం.అందరిలోనూ గౌరవ ప్రతిష్ఠలు పొందుతారు.మాటల చాతుర్యంతో  అందర్నీ ఆకర్షిస్తారు.భార్యాభర్తల మధ్య అపార్ధాలు తొలగుతాయి.స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు.ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.కాంట్రాక్టర్లకు అనుకోని అవకాశాలు.వ్యాపార విస్తరణలో ముందుకు సాగుతారు.ఉద్యోగవర్గాలవారికి నూతనోత్సాహం..ఐటీ నిపుణులకు సమస్యలు తీరతాయి.విద్యార్థులకు కొత్త అవకాశాలు.మహిళలకు కుటుంబంలోగౌరవం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....బంగారు, కాఫీ.

పరిహారాలు :  సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మీనం : కొన్ని పనులలో ప్రతిబంధకాలు.ఆర్థిక వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.బంధువులతో విభేదాలు.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.అనారోగ్యం, ఔషధ సేవనం.ఆలయ దర్శనాలు.రియల్‌ ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు కోర్టు వివాదాలు.వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి.ఉద్యోగులు అదనపు పనిభారం.రాజకీయ, పారిశ్రామికవర్గాలకు వ్యవహారాలు ముందుకు సాగవు.ఐటీ నిపుణులు నిర్ణయాలలో తొందరపడరాదు.విద్యార్థులకు అంతగా అనుకూలించదు.మహిళలకు కుటుంబసభ్యులతోతగాదాలు.షేర్ల విక్రయాలు నత్తనడకన సాగుతాయి.అదృష్ట రంగులు....నీలం, ఆకుపచ్చ.

పరిహారాలు :  వేంకటేశ్వరస్వామిని పూజించండి.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.