(Local) Wed, 05 Aug, 2020

సెప్టెంబర్ 04,2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..

September 04, 2019,   11:33 AM IST
Share on:
సెప్టెంబర్ 04,2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు. ...

మేషం : ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు.ఆర్థిక లావాదేవీలలో ఇబ్బందులు తొలగుతాయి.సన్నిహితుల నుంచి మాటసహాయం.భార్యాభర్తల మధ్య మరింత ప్రేమానురాగాలు.ఇంటాబయటా అనుకూల వాతావరణం.రియల్‌ ఎస్టేట్‌ల వారికి అనుకూల సమాచారం.రాజకీయవర్గాలకు సన్మానాలు.ఐటీ నిపుణులకు విదేశీ అవకాశాలు.విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు.మహిళలకు శుభవార్తలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు..... గులాబీ, లేత ఎరుపు.

పరిహారాలు : హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

వృషభం : నూతన ఉద్యోగ యోగం.కుటుంబ విషయాల్లో నిర్ణయాలు.వ్యవహారాల్లో ఊహించని విజయం సాధిస్తారు.భూ, గృహ యోగాలు కలుగుతాయి.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు.రాబడి పెరిగి అవసరాలు తీరతాయి.రాజకీయ, పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన వార్తలు.ఐటీ నిపుణులకు పరిస్థితులు అనుకూలిస్తాయి.విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు.మహిళలకు కుటుంబంలో ప్రశాంతత.షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.అదృష్ట రంగులు.....ఆకుపచ్చ, కాఫీ.

పరిహారాలు : లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించండి.

మిథునం : రుణ దాతల నుంచి ఒత్తిడులు.అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు.ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.బంధువుల నుంచి సమస్యలు.ప్రత్యర్థుల పట్ల మరింత అప్రమత్తంగా మెలగండి.ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి.రియల్‌ఎస్టేట్‌ల వారికి సమస్యలు తప్పవు.ఉద్యోగాల్లో మార్పులు ఉండవచ్చు.ఐటీ నిపుణులకు ఇబ్బందులు ఎదురుకావచ్చు.మహిళలకు ఇంటాబయటా సమస్యలు.అదృష్ట రంగులు.....తెలుపు, నీలం.

పరిహారాలు : నృసింహ స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం : ఆకస్మిక ప్రయాణాలు.వ్యయప్రయాసలు తప్పవు.ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.కీలక నిర్ణయాలలో మార్పులు.ఆరోగ్యపరమైన చికాకులు తప్పవు.కాంట్రాక్టర్లకు ఒడిదుడుకులు.వ్యాపారాలు నత్తనడనగా సాగుతాయి.ఉద్యోగులు మరింత కష్టపడాలి, పనిభారం పెరుగుతుంది.విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి.మహిళలకు బంధువులతో విభేదాలు.షేర్ల విక్రయాలు సామాన్యంగా లాభిస్తాయి.అదృష్ట రంగులు..... గులాబీ, ఆకుపచ్చ.

పరిహారాలు : విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహం : దూర ప్రాంతాల నుంచి శుభ వార్తలు.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.బంధువుల నుంచి ఆసక్తికరమైన సమాచారం.శుభకార్యాల్లో పాల్గొంటారు..ఉద్యోగార్ధులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు.ఇంటర్వ్యూలలో విజయం.రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఒప్పందాలు.కళాకారులకు సన్మానాలు. విశేష గుర్తింపు.ఐటీ నిపుణులకు సేవలు విస్తృతమవుతాయి.విద్యార్థులు ఊహలు నిజం చేసుకుంటారు.మహిళలకు కొన్ని సమస్యలు తీరతాయి.షేర్ల విక్రయాలలో అధికలాభాలు..అదృష్ట రంగులు.....గోధుమ, పసుపు.

పరిహారాలు : గణేశాష్టకం పఠించండి.

కన్య : ఆదాయవ్యయాలు సమానస్థాయిలో ఉంటాయి.ఇంటాబయటా వ్యతిరేకత.పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు.మిత్రులతో కలహాలు.శారీరక రుగ్మతలు.కష్టానికి తగిన ఫలితం కనిపించదు.ఆస్తి వివాదాలు నెలకొంటాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారు నిదానంగా వ్యవహరించాలి.కొత్త వ్యాపార ఆలోచనలు ముందుకు సాగవు.ఉద్యోగాల్లో అదనపు పనిభారం.రాజకీయవర్గాలకు అసంతృప్తి.ఐటీ నిపుణులకు శ్రమ తప్పదు.అదృష్ట రంగులు..... ఎరుపు, గులాబీ.

పరిహారాలు :  దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

తుల : కొన్ని వ్యవహారాలు సకాలంలో పూర్తి.ఇంటాబయటా అనుకూల వాతావరణం.చిరకాల కోరిక తీరుతుంది.సన్నిహితులు మరింత దగ్గరవుతారు.ఆలోచనలు కలిసివస్తాయి..ప్రత్యర్థుల సహాయం అందుతుంది.వాహనాలు, ఆభరణాలు కొంటారు.రియల్‌ఎస్టేట్‌ల వారికి చిక్కులు తొలగుతాయి.ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది.ఐటీ నిపుణులకు వివాదాలు సర్దుబాటు కాగలవు.విద్యార్థులు ఊహించని రీతిలో అవకాశాలు పొందుతారు.షేర్ల విక్రయాలలో అనుకున్న లాభాలు తథ్యం..అదృష్ట రంగులు.....కాఫీ, తెలుపు.

పరిహారాలు :  వేంకటేశ్వర స్తుతి మంచిది.

వృశ్చికం : ముఖ్య కార్యక్రమాలు ముందుకు సాగవు.సోదరులతో ఆస్తి వివాదాలు,కుటుంబ సమస్యలు వేధిస్తాయి.దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం.ఆలయాలు సందర్శిస్తారు.కాంట్రాక్టులు కొంత నిరాశ కలిగిస్తాయి.వ్యాపారాలలో ఒడిదుడుకులు.ఉద్యోగులకు స్థానమార్పులు.మహిళలకు సోదరీలతో వివాదాలు.షేర్ల విక్రయాలలో లాభాలు అంతగా కనిపిం^è వు.అదృష్ట రంగులు..... నీలం, తెలుపు.

పరిహారాలు : నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు : ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.మీ అంచనాలు నిజమై ఊపిరిపీల్చుకుంటారు.సంఘంలో గౌరవం పొందుతారు.కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తిచేస్తారు.ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు.కీలక నిర్ణయాలు తీసుకుంటారు.కుటుంంబంలో శుభకార్యాలు జరుగుతాయి.ఐటీ నిపుణులకు పట్టింది బంగారమే.విద్యార్థులు కొత్త అవకాశాలు అందుకుంటారు..షేర్ల విక్రయాలలో ఆశించిన లాభాలు.అదృష్ట రంగులు..... గులాబీ, లేత ఎరుపు.

పరిహారాలు :  అంగారక స్తోత్రాలు పఠించండి.

మకరం : ప్రయత్నాలు సఫలం.కుటుంబంలో శుభకార్యాలు.ఆప్తులతో సఖ్యత నెలకొంటుంది.విలువైన వస్తువులు కొంటారు.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.రాబడి ఆశించిన స్థాయిలో ఉంటుంది.కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కుతాయి.ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి.వ్యాపారాలు విస్తరణయత్నాలు ఫలిస్తాయి.రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు ఉత్సాహాన్నిస్తాయి.ఐటీ నిపుణులకు పురస్కారాలు.విద్యార్థులకు సాంకేతికవిద్యావకాశాలు.మహిళలకు గౌరవం పెరుగుతుంది.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు.....గులాబీ, కాఫీ.

పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం : ఆకస్మిక ప్రయాణాలు.ఆదాయానికి మించి ఖర్చులు.కుటుంబసభ్యులతో విరోధాలు.కొన్ని  వివాదాలు చికాకు పరుస్తాయి.ఆస్తుల విషయంలో సోదరుల నుంచి ఒత్తిడులు.ఆలయాలు సందర్శిస్తారు.కొన్ని కార్యక్రమాలను మధ్యలోనే విరమిస్తారు.రియల్టర్లు, కాంట్రాక్టర్లకు ఒత్తిడులు.భాగస్వామ్య వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.విద్యార్థులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు.షేర్ల విక్రయాల్లో లాభాలు కష్టసాధ్యమే.అదృష్ట రంగులు.....పసుపు, బంగారు.

పరిహారాలు : విష్ణు ధ్యానం చేయండి.

మీనం : కుటుంబ సభ్యులతో కొద్దిపాటి విభేదాలు.అనారోగ్యం, వైద్యసేవలు.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు.ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.రియల్‌ఎస్టేట్‌ల వారికి కోర్టు కేసులు.వ్యాపారాలలో ఆటుపోట్లు.ఉద్యోగులకు స్వల్ప మార్పులు.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు గందరగోళం.ఐటీ నిపుణులకు అంచనాలలో పొరపాట్లు.విద్యార్థులకు శ్రమ తప్పదు.మహిళలకు మానసిక అశాంతి.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు.....లేతనీలం, పసుపు.

పరిహారాలు : ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.

సంబంధిత వర్గం
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.