(Local) Mon, 16 Sep, 2019

సెప్టెంబర్ 06,2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

September 06, 2019,   11:27 AM IST
Views: 30
Share on:
సెప్టెంబర్ 06,2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాల ...

మేషం:  వ్యవహారాలలో  అవాంతరాలు ఎదురవుతాయి. అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు. బంధు,మిత్రుల నుంచి అపవాదులు. రాబడి సామాన్యంగా ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌ల వారికి గందరగోళం.వ్యాపారాలలో ఆశించిన లాభాలు కనిపించవు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు కొత్త సమస్యలు తప్పవు. ఐటీ నిపుణులకు ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. విద్యార్థులకు ఫలితాలు నిరాశ పరుస్తాయి.మహిళలకు కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి.షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం. అదృష్టరంగులు....లేత ఆకుపచ్చ, కాఫీ. 
పరిహారాలు : సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృషభం: ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. దీర్ఘ కాలిక సమస్యలు తీరతాయి. ఆప్తులుసహాయం అందిస్తారు. సంఘంలో మరింత కీర్తి పొందుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆలయాలు సందర్శిస్తారు. భార్యాభర్తల మధ్య వివాదాలు పరిష్కారం.ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహం. ఐటీ నిపుణులకు వివాదాల పరిష్కారం. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు.మహిళలకు నూతనోత్సాహం. షేర్ల విక్రయాలలో అనుకున్న లాభాలు.అదృష్టరంగులు....తెలుపు, గులాబీ. 
పరిహారాలు : విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధనలాభాలు.చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొత్త ఆశలు.వ్యాపారాలలో మరింతగా లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు ఊరిస్తాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఆశ్చర్యకరమైన సమాచారం. మహిళలకు మానసిక ప్రశాంతత. షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్టరంగులు....ఆకుపచ్చ, తెలుపు. 
పరిహారాలు : హనుమాన్‌ పూజలు మంచిది.

కర్కాటకం:ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ఎంతగా కష్టపడ్డా ఫలితం కనిపించదు. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. బంధువర్గంతో విరోధాలు నెలకొంటాయి.ఆలోచనలు నిలకడగా ఉండవు. శారీరక రుగ్మతలు. వైద్యసేవలు. వ్యాపారాలు అంతగా కలసిరావు. ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు. విద్యార్థులకు శ్రమాధిక్యం.మహిళలకు గందరగోళంగా ఉంటుంది. షేర్ల విక్రయాలలో అనుకున్న లాభాలు కష్టమే.అదృష్టరంగులు....పసుపు, తెలుపు. 
పరిహారాలు : సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

సింహం: పనులు కొన్ని ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా వివాదాలు. ఆరోగ్యపరంగా చికాకులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆస్తి వివాదాలు నెలకొంటాయి.భార్యాభర్తల మధ్య వివాదాలు. కాంట్రాక్టర్లకు అవకాశాలు దూరమవుతాయి.విద్యార్థులకు శ్రమాధిక్యం. మహిళలకు కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్టరంగులు....ఆకుపచ్చ, లేతఎరుపు. 
పరిహారాలు :  దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

కన్య:ఆర్థిక లావాదేవీలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. కుటుంబసమస్యలు పరిష్కరించుకుంటారు.ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆప్తులతో సఖ్యత ఏర్పడుతుంది. రియల్‌ఎస్టేట్‌ల వారికి మరింత అనుకూల సమయం.వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం.ఉద్యోగులకు మరింత ప్రోత్సాహం.పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు రాగలవు. ఐటీ నిపుణులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్టరంగులు....గోధుమ, ఎరుపు. 
పరిహారాలు : శివాష్టకం పఠించండి.

తుల: బంధువులతో స్వల్ప వివాదాలు. ప్రయాణాలలో అవాంతరాలు.శారీరక రుగ్మతలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటాయి.వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు.రియల్‌ఎస్టేట్‌ల వారికి అంచనాలలో పొరపాట్లు.వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు. విద్యార్థులు శ్రమ పెరుగుతుంది. మహిళలకు మానసిక ఆందోళన. షేర్ల విక్రయాలు మందగిస్తాయిఅదృష్టరంగులు....లేత పసుపు, కాఫీ. 
పరిహారాలు : సుబ్రహ్మణ్యేశ్వరున్ని పూజించండి.

వృశ్చికం:ఉత్సాహంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు.ఆత్మీయుల అభిమానం పొందుతారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు.భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రియల్‌ఎస్టేట్‌ల వారికి శుభవర్తమానాలు.వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మహిళలకు నూతనోత్సాహం. షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్టరంగులు....గోధుమ, పసుపు. 
పరిహారాలు :  శ్రీ లక్ష్మీ స్తోత్రం పఠించండి.

ధనుస్సు:ఆర్థిక ఇబ్బందులు తప్పవు.కుటుంబంలో ఒత్తిడులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. నిరుద్యోగులకు కొంత గందరగోళం. దేవాలయాలు సందర్శిస్తారు. పనులలో ఆటంకాలు.దూర ప్రయాణాలు సంభవం. రియల్‌ ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు సాదాసీదాగా ఉంటుంది.వ్యాపారులకు నిరుత్సాహమే. ఉద్యోగాలలో చిక్కులు. పారిశ్రామికవేత్తలకు పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు పనిఒత్తిడులు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు రాక నిరాశ చెందుతారు.మహిళలకు కుటుంబంలో చికాకులు. షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్టరంగులు....కాఫీ, ఎరుపు. 
పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.

మకరం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. చేపట్టిన కార్యక్రమాలలో పురోగతి.ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. బంధువులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వివాహ, ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ఆభరణాలు, వాహనాలు కొంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు అరుదైన ఆహ్వానాలు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మహిళలకు కుటుంబంలో విశేష గౌరవం. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్టరంగులు....కాఫీ, గోధుమ. 
పరిహారాలు :  శివ పంచాక్షరి పఠించండి.

కుంభం:నిరుద్యోగుల అంచనాలు నిజం చేసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.కొన్ని సమస్యలు తీరతాయి.వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఐటీ నిపుణులకు కొత్త ఆశలు. విద్యార్థులకు పరిశోధనల్లో విజయాలు. మహిళలకు శుభవార్తలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....కాఫీ, ఆకుపచ్చ. 
పరిహారాలు : నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

మీనం:చేపట్టిన కార్యక్రమాలలో ప్రతిబంధకాలు.రుణ బాధలు తప్పవు.కష్టించనా ఫలితం కనిపించదు.ఆస్తుల విషయంలో బంధువులతో తగాదాలు.గృహం కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు.ఆరోగ్యం పై కొంత శ్రద్ధ చూపండి.దైవదర్శనాలు చేసుకుంటారు.కాంట్రాక్టులు చేజారవచ్చు.వ్యాపారాలు స్వల్పంగా  లాభిస్తాయి.ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు.ఐటీ నిపుణులకు లేనిపోని చికాకులు.విద్యార్థులకు ఒత్తిడులు.మహిళలకు మానసిక అశాంతి.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్టరంగులు....ఆకుపచ్చ, గులాబీ. 
పరిహారాలు : విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
సెప్టెంబర్ 16,2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు. ...
సెప్టెంబర్ 16,2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు. ...
సెప్టెంబర్ 05,2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు ...
సెప్టెంబర్ 05,2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.