(Local) Wed, 05 Aug, 2020

సెప్టెంబర్ 08,2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు..

September 08, 2019,   11:45 AM IST
Share on:
సెప్టెంబర్ 08,2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు. ...

మేషం: బంధువులతో వివాదాలు.దూర ప్రయాణాలు ఉంటాయి.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.శ్రమానంతరం కొన్ని పనులు పూర్తి చేస్తారు.రావలసిన బాకీలు ఆలస్యమవుతాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఒత్తిడులు పెరుగుతాయి.వ్యాపారులూ తొందరపాటు వద్దు. నిదానంగా సాగండి.ఉద్యోగులు మరింత శ్రమ పడాలి.పారిశ్రామిక,వైద్య రంగాల వారికి ఒత్తిడులు.ఐటీ నిపుణులకు పని భారం.విద్యార్థులకు ఒడిదుడుకులు.మహిళలకు కుటుంబసభ్యుల నుంచి సమస్యలు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్టరంగులు...తెలుపు, లేత గులాబీ.

పరిహారాలు : గణేశాష్టకం పఠించండి.

వృషభం : కుటుంబంలో చికాకులు.పనులలో స్వల్ప ఆటంకాలు.మిత్రులు, బంధువులతో విరోధాలు.పరిస్థితులు అనుకూలించవు.రాబడి కన్నా ఖర్చులు అధికం.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ఉద్యోగవర్గాలకు చికాకులు.పారిశ్రామిక, వైద్యరంగాల వారికి నిరుత్సాహమే.ఐటీ నిపుణులకు కొత్త సమస్యలు.విద్యార్థులకు గందరగోళం.మహిళలకు కుటుంబసమస్యలు.షేర్ల విక్రయాలు సామాన్యం.అదృష్టరంగులు...ఆకుపచ్చ, కాఫీ.

పరిహారాలు :  శివపంచాక్షరి పఠించండి.

మిథునం : పరిచయాలు పెరుగుతాయి.సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు.జీవిత భాగస్వామి సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు.వ్యవహారాలలో విజయం.రాబడి ఆశించిన స్థాయిలో ఉంటుంది.చిన్ననాటి మిత్రులు తారసపడతారు.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.పారిశ్రామిక రంగాల వారికి యోగవంతమైన కాలం.ఐటీ నిపుణులకు శుభవార్తలు.విద్యార్థులు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు.మహిళలకు సంతోషకరమైన సమాచారం.అదృష్టరంగులు...గులాబీ, లేత ఎరుపు.

పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం : పలుకుబడి పెంచుకుంటారు.స్థిరాస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు.వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.గృహ, వాహన యోగాలు.పట్టుదలతో ముందుకు సాగుతారు.ఆదాయం మరింత పెరుగుతుంది.శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి వివాదాల పరిష్కారం.ఐటీ నిపుణులకు శుభవార్తలు.విద్యార్థులకు పురస్కారాలు.మహిళలకు ఆస్తి లాభం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు...నలుపు, పసుపు.

పరిహారాలు : దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

సింహం : వ్యయప్రయాసలు.పనుల్లో అవాంతరాలు.ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు.శ్రమాధిక్యమే.నిర్ణయాలలో ఆచితూచి అడుగు వేయండి.శారీరక రుగ్మతలు.తీర్థ యాత్రలు చేస్తారు.కాంట్రాక్టర్లు, రియల్టర్ల యత్నాలు ముందుకు సాగవు.రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా.ఐటీ నిపుణులకు చిక్కులు.విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు.మహిళలకు కుటుంబ సభ్యులతో వైరం.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్టరంగులు...ఎరుపు, బంగారు.

పరిహారాలు : దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

కన్య : రుణాలు చేస్తారు. రాబడి తగ్గుతుంది.దూర ప్రయాణాలు ఉంటాయి.బంధుమిత్రులతో అకారణంగా తగాదాలు.కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు.కుటుంబ సభ్యులు  మీతో విభేదిస్తారు.ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొంత నిరాశ.వ్యాపారులు నిదానంగా సాగడం మంచిది.ఉద్యోగులకు మానసిక అశాంతి.పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.ఐటీ నిపుణులకు లేనిపోని సమస్యలు.మహిళలకు కుటుంబంలో చికాకులు.అదృష్టరంగులు...పసుపు, కాఫీ.

పరిహారాలు : దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

తుల : ఇవాళ ఉల్లాసంగా గడుపుతారు.కుటుంబసభ్యులు పూర్తిగా సహకరిస్తారు.ఇచ్చిన మాట నిలుపుకునేందుకు ప్రయత్నిస్తారు.పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఉద్యోగావకాశాలు పొందుతారు.స్థిరాస్తి వివాదాలు తీరతాయి.అదనపు రాబడి ఉంటుంది.రాజకీయ, వైద్య రంగాల వారికి సన్మానాలు.ఐటీ నిపుణుల యత్నాలు ఫలిస్తాయి.విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్టరంగులు...ఎరుపు, గోధుమ.

పరిహారాలు :  శివాష్టకం పఠించండి.

వృశ్చికం : మిత్రుల నుంచి ఒత్తిడులు.ప్రయాణాల్లో ఆటంకాలు.వ్యయప్రయాసలు .రాబడి అంతంత మాత్రంగా ఉంటుంది.పనులు మందకొడిగా సాగుతాయి.ఆలోచనలు నిలకడ ఉండవు.తీర్థ యాత్రలు చేస్తారు.రియల్‌ఎస్టేట్‌ల వారికి ఇబ్బందులు.వ్యాపారాలలో ఒడిదుడుకులు.ఉద్యోగవర్గాలకు బదిలీలు.రాజకీయ,వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా.ఐటీ నిపుణులకు అదనపు బాధ్యతలు.విద్యార్థులకు అవకాశాలు చేజారతాయి.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి.అదృష్టరంగులు...గులాబీ, ఆకుపచ్చ.

పరిహారాలు :  రామరక్షా స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు : కుటుంబ సభ్యుల సలహాలతో పనులు పూర్తి చేస్తారు.వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం.సన్నిహితులు సాయం అందిస్తారు.దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు రావచ్చు.బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది.రియల్‌ ఎస్టేట్‌ల వారికి అంచనాలు నిజమయ్యే వేళ.విద్యార్థులను ఒక ప్రకటన విశేషంగా ఆకట్టుకుంటుంది.మహిళలకు శుభ వర్తమానాలు.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్టరంగులు...నీలం, పసుపు.

పరిహారాలు : నృసింహ స్తోత్రాలు పఠించండి.

మకరం : ఆర్థిక ఇబ్బందులు.అనుకున్న పనులు ముందుకు సాగవు.ఆలోచనలు కలసిరావు.ఇంటాబయటా చికాకులు.బంధువులతో విభేదాలు.శారీరక రుగ్మతలు.కష్టానికి ఫలితం కనిపించదు.రియల్‌ ఎస్టేట్‌ల వారు కొంత గందరగోళానికి లోనవుతారు.రాజకీయవర్గాలకు ఒత్తిడులు.ఐటీ నిపుణులకు పనిభారం పెరుగుతుంది.విద్యార్థులకు అవకాశాలు చేజారవచ్చు.మహిళలకు కుటుంబసభ్యులతో తగాదాలు.షేర్ల విక్రయాలు నిరాశ పరుస్తాయి.అదృష్టరంగులు...గోధుమ, లేత నీలం.

పరిహారాలు : రామస్తోత్రాలు పఠించండి.

కుంభం :పనులలో పురోగతి కనిపిస్తుంది.ఎంతటి వారినైనా ఆకట్టుకుని ముందుకు సాగుతారు.నూతన పరిచయాలు.వివాహా, ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి.ఒక సంఘటన ఆకట్టుకుంటుంది.కుటుంబ సభ్యుల సలహాలు పొందుతారు.ఇతరులకు సైతం సాయపడతారు.రియల్‌ఎస్టేట్‌ల వారికి కొత్త ఒప్పందాలు.భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి.విద్యార్థులకు కొత్త ఆశలు.మహిళలకు సన్మానాలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్టరంగులు...తెలుపు, కాఫీ.

పరిహారాలు : విష్ణు ధ్యానం చేయండి.

మీనం : ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి.దూరపు బంధువుల నుంచి కీలకమైన సమాచారం.ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి.పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం.ప్రత్యర్థులను మీదారికి తెచ్చుకుంటారు.ప్రతిభను చాటుకునేందుకు తగిన సమయం.రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది.విద్యార్థులకు మంచి ర్యాంకులు.మహిళలకు ఆస్తిలాభం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్టరంగులు...నీలం, నలుపు.

పరిహారాలు : రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

సంబంధిత వర్గం
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.