(Local) Wed, 05 Aug, 2020

సెప్టెంబర్ 09,2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..

September 09, 2019,   12:05 PM IST
Share on:
సెప్టెంబర్ 09,2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు. ...

మేషం : పనులు మందగిస్తాయి.రాబడి అంతగా ఉండదు.శారీరక రుగ్మతలు.ప్రత్యర్థుల నుంచి ఒత్తిళ్లు.రియల్‌ఎస్టేట్‌ల వారికి భూవివాదాలు నెలకొంటాయి.వ్యాపార లావాదేవీలు నిరాశపరుస్తాయి..ఉద్యోగాల్లో మార్పులు సంభవం.రాజకీయ, పారిశ్రామికవర్గాలకు మానసిక ఆందోళన.ఐటీ నిపుణుల యత్నాలలో ఆటంకాలు.విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి.మహిళలకు కొత్త సమస్యలు.షేర్ల విక్రయాలలో ఆచితూచి వ్యవహరించాలి.అదృష్టరంగులు....నీలం, ఆకుపచ్చ.

పరిహారాలు : లక్ష్మీ దేవి స్తోత్రాలు పఠించండి.

వృషభం : కుటుంబ సభ్యులతో విరోధాలు.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు.రాబడి కొంత తగ్గి అప్పులు కోసం యత్నిస్తారు.కాంట్రాక్టర్లకు చిక్కులు.ఉద్యోగాల్లో అదనపు పనిభారం.వ్యాపార లావాదేవీలు కొంత నిరాశ పరుస్తాయి..పారిశ్రామిక, రాజకీయవర్గాలకు అంతగా అనుకూలంకాదు.మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటారు..షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్టరంగులు.... గులాబీ, తెలుపు.

పరిహారాలు : శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.

మిథునం : ముఖ్య కార్యక్రమాలు సజావుగా పూర్తి కాగలవు.ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.మిత్రుల నుంచి ధనలాభం.ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు.ఆదాయం అనుకున్నంతగా పెరుగుతుంది.రియల్‌ఎస్టేట్‌ల వారు అనుకున్నది సాధిస్తారు.ఐటీ నిపుణులు సత్తా చాటుకుంటారు..విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది..మహిళలకు సోదరులతో వివాదాలు పరిష్కారం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....గులాబీ, లేత ఎరుపు.

పరిహారాలు :  నృసింహ స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం : ఆస్తి వివాదాలు కొంత తీరతాయి.శుభకార్యాల్లో పాల్గొంటారు.పాత మిత్రులతో మంచీచెడ్డా విచారిస్తారు.నూతన విద్య, ఉద్యోగావకాశాలు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.రియల్‌ఎస్టేట్‌ల వారికి శుభవర్తమానాలు.వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.ఉద్యోగులకు అనుకూల మార్పులు.రాజకీయ, పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.విద్యార్థులకు అనుకూల ఫలితాలు.మహిళలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.అదృష్టరంగులు....ఎరుపు, పసుపు.

పరిహారాలు :  ఆంజనేయ స్తోత్రాలు పఠించండి. 

సింహం : కొత్తగా రుణాలు చేయాల్సి వస్తుంది.బంధువులతో మాటపట్టింపులు.దూర ప్రయాణాలు.రాబడి నిరుత్సాహపరుస్తుంది.ఆలోచనలు నిలకడగా ఉండవు.రియల్‌ఎస్టేట్‌ల వారికి నిరాశాజనకం.ఉద్యోగులకు పనిభారం.వ్యాపారాలు తొంచ నిరాశాజనకంగా ఉంటాయి.విద్యార్థులకు ఫలితాలు కొంత ఊరటనిస్తాయి.మహిళలు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించాలి.షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.అదృష్టరంగులు.... నీలం, ఆకుపచ్చ.

పరిహారాలు : శివాష్టకం పఠించండి.

కన్య : ఆస్తి వివాదాలు కొంత చికాకు కలిగిస్తాయి.అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు.ఆలయాల సందర్శనం..సోదరులతో అకారణంగా తగాదాలు.శారీరక  రుగ్మతలు.రియల్‌ ఎస్టేట్‌ల వారు నిరాశకు లోనవుతారు.విద్యార్థులకు అనుకున్న  ఫలితాలు కష్టమే.మహిళలకు కుటుంబసమస్యలు .షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్టరంగులు....నలుపు, పసుపు.

పరిహారాలు : హనుమాన్‌ఛాలీసా పఠించండి. 

తుల : నూతన వ్యక్తుల పరిచయాలు.ఆలోచనలు అమలు చేస్తారు.సమాజంలో మీకంటూ ప్రత్యేకతను చాటుకుంటారు.శుభకార్యాల్లో పాల్గొంటారు.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.భార్యా భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు.ఐటీ నిపుణులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.విద్యార్థులకు అనుకున్న అవకాశాలు దక్కుతాయి.మహిళలకు విజయవంతమైన కాలం.షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.అదృష్టరంగులు.... తెలుపు, గులాబీ.

పరిహారాలు : అన్నపూర్ణాష్టకం పఠించండి.

వృశ్చికం : ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి.దూర ప్రయాణాలు సంభవం.భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి.పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు.ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.కాంట్రాక్టర్లకు సమస్యలు తప్పవు.వ్యాపారాలలో కొంత ఒడిదుడుకులు.ఉద్యోగులకు పనిభారం తప్పదు.విద్యార్థులు కష్టానికి ఫలితం కనిపిస్తుంది.మహిళలకు శుభవర్తమానాలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్టరంగులు....పసుపు, గులాబీ.

పరిహారాలు : విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు : పనులు విజయవంతంగా పూర్తి చేస్తారుశుభకార్యాలు నిర్వహిస్తారు..ఆర్థికంగా పురోగతి  కనిపిస్తుంది.ఆలోచనలు అమలు చేస్తారు.బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.కాంట్రాక్టర్లు, రియల్టర్లు ఆశించిన అభివృద్ధి సాధిస్తారు.ఐటీ నిపుణులకు మరింత అనుకూలం.విద్యార్థులకు  ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి.మహిళలకు ఉత్సాహంగా ఉంటుంది.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్టరంగులు.... గోధుమ, ఎరుపు.

పరిహారాలు :  నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

మకరం : రాబడి కన్నా ఖర్చులు పెరుగుతాయి.కుటుంబ సమస్యలు వేధిస్తాయి.పనులు ముందుకు సాగక ఇబ్బంది పడతారు.శారీరక రుగ్మతలు.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.రియల్‌ఎస్టేట్‌ల వారికి అంచనాలు తప్పుతాయి.వ్యాపారాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి.ఉద్యోగులకు బదిలీలు ఉండవచ్చు.విద్యార్థులకు కొన్ని అవకాశాలు చేజారతాయి.మహిళలకు ఆరోగ్యసమస్యలు.షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.అదృష్టరంగులు....ఆకుపచ్చ, గోధుమ.

పరిహారాలు :  విష్ణు ధ్యానం చేయండి.

కుంభం : పాత మిత్రుల నుంచి శుభవార్తలు.ఆర్థిక ఇబ్బందులు తీరతాయి.నిరుద్యోగుల ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి.సభలు, సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు.బంధువుల సాయంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి సంతృప్తికరంగా ఉంటుంది.వ్యాపార లావాదేవీలు కొంత ఊపందుకుంటాయి.ఉద్యోగులకు ఊరిస్తున్న  ఇంక్రిమెంట్లు దక్కుతాయి.మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగుతాయి.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్టరంగులు....గులాబీ , పసుపు.

పరిహారాలు :   గణేశ్‌ను పూజించండి..

మీనం : చేపట్టిన  పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.అందరిలోనూ  విశేష గౌరవం పొందుతారు.ఆకస్మిక ధన లాభాలు.ప్రముఖులతో పరిచయాలు.శుభకార్యాలకు ఖర్చు చేస్తారు.ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది.రియల్‌ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు చిక్కులు తొలగుతాయి.వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కే సూచనలు.రాజకీయవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహం.ఐటీ నిపుణులకు మరింత రాణింపు ఉంటుంది..విద్యార్థులకు విద్యా పురస్కారాలు,మహిళలకు శుభవర్తమానాలు.షేర్ల విక్రయాలు అనుకూలంగా సాగుతాయి.అదృష్టరంగులు....ఎరుపు, తెలుపు.

పరిహారాలు :  గణేశాష్టకం పఠించండి.

సంబంధిత వర్గం
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.