(Local) Wed, 05 Aug, 2020

సెప్టెంబర్ 10,2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..

September 10, 2019,   11:27 AM IST
Share on:
సెప్టెంబర్ 10,2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు ...

మేషం :నూతన వ్యక్తుల పరిచయం.శుభకార్యాల్లో పాల్గొంటారు.పాత బాకీలు వసూలవుతాయి.సంఘంలో గౌరవానికి లోటు ఉండదు.కొన్ని వ్యవహారాలు సకాలంలో పూర్తి.రాబడి పెరిగి ఉత్సాహాన్నిస్తుంది.భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.రియల్‌ఎస్టేట్‌ల వారికి ఊహించని అభివృద్ధి.వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.ఉద్యోగాల్లో హోదాలు దక్కుతాయి.విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు.మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్టరంగులు.... నీలం, ఆకుపచ్చ.

పరిహారాలు : లక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

వృషభం : ప్రయాణాలు చివరిలో వాయిదా.ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు.ధార్మిక కార్యక్రమాలో పాల్గొంటారు.ఆప్తుల నుంచి సైతం ఒత్తిడులు.ఆలోచనలు నిలకడగా ఉండవు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఉత్సాహం తగ్గుతుంది.ఐటీ నిపుణులు ఆచితూచి వ్యవహరించాలి.విద్యార్థులకు కష్టానికి ఫలితం కనిపించదు.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్టరంగులు.... కాపీ, పసుపు.

పరిహారాలు : దుర్గా దేవి స్తోత్రాలు పఠించండి.

మిథునం: రాబడి తగ్గి నిరుత్సాహపడతారు.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.ఇంటాబయటా ఒత్తిడులు.కుటుంబ బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.దేవాలయాలు సందర్శిస్తారు.వ్యాపారాలలో  ఆటుపోట్లు.విద్యార్థులకు కొన్ని అవకాశాలు చేజారతాయి.మహిళలకు మానసిక ఆందోళన.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్టరంగులు.... ఎరుపు, గోధుమ.

పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం : ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.సన్నిహితులతో చర్చలు జరుపుతారు.భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి సమస్యల నుంచి ఉపశమనం.వ్యాపారులకు లాభాలు అందుతాయి.ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి.విద్యార్థులు అనుకున్న ఫలితాలు తథ్యం..మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్టరంగులు....పసుపు, గులాబీ.

పరిహారాలు :  అంగారక స్తోత్రాలు పఠించండి.

సింహం : ఉద్యోగ యత్నాలలో పురోగతి కనిపిస్తుంది.చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు.కొత్త మిత్రులు పరిచయమవుతారు.రాబడి  ఆశాజనకంగా ఉంటుంది.కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు.ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి.మహిళలకు సన్మానాలు.షేర్ల విక్రయాలలో అధికలాభాలు.అదృష్టరంగులు.... గులాబీ, కాఫీ.

పరిహారాలు :  గణపతికి అర్చనలు చేయండి.

కన్య : పనులు కొన్ని వాయిదా వేస్తారు.కుటుంబసమస్యలతో కుస్తీ పడతారు.ఆలోచనలు స్థిరంగా ఉండవు.దూర ప్రయాణాలు. ఉంటాయి.శారీరక రుగ్మతలు.ఆదాయం నిరాశ కలిగిస్తుంది.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొత్త సమస్యలు.ఉద్యోగులకు  బదిలీలు ఉంటాయి.వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు.ఐటీ నిపుణులు కొంత నిదానం పాటించడం ఉత్తమం..విద్యార్థులకు అసంతృప్తి తప్పదు.మహిళలకు ఆరోగ్యం మందగిస్తుంది.షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.అదృష్టరంగులు....కాఫీ, ఆకుపచ్చ.

పరిహారాలు : కనకధారా స్తోత్రాలు పఠించండి.

తుల : వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.ఆదాయానికి మించిన ఖర్చులు తప్పవు.కుటుంబ సభ్యులతో లేనిపోని వివాదాలు నెలకొనవచ్చు.బంధువుల నుంచి విమర్శలు..శారీరక రుగ్మతలు, వైద్యసేవలు.రియల్‌ఎస్టేట్‌ల వారు వ్యవహారాలలో తొందరపడరాదు.వ్యాపారాలలో లాభాలు కష్టమే.ఐటీ నిపుణులకు వివాదాలు నెలకొంటాయి.విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి.మహిళలు కుటుంబసభ్యులతో విభేదిస్తారు.షేర్ల విక్రయాలు నత్తనడకన సాగుతాయి.అదృష్టరంగులు.... నీలం, పసుపు.

పరిహారాలు : దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం : నూతన వ్యక్తుల పరిచయాలు.శ్రమకు ఫలితం దక్కుతుంది.నూతన వ్యక్తులు పరిచయమవుతారు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.కొన్ని వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.ఉద్యోగాల్లో సమస్యలు తీరతాయి.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు.ఐటీ నిపుణులకు ఊహించని ఆహ్వానాలు.విద్యార్థులకు నూతన అవకాశాలు.మహిళలకు ఉత్సాహంగా ఉంటుంది.షేర్ల విక్రయాలలో అధికలాభాలు.అదృష్టరంగులు.... గులాబీ, ఎరుపు.

పరిహారాలు :  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు : ముఖ్యమైన పనుల్లో చికాకులు.మిత్రులతో మాటపట్టింపులు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.భార్యాభర్తల మరింత సఖ్యత.దూర ప్రయాణాలు ఉండవచ్చు.ఆరోగ్య సమస్యలు.రియల్‌ఎస్టేట్‌ల వారు కొన్ని చిక్కులు ఎదుర్కొంటారు.వ్యాపారాలలో  స్వల్ప లాభాలు.ఉద్యోగులకు అనుకోని మార్పులు.రాజకీయవర్గాలకు కొంత నిరాశ తప్పకపోవచ్చు.ఐటీ నిపుణులకు వివాదాలు.విద్యార్థులు కొంత శ్రమపడాల్సిన సమయం.మహిళలకు మనోధైర్యం తగ్గుతుంది.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్టరంగులు.... నలుపు, కాఫీ.

పరిహారాలు : దుర్గాదేవిని పూజించండి.

మకరం : సన్నిహితులతో వివాదాలు పరిష్కారం.రాబడి కొంత మెరుగ్గా ఉంటుంది.ప్రత్యర్థులు సైతం అనుకూలంగా మారతారు.ఆలయాలు సందర్శిస్తారు.కొత్త కాంట్రాక్టులు చేపడతారు.వ్యాపారాలలో  లాభాలు పొందుతారు..ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి.రాజకీయ, పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం.షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.అదృష్టరంగులు.... గోధుమ, ఆకుపచ్చ.

పరిహారాలు :  గణేశ్‌ను పూజించండి.

కుంభం : రాబడి కొంత తగ్గి అప్పులు చేయాల్సివస్తుంది.సోదరులు, సన్నిహితులతో విభేదాలు.ఆద్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి.చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి.భూముల కొనుగోలు యత్నాలు వాయిదా.ఇతరుల విషయాలలో జోక్యం వద్దు.రియల్‌ఎస్టేట్‌ల వారికి ఆస్తి తగాదాలు.ఉద్యోగులకు అనుకోని బదిలీలు..పారిశ్రామిక, రాజకీయవర్గాలకు శ్రమాధిక్యం.ఐటీ నిపుణులకు గందరగోళ పరిస్థితి..విద్యార్థులకు అవకాశాలు చేజారతాయి.మహిళలకు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు.షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.అదృష్టరంగులు....గోధుమ, పసుపు.

పరిహారాలు : హనుమాన్‌ఛాలీసా పఠించండి.

మీనం : కొత్త ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.నూతన కార్యక్రమాలు చేపడతారు.ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.రియల్‌ఎస్టేట్‌ల వారు మరింత ఉత్సాహంతో సాగుతారు.వ్యాపారాలు లాభిస్తాయి.ఉద్యోగాలలో ఉన్నతస్థాయికి చేరతారు.పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సన్మానాలు.ఐటీ నిపుణులు నైపుణ్యాన్ని చాటుకుంటారు.విద్యార్థులకు కొత్త అవకాశాలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్టరంగులు.... గోధుమ, బంగారు.

పరిహారాలు : హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

సంబంధిత వర్గం
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.