(Local) Mon, 16 Sep, 2019

సెప్టెంబర్ 11,2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..

September 11, 2019,   11:56 AM IST
Views: 18
Share on:
సెప్టెంబర్ 11,2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు. ...

మేషం : పరిస్థితులు అనుకూలిస్తాయి.పనులు సకాలంలో పూర్తి చే స్తారు.ఆర్థిక విషయాలు ఆశాజకనంగా ఉంటాయి.కోర్టు వ్యవహరాలలో విజయం.బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు.రియల్‌ ఎస్టేట్‌ల వారి కృషి ఫలించి ముందుకు సాగుతారు.వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.విద్యార్థులు అనుకోని అవకాశాలు తథ్యం.మహిళలకు సంతోషకరమైన వార్తలు.షేర్ల విక్రయాలలో లాభాలు అందుతాయి.అదృష్ట రంగులు.... తెలుపు, బంగారు.

పరిహారాలు : నరసింహస్వామిని పూజించండి.

వృషభం :కుటుంబంలో చికాకులు.ఆరోగ్యం మందగిస్తుంది.వ్యవహారాలలో ఒత్తిడులు.దూర ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరాశ కలిగిస్తాయి.ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు.కాంట్రాక్టులు చేజారతాయి.ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి.విద్యార్థులకు నిరుత్సాహం.మహిళలకు కుటుంబసమస్యలు.షేర్ల విక్రయాలు మందకొడిగానే ఉంటాయి.అదృష్ట రంగులు....లేత ఎరుపు, కాఫీ.

పరిహారాలు : గణపతిని ఆరాధించండి. 

మిథునం : దూర ప్రయాణాలు సంభవం.బంధువులతో విభేదాలు తప్పవు.కుటుంబ సమస్యలతో సతమతమవుతారు.శారీరక రుగ్మతలు.రియల్‌ఎస్టేట్‌ల వారికి సమస్యలు తప్పవు.వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి..ఉద్యోగులకు స్థాన మార్పులు.మహిళలకు నిరుత్సాహమే.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు....పసుపు, తెలుపు.

పరిహారాలు :  ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం : బంధువులతో సంతోషంగా గడుపుతారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలోపాల్గొంటారు.మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు.ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.ఉద్యోగయత్నాలలో విజయం.ఆదాయం పెరుగుతుంది.రియల్‌ ఎస్టేట్‌ల వారికి వివాదాలు.వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అందుతాయి.మహిళలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....నీలం, పసుపు.

పరిహారాలు :  వేంకటేశ్వరస్వామిని అర్చించండి.

సింహం : దూరపు బంధువుల నుంచి శుభవార్తలు.ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు.పనులు సకాలంలో పూర్తి చేస్తారు.దేవాలయాలు సందర్శిస్తారు.ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.రాబడి పెరిగి అవసరాలు తీరతాయి.పారిశ్రామికవర్గాలకు విదేశీ యానం.ఐటీ నిపుణులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి..విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు.మహిళలకు కుటుంబంలో గౌరవం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....పసుపు, గులాబీ.

పరిహారాలు : గణపతికి అభిషేకం చేయండి.

కన్య : రుణ యత్నాలు సాగిస్తారు.మిత్రులతో విరోధాలు.ఆలోచనలు స్థిరంగా ఉండవు.పనుల్లో ప్రతిబంధకాలు.వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించండి.కాంట్రాక్టులు, రియల్‌ఎస్టేట్‌ల వారికి సామాన్యంగా ఉంటుంది.వ్యాపార విస్తరణలో ఆటంకాలు.ఉద్యోగులకు అదనపు పనిభారం.మహిళలకు కొంత నిరాశ తప్పదు.షేర్ల విక్రయాలలో లాభాలు కనిపించవు.అదృష్ట రంగులు....ఎరుపు, గులాబీ.

పరిహారాలు : సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

తుల : దూర ప్రయాణాలు.పనులు మందగిస్తాయి.ఆలోచనలు స్థిరంగా ఉండవు.బంధుగణంతో తగాదాలు ఏర్పడతాయి.కుటుంబంలో పరిస్థితులు చికాకు పరుస్తాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారి యత్నాలు మందగిస్తాయి.ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు సంభవం.పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.ఐటీ నిపుణులకు కొన్ని ఇబ్బందులు.విద్యార్థులు ఒత్తిడులు ఎదుర్కొంటారు.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలు మందకొడిగా సాగుతాయి.అదృష్ట రంగులు.... కాఫీ, పసుపు.

పరిహారాలు : వేంకటేశ్వరస్వామిని పూజించాలి.

వృశ్చికం : పనులు సకాలంలో పూర్తి చేస్తారు.సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు.దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.ఆత్మీయుల నుంచి సహాయం అందుతుంది.వివాహ యత్నాలు అనుకూలిస్తాయి.నిరుద్యోగులకు ఉద్యోగలాభం.రియల్‌ ఎస్టేట్‌ల వారికి మరింత అభివృద్ధి.వ్యాపారాలలో లాభాలు తథ్యం.ఉద్యోగవర్గాలకు ఇంక్రిమెంట్లు తథ్యం.ఐటీ నిపుణులకు అవార్డులు.విద్యార్థులకు పరిశోధనల్లో గుర్తింపు.మహిళలకు నూతనోత్సాహం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....ఎరుపు, తెలుపు.

పరిహారాలు : హనుమాన్‌ చాలీసా పఠించండి.

ధనుస్సు : వ్యయప్రయాసలు తప్పవు.కుటుంబంలో చికాకులు ఎదురవుతాయి.ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు.ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటుంది.శారీరక రుగ్మతలు.కాంట్రాక్టర్లు కొంత నిరుత్సాహం చెందుతారు.వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.ఉద్యోగవర్గాలకు అంతగా అనుకూలంకాదు.పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహమే.మహిళలకు మానసిక ఆందోళన.షేర్ల విక్రయాలలో స్వల్ప లాభాలు.అదృష్ట రంగులు....నీలం, నలుపు.

పరిహారాలు : హనుమాన్‌కు అర్చనలు చేయండి.

మకరం : నూతన వ్యక్తుల పరిచయం.శుభకార్యాలలో పాల్గొంటారు.ఆప్తులతో మంచీచెడ్డా విచారిస్తారు.ఆస్తి వివాదాల నుంచి బయపడతారు.ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.రియల్‌ఎస్టేట్‌ల వారికి శుభదాయకంగా ఉంటుంది.ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు పెరుగుతాయి..వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి.పారిశ్రామిక, వైద్య రంగాల వారికి ఆహ్వానాలు.ఐటీ నిపుణులకు పురస్కారాలు.విద్యార్థులకు అనుకూల ఫలితాలు.మహిళలకు సంతోషకరమైన వార్తలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....కాఫీ, ఆకుపచ్చ.

పరిహారాలు : రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.

కుంభం : పనుల్లో అవాంతరాలు.మిత్రులతో అకారణంగా తగాదాలు.కష్టించినా ఫలితం అంతగా కనిపించదు.దూర ప్రయాణాలు చేస్తారు.అనారోగ్యం, ఔషధసేవనం.ఉద్యోగులకు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరిచేస్తాయి.పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహమే.ఐటీ నిపుణులకు ఆకస్మిక మార్పులు.విద్యార్థులకు కొన్ని అవకాశాలు ఊరిస్తాయి.మహిళలు కుటుంబ సమస్యలతో సతమతమవుతారు.షేర్ల విక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి.అదృష్ట రంగులు....ఎరుపు, ఆకుపచ్చ.

పరిహారాలు :  విష్ణుసహస్రనామ పారాయణ మంచిది.

మీనం : ముఖ్యమైన కార్యక్రమాలను పట్టుదలతో పూర్తి చేస్తారు.సంఘంలో గౌరవమర్యాదలు.చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.ఆలోచనలు కార్య రూపం దాలుస్తాయి.బంధువులు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి సమస్యల నుంచి విముక్తి.వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నూతనోత్సాహం.ఐటీ నిపుణులు కొత్త  అవకాశాలు అందిపుచ్చుకుంటారు.విద్యార్థులు ముందడుగు వేస్తారు.మహిళలకు ఆసక్తికరమైన సమాచారం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....ఆకుపచ్చ, గోధుమ.

పరిహారాలు : శివాలయంలో ప్రదక్షణలు చేయండి.

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
సెప్టెంబర్ 16,2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు. ...
సెప్టెంబర్ 16,2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు. ...
సెప్టెంబర్ 10,2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు ...
సెప్టెంబర్ 10,2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.