(Local) Sun, 31 May, 2020

సెప్టెంబర్ 13,2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

September 13, 2019,   11:58 AM IST
Share on:
సెప్టెంబర్ 13,2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాల ...

మేషం : మిత్రుల నుంచి  శుభవార్తలు అందుతాయి.దూరపు బంధువుల కలయిక.కొన్ని  బాకీలు సైతం వసూలవుతాయి.ఆలయాలు సందర్శిస్తారు.మీపట్ల గౌరవం మరింతగా పెరుగుతుంది.రియల్‌ ఎస్టేట్‌ల వారికి పురోభివృద్ధి.వ్యాపారాలు పురోగతిలో సాగుతాయి.ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి.రాజకీయవేత్తలకు అరుదైన అవకాశాలు.ఐటీ నిపుణులకు ఆహ్వానాలు రాగలవు.విద్యార్థులకు అనుకూల ఫలితాలు..అదృష్ట రంగులు....ఎరుపు, పసుపు.

పరిహారాలు :  గణపతిని పూజించండి.

వృషభం : కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.శుభకార్యాల్లో పాల్గొంటారు.బంధువుల నుంచి సహాయం అందుతుంది.భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.గృహ నిర్మాణ యత్నాలు కలసివస్తాయి.కాంట్రాక్టర్లు ఎట్టకేలకు టెండర్లు దక్కించుకుంటారు.వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి.ఐటీ నిపుణులకు కీలక సమాచారం అందుతుంది.విద్యార్థులు మరింత ఉత్సాహంగా సాగుతారు.మహిళలకు ఆస్తి లాభాలు ఉండవచ్చు.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు....తెలుపు, బంగారు.

పరిహారాలు :  విష్ణు సహస్రనామ పారాయణ  చేయండి. 

మిథునం :ఆకస్మిక ప్రయాణాలు చేస్తారుబంధుమిత్రులతో విభేదాలు.ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు.ఆలోచనలు స్థిరంగా ఉండవు.ముఖ్య వ్యవహారాల్లో ఆటంకాలు.రాబడి తగ్గి రుణాలు చేయాల్సివస్తుంది.ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.ఉద్యోగులకు మార్పులు జరిగే వీలుంది.పారిశ్రామికవేత్తలకు కొన్ని అంచనాలు తప్పుతాయి.ఐటీ నిపుణులకు కొంత నిరుత్సాహమే.విద్యార్థులు ఒత్తిడులు పెరుగుతాయి.మహిళలకు కుటుంబ సమస్యలు పెరుగుతాయి.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు....గులాబీ, తెలుపు

పరిహారాలు :  దుర్గాదేవిని పూజించండి.

కర్కాటకం : కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు.శ్రమ తప్ప ఫలితం ఉండదు.రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు.ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు.శారీరక రుగ్మతలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి సామాన్యంగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి.ఉద్యోగులకు విధుల్లో ప్రతిబ«ంధకాలు.విద్యార్థులకు శ్రమాధిక్యం.మహిళలు కుటుంబ సమస్యలు ఎదుర్కొంటారు.షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.అదృష్ట రంగులు....నీలం, నలుపు.

పరిహారాలు :  ఆదిత్య హృదయం పఠించండి.

సింహం : ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు.ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.కాంట్రాక్టర్లు మరింత అనుకూలత సాధిస్తారు.వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.ఉద్యోగులకు  మరింత అనుకూల సమయం.రాజకీయవేత్తల యత్నాలు సఫలం.మహిళలు విశేష గౌరవం పొందుతారు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి..అదృష్ట రంగులు....గులాబీ, పసుపు.

పరిహారాలు :  దుర్గా స్తోత్రాలు పఠించండి. 

కన్య : కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు.పాత మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.స్థలాలు, గృహం కొంటారు.ఆలయాలు సందర్శిస్తారు.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు  అందుతాయి.రాజకీయ, పారిశ్రామికవర్గాలకు సన్మానాలు.ఐటీ నిపుణులకు ఊహించని అవకాశాలు.విద్యార్థులు  అనుకూల ఫలితాలు.మహిళలకు కుటుంబ వివాదాలు తీరతాయి.షేర్ల విక్రయాలలో లాభాలు..అదృష్ట రంగులు....ఆకుపచ్చ, కాఫీ.

పరిహారాలు :  ఆంజనేయ దండకం పఠించండి.

తుల : శ్రమ మరింత పెరుగుతుంది.పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.శారీరక రుగ్మతలు చికాకు పరుస్తాయి.తీర్థ యాత్రలు చేస్తారు.బంధువుల నుంచి ఒత్తిడులు తప్పవు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొత్త సమస్యలు.వ్యాపారాలు ఆశనిరాశ మధ్య కొనసాగుతాయి.ఉద్యోగులకు అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి.విద్యార్థులకు ఫలితాలలో గందరగోళం నెలకొంటుంది.మహిళలు కుటుంబసమస్యలు ఎదుర్కొంటారు.షేర్ల విక్రయాలలో తొందరపాటువద్దు.అదృష్ట రంగులు.... తెలుపు, పసుపు.

పరిహారాలు :  హనుమాన్‌ చాలీసా పఠించండి.

వృశ్చికం : అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు.దూర ప్రయాణాలు ఉంటాయి.కష్టపడ్డా  ఫలితం సాధించలేరు.ఆస్తి వివాదాలు గందరగోళం పెడతాయి.చిన్ననాటిఇ మిత్రులతో తగాదాలు.రియల్‌ఎస్టేట్‌ల వారికి కొత్త వివాదాలు.వ్యాపారాలు నిరాశపరుస్తాయి.ఉద్యోగులకు అనుకోని బదిలీలు.రాజకీయ, పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనల్లో మార్పులు.ఐటీ నిపుణుల యత్నాలు ముందుకు సాగవు.విద్యార్థులకు ఒత్తిడులు.మహిళలకు నిరుత్సాహమే.అదృష్ట రంగులు....కాఫీ, బంగారు.

పరిహారాలు :  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు : రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది.కొన్ని వ్యవహారాలలో విజయం సాధిస్తారు.ఆలోచనలు అమలు చేస్తారు.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారుస్నేహితులతో వివాదాలు తీరతాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారికి నూతనోత్సాహం.పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం.ఐటీ నిపుణులకు అరుదైన అవకాశాలు.విద్యార్థులు పరిశోధనల్లో విజయం సాధిస్తారు.మహిళలకు నూతనోత్సాహం.షేర్ల విక్రయాలలో లాభాలు గడిస్తారు.అదృష్ట రంగులు....బంగారు, తెలుపు.

పరిహారాలు :  ఆదిత్య హృదయం పఠించండి.

మకరం : ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు.కుటుంబ సమస్యలు పెరుగుతాయి.ఆరోగ్యం మందగిస్తుంది.దూర ప్రయాణాలు ఉండవచ్చు.సన్నిహితులతో విభేదాలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి అంతగా అనుకూలం కాదు.వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు.విద్యార్థులకు అవకాశాలు చేజారవచ్చు.మహిళలకు కుటుంబసమస్యలు పెరుగుతాయి.షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.అదృష్ట రంగులు....ఎరుపు, గోధుమ.

పరిహారాలు :  ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం : చేపట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.సంఘంలో విశేష గౌరవమర్యాదలు పెరుగుతాయి.స్థలాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు.ప్రత్యర్థులు  అనుకూలంగా మారడం విశేషం.పరిస్థితులు అనుకూలంగా మారతాయి.ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఒత్తిడులు తొలగుతాయి.ఉద్యోగులకు పదోన్నతి సూచనలు.ఐటీ నిపుణులు మరింత ప్రగతి సాధిస్తారు.విద్యార్థులకు పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు.మహిళలకు కుటుంబసమస్యలు తీరతాయి.షేర్ల విక్రయాలలో అధిక లాభాలు.అదృష్ట రంగులు....గోధుమ, గులాబీ.

పరిహారాలు :  నవగ్రహ స్తోత్రం పఠించండి.

మీనం : ఆర్థిక వ్యవహారాలు నిరాశపరుస్తాయి.బంధువర్గం నుంచి విమర్శలు ఎదురవుతాయి.శ్రమ తప్ప ఫలితం కనిపించదు.ఆస్తి వివాదాలు తలనెప్పిగా మారతాయి.అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి నిరాశాజనకంగా ఉంటుంది.వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.రాజకీయ,పారిశ్రామికవర్గాలకు మరింత నిరుత్సాహం.ఐటీ నిపుణులకు ఆటుపోట్లు.విద్యార్థులు అనుకున్నది సాధించడంలో వెనుకబడతారు.మహిళలకు కుటుంబసభ్యుల సహాయం అందదు.షేర్ల విక్రయాలు మందకొడిగా ఉంటాయి.అదృష్ట రంగులు....ఎరుపు,కాఫీ.

పరిహారాలు :  గాయత్రీ ధ్యానం చేయండి.

సంబంధిత వర్గం
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.