(Local) Sun, 31 May, 2020

సెప్టెంబర్ 14,2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..

September 14, 2019,   11:30 AM IST
Share on:
సెప్టెంబర్ 14,2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు. ...

మేషం : పలుకుబడి పెరుగుతుంది.శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది.పనులు విజయవంతంగా సాగడంలో  కుటుంబసభ్యుల సహకారం.వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.వివాహయత్నాలు ముమ్మరం చేస్తారు.ఆలయాలు సందర్శిస్తారు.రావలసిన సొమ్ము అందుతుంది.కాంట్రాక్టర్లు తమ యత్నాలు ముమ్మరం చేస్తారు.వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు.ఉద్యోగాలలో లక్ష్యాలు సాధించి పురోగమిస్తారు.రాజకీయ, కళారంగాల వారికి ప్రోత్సాహకరమైన కాలం.ఐటీ నిపుణులకు ఒత్తిడుల నుంచి ఉపశమనం.విద్యార్థులు కొత్త విద్యావకాశాలు పొందుతారు.మహిళలకు సంతోషకరమైన సమాచారంఅదృష్ట రంగులు...నీలం, తెలుపు.

పరిహారాలు : సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని పూజించండి.

వృషభం : ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.చిరకాల కోరిక నెరవేరుతుంది.సోదరులతో విభేదాలు తొలగుతాయి.తీర్థయాత్రలు చేస్తారు.రియల్‌ఎస్టేట్‌ల వారికి మరింత అనుకూలం.వ్యాపారాలు మరింతగా ఉత్సాహంగా సాగుతాయి.విద్యార్థులకు పరిశోధనల్లో విజయాలు వరిస్తాయి.మహిళలకు నూతనోత్సాహం.అదృష్ట రంగులు...ఆకుపచ్చ, బంగారు.

పరిహారాలు :  వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.

మిథునం : కొన్ని కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి.దూరప్రయాణాలు.మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు అంగీకరించరు.శారీరక∙రుగ్మతలు.రాబడి కొంత తగ్గి రుణాల కోసం ప్రయత్నిస్తారు.రియల్‌ఎస్టేట్‌ల వారికి వివాదాలు నెలకొంటాయి.ఐటీ నిపుణులకు గందరగోళం.విద్యార్థులు అనుకున్న ఫలితాలు కష్టమే.మహిళలకు నిరుత్సాహం.అదృష్ట రంగులు...గులాబీ, గోధుమ.

పరిహారాలు : శివస్తోత్రాలు పఠించాలి.

కర్కాటకం : ప్రయాణాలలో ఆటంకాలు.ముఖ్య కార్యక్రమాలలో ఆటంకాలు.బంధువులతో తగాదాలు.ఎంతకష్టపడ్డా ఫలితం కనిపించదు.అనారోగ్య సూచనలు.రియల్‌ఎస్టేట్‌ల వారికి అంతగా కలిసిరానిరోజు.ఐటీ నిపుణులకు చిక్కులు.విద్యార్థులకు మానసిక అశాంతి.మహిళలకు కుటుంబంలో చికాకులు.అదృష్ట రంగులు...కాఫీ, తెలుపు.

పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.

సింహం : ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు.సమాజంలో విశేష గౌరవం.ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.పాతమిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు.పరపతి పెరుగుతుంది.అనుకున్నది సాధిస్తారు.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు కార్యజయం.ఐటీ నిపుణులకు శుభవర్తమానాలు.విద్యార్థులు కొత్త అవకాశాలతో ముందుకు సాగుతారు.మహిళలకు శుభవర్తమానాలు.అదృష్ట రంగులు...ఆకుపచ్చ, బంగారు.

పరిహారాలు : రాఘవేంద్రస్వామిని ఆరాధించండి.

కన్య : ఉద్యోగ, వివాహయత్నాలు ఫలిస్తాయి.పనుల్లో విజయం.వాహనాలు, స్థలాలు కొంటారు.కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు.శత్రువులు సైతం అనుకూలంగా మారతారు.ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలమవుతాయి.బంధువుల నుంచి ఆహ్వానాలు రాగలవు.వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.ఐటీ నిపుణులకు మరింత అనుకూలత.విద్యార్థులకు కొత్త అవకాశాలు.మహిళలకు పురస్కారాలు దక్కుతాయి.గోధుమ, తెలుపు.అదృష్ట రంగులు...

పరిహారాలు : సత్యనారాయణస్వామిని పూజించాలి.

తుల : కుటుంబంలో కలహాలు.ఆర్థిక ఇబ్బందులు, అప్పులు చేస్తారు.దూరప్రయాణాలు సంభవం.ఎంతకష్టపడ్డా ఆశించిన ఫలితం అందుకోలేరు.శారీరక రుగ్మతలు.కుటుంబసభ్యులతో విభేదిస్తారు.ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.రియల్‌ఎస్టేట్‌ల వారికి నిరాశ.వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు.ఉద్యోగులకు స్థానమార్పులు.విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి.మహిళలకు మానసిక అశాంతి.అదృష్ట రంగులు...గోధుమ, ఆకుపచ్చ.

పరిహారాలు : దత్తాత్రేయ స్తోత్రం పఠించాలి.

వృశ్చికం : వ్యవహారాలలో ఆటుపోట్లు.బంధువులతో తగాదాలు.ఆలోచనలు నిలకడగా ఉండవు.అనుకోని సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి.ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.దూరప్రయాణాలు ఉంటాయి.ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు.రాజకీయ, పారిశ్రామికవర్గాలకు చికాకులు పెరుగుతాయి.ఐటీ నిపుణుల ప్రయత్నాలు ఫలించవు.విద్యార్థులకు ఫలితాలు నిరాశ కలిగిస్తాయి.మహిళలకు కుటుంబసమస్యలు.అదృష్ట రంగులు...కాఫీ, పసుపు.

పరిహారాలు :  ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు : పరిస్థితులు అనుకూలిస్తాయి. శ్రమ ఫలించే సమయం.పాతమిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు.ఇళ్లు, స్థలాలు కొంటారు.పనులు చకచకా సాగుతాయి.తీర్థయాత్రలు చేస్తారు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.ఉద్యోగవర్గాలకు పదోన్నతులు.రాజకీయ, కళారంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది.ఐటీ నిపుణులకు వివాదాల పరిష్కారం.విద్యార్థులకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది.మహిళలకు ఆసక్తికరమైన సమాచారం అందుతుంది.అదృష్ట రంగులు...గోధుమ, గులాబీ.

పరిహారాలు :  గణేశాష్టకం పఠించండి.

మకరం : కొత్త రుణాలు చేస్తారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.బంధువులతో విభేదాలు ఏర్పడతాయి.ఆలోచనలు స్థిరంగా ఉండవు.అనారోగ్యం, ఔషధసేవనం.ఆలయాలు సందర్శిస్తారు.రియల్‌ఎస్టేట్‌ల వారికి ఇబ్బందికరమైన రోజు.వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు.విద్యార్థులు ఆశించిన ఫలితాలు కష్టమే.మహిళలకు ఆరోగ్యభంగం.అదృష్ట రంగులు...ఆకుపచ్చ, బంగారు.

పరిహారాలు : నవగ్రహ స్తోత్రాలు పఠించాలి. 

కుంభం : బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.వ్యవహారాలలో విజయం.నిరుద్యోగులకు అవకాశాలు దగ్గరకు వస్తాయి.ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.భార్యాభర్తల మధ్య సఖ్యత.రియల్‌ఎస్టేట్‌ల వారికి ఆస్తిలాభం.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు.ఐటీ నిపుణులకు అంచనాలు నిజం కాగలవు.విద్యార్థులకు నూతన విద్యావకాశాలు.మహిళలకు కుటుంబంలో గౌరవం.అదృష్ట రంగులు...పసుపు, గులాబీ.

పరిహారాలు :  దుర్గాదేవిని పూజించండి.

మీనం : ప్రయాణాలలో ఆటంకాలు.ఆర్థిక ఇబ్బందులు, రుణయత్నాలు.ప్రయత్నాలు మందగిస్తాయి.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.రియల్‌ఎస్టేట్‌ల వారి యత్నాలు ముందుకు సాగవు.వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి.ఉద్యోగులకు పనిభారం.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నిరాశానిస్పృహలు.ఐటీ నిపుణులకు సామాన్యంగా ఉంటుంది.విద్యార్థులు కొంత సంయమనం పాటించాలి.మహిళలకు కుటుంబసమస్యలు తప్పవు.అదృష్ట రంగులు...ఎరుపు, కాఫీ.

పరిహారాలు :  గణపతిని పూజించండి.

సంబంధిత వర్గం
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.