(Local) Wed, 16 Oct, 2019

సెప్టెంబర్ 16,2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..

September 16, 2019,   11:34 AM IST
Share on:
సెప్టెంబర్ 16,2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు. ...

మేషం : వ్యవహారాలు ముందుకు సాగవు.ఆదాయవ్యయాలు సమానంగా ఉంటాయి.ఆలోచనలు నిలకడగా ఉండవు..కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు.అనారోగ్య సూచనలు.ఆలయాలు సందర్శిస్తారు.ఉద్యోగులకు మార్పులు తథ్యం.పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.విద్యార్థులకు లేనిపోని ఒత్తిడులు.మహిళలకు ఆరోగ్యం మందగిస్తుంది.షేర్ల విక్రయాలు నిరాశ కలిగిస్తాయి.అదృష్ట రంగులు.... ఎరుపు, తెలుపు.

పరిహారాలు :  ఆదిత్య హృదయం పఠించండి.

వృషభం : పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.కొన్ని సంఘటనలు గుర్తుకు వస్తాయి.నిరుద్యోగులకు ఉద్యోగయోగం.సభలు, సమావేశాలలో పాల్గొంటారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి స్థిరాస్తి వృద్ధి.భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి.ఉద్యోగాల్లో పదోన్నతులు ఖాయం.మహిళలకు ఆస్తి లాభం.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు....పసుపు, ఆకుపచ్చ.

పరిహారాలు :  దుర్గాదేవిని పూజించండి.

మిథునం : బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో సాగుతాయి.భూవివాదాలు తీరతాయి.నూతన పరిచయాలు ఏర్పడతాయి.శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు.రియల్‌ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు శుభవార్తలు.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి.వ్యాపారాలలో లాభాలు అందుతాయి.విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు.మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.అదృష్ట రంగులు....తెలుపు, గోధుమ.

పరిహారాలు :  నృసింహ స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం : పనుల్లో  ఆటంకాలు.నిరుద్యోగులకు శ్రమ తప్పదు.ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి.ఆలయాలు సందర్శిస్తారు.మిత్రులతో విరోధాలు.కాంట్రాక్టర్లకు శ్రమ తప్ప ఫలితం ఉండదు.వ్యాపారాలు కొంతమేర మందగిస్తాయి.ఉద్యోగులకు బాధ్యతలు మరింత పెరుగుతాయి..విద్యార్థులకు ఒడిదుడుకులు.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలలో తొందవద్దు.అదృష్ట రంగులు....నీలం,తెలుపు.

పరిహారాలు :  గణపతిని పూజించండి.

సింహం : కుటుంబ సమస్యలు తీరతాయి.పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటుంది.మిత్రుల సహాయసహకారాలు అందుతాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారికి అనుకూలత.వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి.ఉద్యోగులకు ప్రమోషన్లు లభించే వీలుంది.పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వపరంగా సహాయం.ఐటీ నిపుణులకు ఊహించని అవకాశాలు.విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం.మహిళలకు శుభవర్తమానాలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి..అదృష్ట రంగులు.... ఆకుపచ్చ, గోధుమ.

పరిహారాలు : నరసింహస్వామిని పూజించండి.

కన్య : ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి.ప్రత్యర్థులను మిత్రులుగా మార్చుకుంటారు.సంఘంలో గౌరవం పెరుగుతుంది.వేడుకలు, ఉత్సావాల్లో పాల్గొంటారు.చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి కాగలవు.భూ వివాదాలు పరిష్కారం.రియల్‌ ఎస్టేట్‌ల వారికి అవకాశాలు పెరుగుతాయి.వ్యాపారులకు అనూహ్యంగా పెట్టుబడులు సమకూరతాయి.ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావచ్చు.పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు.ఐటీ నిపుణులకు మరింత ప్రగతి.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు.... పసుపు, కాఫీ.

పరిహారాలు : విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

తుల : కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి.శత్రువులు కూడా మిత్రులుగా మారవచ్చు.ముఖ్య నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది.స్థలాలు, వాహనాలు కొంటారు.రియల్‌ఎస్టేట్‌ల వారికి భూవివాదాల నుంచి విముక్తి.వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి.ఉద్యోగులకు ప్రశంసలు.విద్యార్థులకు నూతనోత్సాహం.మహిళలకు ఆస్తి లాభ సూచనలు.షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.అదృష్ట రంగులు.... పసుపు, కాఫీ.

పరిహారాలు :  సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం చేయించుకోండి.

వృశ్చికం : దూర ప్రయాణాలు చేస్తారు.బంధువులతో తగాదాలు.ఆదాయం అంతగా కనిపించదు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు.ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి.ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు.పారిశ్రామికవర్గాలకు నిరాశ కలిగిస్తాయి.ఐటీ నిపుణుల యత్నాలు ఫలించవు.విద్యార్థులకు గందరగోళం తప్పదు.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలు నత్తనడకన సాగుతాయి.అదృష్ట రంగులు.... గులాబీ, లేత ఆకుపచ్చ.

పరిహారాలు : గాయత్రీ ధ్యానం మంచిది.

ధనుస్సు : ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు.బంధువర్గంతో విరోధాలు.శ్రమకు తగ్గ ఫలితం కష్టమే.సన్నిహితుల లేనిపోని సమస్యలు ఎదురవుతాయి.పనులలో ఆటంకాలు తప్పవు.రియల్‌ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు చిక్కులు.భాగస్వామ్య వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.ఉద్యోగాలలో అదనపు పనిభారం.పారిశ్రామికవేత్తలకు వివాదాలు తప్పవు.ఐటీ నిపుణులకు కొత్త సమస్యలు.విద్యార్థులు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది.మహిళలకు కుటుంబసభ్యులతో మాటపట్టింపులు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి..అదృష్ట రంగులు.... గులాబీ, లేత ఎరుపు.

పరిహారాలు : వేంకటేశ్వరస్వామిని పూజించండి.

మకరం : వివాహా, ఉద్యోగ యత్నాలు సానుకూలం.వాక్పటిమతో అందర్నీ ఆకట్టుకుంటారు.సంఘంలో గౌరవం పొందుతారు.కుటుంబ విషయాలలో  చిక్కులు తొలగుతాయి.దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు.ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.కాంట్రాక్టర్లు ఆశించిన టెండర్లు దక్కించుకుంటారు.వ్యాపారాలలో కోరుకున్న లాభాలు అందుతాయి.ఉద్యోగాల్లో మంచి  గుర్తింపు లభిస్తుంది.విద్యార్థులు లక్ష్యసాధనలో ముందడుగు వేస్తారు.మహిళలకు కుటుంబంలో విశేష గౌరవం.షేర్ల విక్రయాలలో అధికలాభాలు.అదృష్ట రంగులు....నీలం, ఆకుపచ్చ.

పరిహారాలు : హనుమాన్‌ చాలీసా పఠించండి.

కుంభం : పనులలో ఆటంకాలు చికాకులు తప్పవు.వ్యయప్రయాసలు.ఇంటాబయటా కొత్త సమస్యలు.సొమ్ము అందక ఇబ్బంది పడతారు.ఆకస్మిక ప్రయాణాలు.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి శ్రమాధిక్యం.వ్యాపారాలలో లాభాలు స్వల్పమే.ఉద్యోగులకు అదనపు పనిభారం ఉండవచ్చు.పారిశ్రామికవర్గాలకు గందరగోళ పరిస్థితి.మహిళలకు కుటుంబంలో వివాదాలు.షేర్ల విక్రయాలు మందకొడిగా ఉంటాయి..అదృష్ట రంగులు.... బంగారు, కాఫీ.

పరిహారాలు :  హనుమాన్‌ చాలీసా పఠించండి

సంబంధిత వర్గం
అక్టోబర్ 15-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
అక్టోబర్ 15-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.