(Local) Sun, 31 May, 2020

సెప్టెంబర్ 17,2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..

September 17, 2019,   11:34 AM IST
Share on:
సెప్టెంబర్ 17,2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు ...

మేషం : రెట్టించిన ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు.సంఘంలో విశేష గౌరవం.విలువైన వస్తువులు, వాహనాలు కొంటారు.ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగయోగం.రియల్‌ఎస్టేట్‌ల వారి కృషి ఫలిస్తుంది.వ్యాపారాలలో నూతన పెట్టుబడులు .ఉద్యోగులకు కొత్త హోదాలు.పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు.ఐటీ నిపుణులకు మరింత అనుకూలం.విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి.మహిళలకు ఆస్తిలాభం.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు.... పసుపు, ఎరుపు.

పరిహారాలు :  నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

వృషభం : సన్నిహితులతో వివాదాలు.ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ.దూరప్రయాణాలు ఉంటాయి.కష్టించినా ఫలితం అంతగా ఉండదు.వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.రియల్‌ఎస్టేట్‌ల వారికి గందరగోళంగా ఉంటుంది.వ్యాపారాలలో పెట్టుబడులు అందక ఇబ్బంది.ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.రాజకీయవేత్తల యత్నాలు ముందుకు సాగవు..ఐటీ నిపుణులకు ఒడిదుడుకులు.విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి.మహిళలు కొన్ని  వివాదాలు ఎదుర్కొంటారు.షేర్ల విక్రయాలు మందకొడిగా సాగుతాయి.అదృష్ట రంగులు....గులాబీ, తెలుపు..

పరిహారాలు :  సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మిథునం : దూరపు బంధువుల కలయిక.ఇంటిలో శుభకార్యాల నిర్వహణ.అప్రయత్న కార్యసిద్ధి.విలువైన వాహనాలు కొంటారు.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.మిత్రులతో వివాదాలు పరిష్కారం.కాంట్రాక్టర్లు, రియల్టర్ల యత్నాలు సఫలం.కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు.ఉద్యోగస్తులకు ఆశించిన ప్రగతి కనిపిస్తుంది..మహిళలకు శుభవార్తలు.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు.... ఆకుపచ్చ, గోధుమ.

పరిహారాలు :  ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం : ఇంటాబయటా ఉత్సాహంగా గడుపుతారు.ఆర్థిక పరిíస్థితి మెరుగ్గా ఉంటుంది.ముఖ్య వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు.అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది.ఆశ్చర్యకరంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు.రియల్‌ఎస్టేట్‌ల వారికి భూవివాదాల పరిష్కారం.వ్యాపారాలు పుంజుకుంటాయి.ఉద్యోగాలలో అనుకోని హోదాలు.మహిళలకు కుటుంబంలో గౌరవం.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు....తెలుపు, కాఫీ.

పరిహారాలు :  సూర్య భగవానునికి పొంగలి నివేదించండి.

సింహం : ఆర్థిక ఇబ్బందులు, రుణఒత్తిడులు. దూరప్రయాణాలు ఉండవచ్చు.పనులు వాయిదా వేస్తారు.మిత్రులు, బంధువులతో విభేదాలు.కాంట్రాక్టర్లకు ఇబ్బందులు ఎదురుకావచ్చు.వ్యాపారాలు నత్తనడకన సాగతాయి.ఉద్యోగాల్లో ఒడిదుడుకులు.మహిళలకు చికాకులు ఎదురవుతాయి.షేర్ల విక్రయాలలో ఆటుపోట్లు.అదృష్ట రంగులు....ఎరుపు, ఆకుపచ్చ.

పరిహారాలు :   ఆదిత్య హృదయం పఠించండి.

కన్య : ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి.పరిస్థితులు అంతగా అనుకూలించవు.పనుల్లో ప్రతిబంధకాలు.ఆలోచనలు స్థిరంగా ఉండవు.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు.కాంట్రాక్టులు చేజారతాయి.బంధువులతో తగాదాలు..ఆకస్మిక ప్రయాణాలు సంభవం.కాంట్రాక్టర్ల యత్నాలు విఫలం.వ్యాపారులకు అంతగా లాభించదు.ఉద్యోగాల్లో ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి.విద్యార్థులకు పోటీపరీక్షల్లో నిరాశ.మహిళలకు అనారోగ్య సూచనలు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు.... పసుపు, గులాబీ.

పరిహారాలు :  వేంకటేశ్వరస్వామిని పూజించండి.

తుల : పనులలో విజయం.శుభకార్యాల్లో పాల్గొంటారు.కొన్ని బాకీలు వసూలవుతాయి.సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆలయాలు సందర్శిస్తారు.ఒక సంఘటన ఆకట్టుకుంటుంది.రియల్‌ ఎస్టేట్‌ల వారికి మరింత ఉత్సాహం.వ్యాపారాలు సజావుగా సాగుతాయి.ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు.మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....గోధుమ, కాఫీ.

పరిహారాలు :  అంగారక స్తోత్రం పఠించండి.

వృశ్చికం : మిత్రులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు.వ్యవహారాల్లో విజయం.శుభకార్యాలలో పాల్గొంటారు.పెండింగ్‌ బాకీలు వసూలవుతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ లాభం.ఆస్తి వివాదాలు తీరి ఒడ్డున పడతారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి.వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.ఉద్యోగులకు విధుల్లో ప్రశంసలు.పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఆహ్వానాలు.షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.అదృష్ట రంగులు.... ఆకుపచ్చ, ఎరుపు.

పరిహారాలు :  సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

ధనుస్సు : మిత్రులతో  కలహాలు.దూర ప్రయాణాలు చేస్తారు.ఇంటాబయటా ఒత్తిడులు, సమస్యలు పెరుగుతాయి.నిరుద్యోగుల అంచనాలు తప్పుతాయి.వ్యవహారాలలో ఆటంకాలు.ఆదాయం నిరాశ కలిగిస్తుంది.కాంట్రాక్టర్లు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.ఐటీ నిపుణులకు సమస్యలు పెరుగుతాయి.విద్యార్థుల కృషి  ఫలించకపోవచ్చు.మహిళలకు కుటుంబసభ్యుల నుంచి ఇబ్బందులు.షేర్ల విక్రయాలు సామాన్యం.అదృష్ట రంగులు....గులాబీ, లేత ఎరుపు.

పరిహారాలు :  గణపతిని పూజించండి.

మకరం : బంధువుల నుంచి సమస్యలు ఎదురవుతాయి.రాబడికి మించి ఖర్చులు పెరుగుతాయి.పనుల్లో అవరోధాలు.ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి అంచనాలు తప్పుతాయి.వ్యాపారాలు అంతగా అనుకూలించవు.విద్యార్థులకు ఫలితాలు నిరాశ పరుస్తాయి.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.అదృష్ట రంగులు....తెలుపు, నీలం.

పరిహారాలు : ఆంజనేయదండకం పఠించండి.

కుంభం : కొత్త పనులు చేపడతారు.ఆలోచనలు కలసి వస్తాయి.ఇంటిలో శుభకార్యాల నిర్వహణ.ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.ప్రత్యర్థుల నుంచి సహాయసహకారాలు అందుతాయి.రియల్‌ఎస్టేట్‌ల వారికి మరింత అనుకూల స్థితి.ఐటీ నిపుణులకు ఆశ్చర్యకరమైన సమాచారం రావచ్చు.విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.మహిళలకు శుభవార్తలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు.... నలుపు, ఆకుపచ్చ.

పరిహారాలు :  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మీనం : కుటుంబ సభ్యులతో వివాదాలు.ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు వాయిదా.శ్రమానంతరం పనులు పూర్తి.మిత్రులే శత్రువుల్లా మారతారు.ఆకస్మిక ప్రయాణాలు.రాబడి తగ్గి నిరాశ చెందుతారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఒడిదుడుకులు.వ్యాపారాలలో ఒడిదుడుకులు.విద్యార్థులకు కొంత ఇబ్బందికర పరిస్థితి.మహిళలకు మానసిక ఆందోళన.షేర్ల విక్రయాలు నత్తనడకన సాగుతాయి.అదృష్ట రంగులు....గోధుమ, కాఫీ.

పరిహారాలు :  హనుమాన్‌ చాలీసా పఠించండి.

సంబంధిత వర్గం
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.