(Local) Mon, 27 Jan, 2020

వైరల్ అవుతున్న బాలయ్య పార్టీ డ్యాన్స్...

November 28, 2019,   2:54 PM IST
Share on:
వైరల్ అవుతున్న బాలయ్య పార్టీ డ్యాన్స్...

కొంతమందిలో వయసు పెరుగుతున్న కొద్దీ చిన్నతనం వస్తుంటుంది వింటూనే ఉంటాం....అయితే ఇలాంటి లక్షణాలు చూడాలి అనుకుంటే టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ని ఉదాహరణగా చూపించవచ్చు. బాలయ్య ఎల్లప్పుడూ సీరియస్ మోడ్ లో ఉంటారు అనుకోవటం పొరపాటే...బాలకృష్ణ ఏదైనా ఫంక్షన్స్, ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు తనదైన స్టయిల్లో కామెడీ చేస్తూ సరదాగా మాట్లాడి అభిమానులను అలరించడమే కాకుండా స్టెప్స్ కూడా వేస్తుంటారు. తాజాగా బాలకృష్ణ ఓ పార్టీలో చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య ప్రధానపాత్రలో నటిసున్న రూలర్ సినిమా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఆ సినిమాలోని బాలయ్య గెటప్ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో బాలకృష్ణ బరువు తగ్గి ఫ్రెంచ్ గడ్డంతో యువకుడిలా కనిపించరు. తాజాగా బాలకృష్ణ రూలర్ సినిమా కోసం చేస్తున్న స్టెప్స్ కొన్ని పార్టీలో వేశారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య డాన్స్‌కి అభిమానులు ఫిదా అవుతున్నారు.

సంబంధిత వర్గం
డిసెంబ‌ర్ 20న వస్తున్న `రూల‌ర్‌`...
డిసెంబ‌ర్ 20న వస్తున్న `రూల‌ర్‌`...
నిఖిల్‌ కోసం వస్తున్న మెగాస్టార్...
నిఖిల్‌ కోసం వస్తున్న మెగాస్టార్...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.