(Local) Sat, 24 Aug, 2019

వైసీపీ లోకి మరో ఫైర్ బ్రాండ్ నటి!

July 17, 2019,   8:25 PM IST
Share on:

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈ మధ్య రోజుకొక విషయం తెరమీదకి వస్తోంది. అంతేకాక ఈ మధ్య సినిమా వాళ్ళు కూడా వైసీపీ పార్టీలో చేరుతున్న విషయాలు తెలిసినవే.  తాజగా మరో తెలుగు సినీ నటి హేమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు. తాను త్వరలో రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇక త్వరలో తాను సినిమాల‌కి గుడ్ బై చెప్పి పూర్తి రాజ‌కీయాల‌లోనే ఉండాల‌ని భావిస్తున్న‌ట్టు మీడియాతో తెలిపింది న‌టి హేమ‌. రాజ‌మండ్రిలో ఇల్లు క‌ట్టించుకున్న‌ట్టు తెలిపిన ఆమె అది పూర్తి కాగానే, హైదరాబాదు సినీ పరిశ్రమను వీడి ఒక అడుగు ముందుకేసి బాహ్య ప్రపంచంలోకి వస్తున్నట్లు హేమ ప్రకటించింది. కాపుల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ లో రెండు వేల కోట్లు కేటాయించడం అభినందనీయమని ఆమె అన్నారు.  బిగ్ బాస్ వివాదంపై కూడా మాట్లాడిన హేమ‌.. మంచి కుటుంబం నుండి వ‌చ్చిన నాగ్‌.. వివాదం ఉంటే ఆయ‌న బిగ్ బాస్‌లోకి రారు. ఒక‌వేళ బిగ్ బాస్‌లో ఏదైన త‌ప్పు జ‌ర‌గుతుంద‌ని తెలిస్తే నేనే నిల‌దీస్తాను అని చెప్పింది. 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.