(Local) Mon, 06 Apr, 2020

తమిళ్ డైరెక్టర్, గ్రీకువీరుడు మూవీ...?

October 14, 2019,   1:59 PM IST
Share on:
తమిళ్ డైరెక్టర్, గ్రీకువీరుడు మూవీ...?

సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండరు. అవ్వటానికి ఆయన తమిళ దర్శకుడైనప్పటికీ తెలుగులో కూడా శంకర్ కి ఎనలేని ప్రేక్షకాదరణ ఉంది. అందుకుగల కారణం ఎస్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన అన్ని తమిళ చిత్రాలూ తెలుగులోకి అనువదించిబడి అవి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్స్ ని సొంతం చేసుకోవటమే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలు సోషల్ మేసేజ్ కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ తో యాడ్ చేస్తూ టెక్నీకల్ పరంగాను హాలీవుడ్ స్థాయిలో ఆలోచిస్తూ సినిమాని తెరకెక్కిస్తాడు. శంకర్ ప్రస్తుతం చేస్తున్న 'భారతీయుడు 2' మూవీ త‌ర్వాత బాలీవుడ్ యాక్ష‌న్ హీరో హృతిక్ రోష‌న్‌తో మూవీ చేయబోతున్నాడట. రోబో 2.ఓ సినిమాలో అక్షయ్ కుమార్ చేసిన పాత్ర కోసం ముందుగా శంకర్, హృతిక్ ను సంప్రదించాడు కానీ అప్పుడు వేరే కమిట్మెంట్స్ ఉండడంతో రోబో 2. ఓ సినిమా చేయలేక పోతున్నానని చెప్పిన హృతిక్ రోషన్ మరో ప్రాజెక్టు చేద్దామని అన్నాడట. ఇప్పుడు అదే కమిట్మెంట్ తో శంకర్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి టాక్స్, స్టోరీ డిస్కషన్స్ న‌డుస్తున్న‌ట్టు సమాచారం. సూప‌ర్ హీరో స‌బ్జెక్ట్‌ని బేస్ చేసుకోని, హృతిక్ రోష‌న్‌ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు సైంటిఫిక్ థ్రిల్లర్ నేపథ్యంలో శంకర్ లైన్ వినిపించాడట. ఆ కథకి కనెక్ట్ అయిన హృతిక్ , శంకర్ డైరెక్షన్‌లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని బి-టౌన్ వర్గాల సమాచారం. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తుంది. ఈ సినిమాను నిర్మించడానికి నిర్మాతలు చాలామంది ఆసక్తిని చూపుతున్నరట. ఇండియ‌న్ 2 మూవీ త‌ర్వాత ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని తెలుస్తోంది. 

సంబంధిత వర్గం
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.