(Local) Sun, 17 Jan, 2021

'మైదాన్’ ఫస్ట్ లుక్ రిలీజ్....

August 19, 2019,   5:19 PM IST
Share on:
'మైదాన్’ ఫస్ట్ లుక్ రిలీజ్....

భారతీయ ఫుట్‌బాల్ స్వర్ణ యుగం పిలవబడే  1950 నుండి 1963 వరకు జాతీయ ఫుట్‌బాల్ జట్టు మేనేజర్ మరియు కోచ్‌గా పనిచేసారు సయ్యద్ అబ్దుల్ రహీమ్. భారత ఫుట్‌బాల్ లెజెండ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ నాయకత్వంలో మొట్టమొదటిసారి భారత ఫుట్‌బాల్ జట్టు  ఆసియా ఆటలను గెలిచింది. తాజాగా ఈ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథను జీ స్టూడియోస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరుణవ జాయ్ సేన్‌గుప్తా కలిసి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ‘బదాయ్ హో’ ఫేం అమిత్ రవింద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోగా అజయ్ దేవగన్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఈ సినిమాకు ‘మైదాన్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ‘భారతీయ ఫుట్‌బాల్ స్వర్ణ యుగం 1952-1962’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ సరసన కీర్తి సురేష్ ని కథానాయికగా ఎంపిక చేసారు చిత్ర బృందం. ఫుట్ బాల్ గేమ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాతో కీర్తి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇండియన్ లెజండరి ఫుట్ బాల్ కోచ్ సైయద్ అబ్దుల్ రహీమ్ పాత్రను అజయ్ దేవగన్ పోషిస్తున్నాడు. ఇక, ఈ మూవీకి సైవిన్ క్వాడ్రోస్, రితేష్ షాలు స్క్రీన్ ప్లే మరియు డైలాగ్‌లు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్టర్ లో ఈ మూవీ టైటిల్ లుక్ పోస్ట్ చేశారు. ‘అజయ్ దేవగన్ నెక్ట్స్ మూవీ మైదాన్ ఈ రోజు ప్రారంభమైంది. ఈ సినిమా ఫుట్ బాల్ గేమ్ ఆధారంగా రూపొందుతుందని’ అని ట్వీట్ చేశారు. 

సంబంధిత వర్గం
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.