(Local) Mon, 17 Jun, 2019

బిగ్ బి ట్విట్టర్ ఎకౌంట్ హాక్

June 11, 2019,   11:20 AM IST
Share on:

బాలీవుడ్ దిగ్జజం అమితాబ్ బచ్చన్ ట్విట్లర్లో దాదాపు 37.4 మిలీనియం మంది ఫాలోవర్లున్నారు. కాగా అమితాబ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అభిమానులు కూడా బిగ్ బీ పోస్టులను ఫాలో అవుతుంటారు. ఊహించని విధంగా అమితాబ్ బచ్చన్ ప్రొఫైల్ ఇమేజ్ గా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోటో ఉండటంతో అంతా షాక్ కి గురయ్యారు. పైగా లవ్ పాకిస్థాన్ అంటూ బయో లో క్యాప్షన్ ఇవ్వడంతో ఈ న్యూస్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ట‌ర్కీకి చెందిన హ్యాకర్‌ గ్రూప్ ఒక‌టి అమితాబ్ బ‌చ్చ‌న్ ట్విట్ట‌ర్ అకౌంట్‌ను హ్యాక్ చేసింది. ఈ గ్రూప్ స‌భ్యుడిగా ఉన్న అయిల్డిజ్ టిమ్ అనే యువ‌కుడు హ్యాక్ చేసిన‌ట్లు గుర్తించారు. ఆయన ఖాతాలో పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ఫొటోను పెట్టాడు. అమితాబ్ వ్యక్తిగత వివరాలను కూడా మార్చేశాడు. దాని స్థానంలో 'లవ్‌ పాకిస్థాన్‌' అని రాశాడు. టర్కీష్‌ జెండా ఎమోజీని ఉంచాడు. ఈ విష‌యం త‌న దృష్టికి రాగానే.. అమితాబ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్ర సైబ‌ర్ క్రైమ్ కింద కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.