(Local) Tue, 21 May, 2019

ప‌టాస్ షోకి బ్రేక్ తీసుకున్న బుల్లితెర రాములమ్మ

May 15, 2019,   12:50 PM IST
Share on:

బుల్లితెరపై పటాస్ కార్య‌క్ర‌మంతో ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయిన శ్రీముఖి రాముల‌మ్మ‌గా ఫుల్ ఫేమస్ అయింది. ప‌టాస్ షోలో శ్రీముఖి త‌న మాట‌ల‌తోనే కాదు గ్లామ‌ర్‌తోను పంచ్ డైలాగ్స్ తోనూ అందరిని అల‌రించింది. స్టూడెంట్స్‌తో ఈ అమ్మ‌డు చేసే ఫ‌న్ ఆడియ‌న్స్‌కి పిచ్చ కిక్ ఇచ్చేదనే చెప్పవచ్చు. ప‌టాస్ ఫుల్ హిట్ కావ‌డంతో ఈ మ‌ధ్య శ్రీముఖి, ర‌వి హోస్ట్‌గా ప‌టాస్ 2 ను ప్రారంభించారు.అయితే శ్రీముఖి తన ట్వీట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేస్తూ… నిర్వాహకుల అనుమతితోనే పటాస్ కి తాను బ్రేక్ ఇస్తున్నట్టు తెలిపింది. త‌న‌ని ఇంత‌గా ఆద‌రించిన బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి కూడా ఈ విష‌యం తెలియాల‌నే ఈ వీడియోను పోస్ట్ చేస్తున్న‌ట్టు చెప్పింది. ప‌టాస్ షో త‌న హృద‌యానికి చాలా ద‌గ్గ‌రైంద‌ని చెప్పిన రాములమ్మ.. మ‌ల్లెమాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. మ‌రి శ్రీముఖి బ్రేక్ తీసుకోవ‌డంతో ప‌టాస్ స్టేజ్‌పై ర‌వికి జోడీగా ఎవరు యాంకర్ గా అల‌రిస్తుందో చూడాలి మరీ. 

 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.