(Local) Tue, 07 Jul, 2020

విశాల్ కి అనీషా విషెస్....లవ్ ఆల్వేస్

August 30, 2019,   1:51 PM IST
Share on:
విశాల్ కి అనీషా విషెస్....లవ్ ఆల్వేస్

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బిజినెస్ మెన్ కూతురు అనీశా రెడ్డితో నిశ్చితార్ధం జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. మార్చి 10న వీరి ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌గా, అక్టోబ‌ర్‌లో పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చేసిన‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. ఇటీవ‌ల‌ వీరి పెళ్లి ఆగిపోయిందంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. అనీషా త‌మ నిశ్చితార్థంకి సంబంధించిన ఫోటోల‌తో పాటు విశాల్‌తో దిగిన ఫోటోల‌ని ప‌ర్స‌న‌ల్ ఎకౌంట్ నుండి డిలీట్ చేయ‌డం వ‌ల‌న పుకార్ల‌కి బీజం పోసిన‌ట్టు అయింది. అయితే అనీశా తాజాగా త‌న‌కి కాబోయే భ‌ర్త విశాల్‌కి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ... ''హ్యాపీ బర్త్ డే స్టార్.. నిన్ను ఎప్పటికీ ఆరాదిస్తూనే ఉంటాను.. నీ దిశగా గొప్పదనం రాబోతుంది.. నాకు నమ్మకం ఉంది.. లవ్ ఆల్వేస్'' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ చూసిన వారికి కన్ఫ్యూజన్ నెలకొంది. నిజంగానే అనీషా, విశాల్ లకు గొడవ జరిగితే ఆమె ఇంత గొప్పగా విషెస్ ఎలా చెబుతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి..

సంబంధిత వర్గం
పౌరుల ప్రైవ‌సీకి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది - రవిశ ...
పౌరుల ప్రైవ‌సీకి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది - రవిశ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.