(Local) Thu, 02 Jul, 2020

నా వయస్సు మాత్రం తగ్గుతోంది - బాలయ్య

June 10, 2019,   6:31 PM IST
Share on:
నా వయస్సు మాత్రం తగ్గుతోంది - బాలయ్య

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని పునికిపుచ్చుకుని తెలుగు నాట తిరుగులేని హీరోగా ఎదిగిన నటసింహ నందమూరి బాలకృష్ణ తన 59వ పుట్టినరోజు వేడుకలు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జరుపుకున్నారు.  చిన్న పిల్లల మధ్య బాలయ్య కేక్ కట్ చేసి తన పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా  మాట్లాడుతూ తన వయసు గురించి సరదాగా స్పందించారు. నా పుట్టిన రోజున అందరి నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి. అందరికి వయసు పెరుగుతోంది.. నాకు మాత్రం తగ్గుతోంది అని బాలయ్య చమత్కరించారు. తనకు వయసు తగ్గుతున్నందుకు కూడా విష్ చేయాలని కోరాడు. అంతేకాదు ఎవరైతే తాము పుట్టిన కుటుంబానికి, ఊరుకు, దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారో.. వారు మన మధ్య లేకపోయినా.. అందరి మనసుల్లో ఉండిపోతారన్నారు. అంతేకాదు నేను నటుడిగా, రాజకీయ నాయకుడిగా మా నాన్న ఎన్టీఆర్‌ను చూసి ఎంతో స్పూర్తి పొందానన్నారు. ఒక రకంగా క్యాన్సర్ హాస్పటల‌్‌తో ఎంతో మందికి సేవ చేసే భాగ్యం తనకు కలిగిందన్నారు. మరోవైపు క్యాన్సర్ రావడానికి మన ఆహారపు అలవాట్లు కూడా కారణమన్నారు. తనకు నిజమైన పుట్టినరోజు..క్యాన్సర్ హాస్పటల్ స్థాపించిన రోజు అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.