(Local) Mon, 09 Dec, 2019

ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం...

November 29, 2019,   5:38 PM IST
Share on:
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...

నిర్మాత తనయుడిగా పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా రాక్షసుడు చిత్రంతో విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా, న‌భా న‌టేష్ హీరోయిన్ గా ఓ చిత్రం తెరకెక్కుబోతోంది. కందిరీగ, రభస, హైపర్ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 1గా సుబ్ర‌హ్మ‌ణ్యం నిర్మిస్తున్న చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ క్లాప్ కొట్ట‌గా నిర్మాత జెమిని కిర‌ణ్ కెమెరా స్విచాన్ చేశారు. ప్ర‌ముఖ నిర్మాత‌ దిల్ రాజు గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అనంత‌రం ఏర్పాటుచేసిన విలేఖ‌రుల సమావేశంలో…ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ `ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సినిమా రూపొంద‌బోతోంది. డిసెంబ‌ర్ 6 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించి హైదరాబాద్, దుబాయ్, అబ్రాడ్ లో చిత్రీక‌రణ జ‌ర‌ప‌బోతున్నాం. వ‌చ్చే ఏడాది వేస‌విలో విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నాం. యాక్టింగ్ కు మంచి స్కోప్ ఉన్న పాత్రలో సాయిశ్రీనివాస్ క‌నిపిస్తాడు. త‌న కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని తెలిపారు. ఈ సినిమా కోసం వినూత్నమైన స్క్రిప్ట్ సిద్ధమైంది. హీరో శ్రీనివాస్ 8ప్యాక్‌తో కనిపించబోతున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. 
 

సంబంధిత వర్గం
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
బెల్లంకొండ 8 ప్యాక్ లుక్‌ లో....సంతోష్ శ్రీనివాస్‌ ...
బెల్లంకొండ 8 ప్యాక్ లుక్‌ లో....సంతోష్ శ్రీనివాస్‌ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.