(Local) Thu, 18 Jul, 2019

“బిగ్ బాస్-3″ టెలికాస్ట్ డేట్ రివిల్ అయింది

July 11, 2019,   5:23 PM IST
Share on:

బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో సీజ‌న్ 3 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న ఈ కార్య‌క్ర‌మఅభిమానులకు “బిగ్ బాస్” యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా స్టార్ మా ఓ ప్రోమో ద్వారా బిగ్ బాస్ 3 కార్య‌క్ర‌మం సీజ‌న్ 3 జూలై 21 నుండి టెలికాస్ట్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. 24 గంట‌లు, 64 కెమెరాల మ‌ధ్య 16 మంది కంటెస్టెంట్స్ చేసే హంగామాతో ఇక బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ఫుల్ ఫ‌న్ దొరుకుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. బిగ్ బాస్ హౌస్‌లో యాక్టింగ్ కాదు.. ఓన్లీ రియాలిటీనే ఉంటుంద‌ని నాగ్ ప్రోమోలో తెలిపాడు. బిగ్ బాస్ సీజ‌న్ 2లో నాని .. హౌజ్‌మేట్స్ చేసే హంగామాని నా..నీ టీవీలో చూపించ‌గా ఈ సారి నాగ్ పండూ అనే డాల్‌తో అన్ని విష‌యాలు షేర్ చేసుకుంటాడ‌ని ప్రోమో ద్వారా తెలుస్తుంది. కంటెస్టెంట్‌లు ఎర‌నేది అధికారిక ప్ర‌క‌ట‌న రాక‌పోయిన వారికి సంబంధించిన లిస్ట్ మాత్రం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.