(Local) Thu, 28 May, 2020

ఎయిర్ పోర్ట్ లో కేక్ కట్ చేసిన స్వీటీ...

November 07, 2019,   6:16 PM IST
Share on:
ఎయిర్ పోర్ట్ లో కేక్ కట్ చేసిన స్వీటీ...

స్వీటీ ఈ పేరు కేవలం పెట్టుకోవడమే కాదు అంతే స్వీట్ గా ఉండే మనసత్త్వం ఉండాలి...అలాంటి మనసత్త్వం ఉన్న ఏకైక భామ అనుష్క. కేవలం గ్లామర్ ప్రాధాన్యత గల పాత్రలోనే నటించడమే కాకుండా మరోవైపు లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ముద్దుగుమ్మ అనుష్క నేడు నవంబర్ 7న 1981లో జన్మించింది. అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి...

టాలీవుడ్ లో అగ్ర కథానాయకలో ఒకరిగా వెలుగొందుతున్న భాగమతి పుట్టిన రోజును ఆమె అభిమానులు సెలెబ్రేట్ చేసుకుంటూ ఆ విషయాలని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. తాజాగా  ‘నిశబ్దం’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చింది అనుష్క. ఇక ఈరోజు ఆమె పుట్టిన రోజు కావడంతో ఆమె ఎయిర్పోర్ట్ లో ఉండగానే కొందరు అభిమానులు ఆమె కోసం కేక్ తెచ్చి వారి సమక్షంలో కట్ చేయాల్సింది గా కోరారు. వెంటనే వారి రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసిన అనుష్క.. ఆ కేక్ ను కట్ చేసి.. తన పుట్టిన రోజుని జరుపుకుంది. తరువాత వారికి థాంక్స్ కూడా చెప్పింది. అందుకు సంబందించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వర్గం
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.