(Local) Sat, 24 Aug, 2019

వృద్ధాప్యంలో కూడా ఆకర్షిస్తున్న బాలీవుడ్ నటులు!

July 17, 2019,   7:35 PM IST
Share on:

టెక్నాలజీ ఎంత పెరిగితే అంతగా ఆనందిస్తూ ఉంటాము. అదే విధముగా మార్కెట్లోకి ఏదైనా కొత్త  ఫోన్స్ వచ్చినప్పుడు ఎలా స్పందిస్తారో అంతకంటే ఎక్కువగా మొబైల్ కి సంబందించిన యాప్స్ కూడా రెస్పాన్స్ బాగానే ఉంటుంది. అదే ఒకవేళ ఆ యాప్‌ ఫ్యూచర్ కి సంబందించినది అయితే... తాజాగా ఇలాంటి ఒక యాప్‌ ద్వారా బాలీవుడ్ హీరో వైరల్ అవుతున్నాడు.

హీరో అర్జున్‌ కపూర్‌  వృద్ధుడైన తర్వాత తన రూపం ఎలా ఉంటుందో ఓ యాప్‌ ద్వారా ఫొటో తీసుకుని తన ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్‌ చేయగా ఆ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.. ‘వృద్ధాప్యంలో నేను ఇలా ఉంటానా... గుర్తుపట్టారా’ అంటూ అర్జున్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలో రాసుకొచ్చాడు. కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారిన ఈ ఫొటోపై నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘ఓల్డ్‌మాన్‌ చాలా అందంగా ఉన్నావ్‌’ అంటూ అర్జున్‌ బాబాయ్‌ సంజయ్‌ కామెంట్‌ చేయగా...మరికొంత మంది మాత్రం ఈ గెటప్‌లో అచ్చం సంజయ్‌లా ఉన్నావు అంటూ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ సక్సేనాతో పోలుస్తున్నారు. ఇక అర్జున్‌ కజిన్‌ సోనమ్‌ కపూర్‌ తో పటు రణవీర్ దీపికా కూడా సదరు యాప్‌ ద్వారా వృద్ధాప్యంలో తానెలా ఉంటారో తెలిపే ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘ 75- 80 ఏళ్ల వయస్సులో సోనమ్ కపూర్ ఎలా ఉన్నారో చూడండి. నిజంగా తను ఎల్లప్పటికీ అందాల రాణిగానే ఉంటుంది’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. కాగా వరుణ్‌ ధావన్‌ కూడా తన ఓల్డేజ్‌ ఫొటోను షేర్‌ చేసి... అనిల్‌ కపూర్‌ నూరేళ్ల వయస్సులో ఎలా ఉంటారో నేను 70 ఏళ్లకే అలా ఉన్నాను కదా అంటూ చమత్కరించాడు. 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.