(Local) Mon, 20 Sep, 2021

బుల్లెట్ సాంగ్ – జార్జ్ రెడ్డి

November 06, 2019,   7:29 PM IST
Share on:
బుల్లెట్ సాంగ్ – జార్జ్ రెడ్డి

ఉస్మానియా యూనివర్సిటీ విప్లవ కెరటం జార్జిరెడ్డి జీవితం ఆధారంగా  తెరకెక్కుతున్న బయోపిక్ ‘జార్జిరెడ్డి’. ట్రైలర్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన సినిమా జార్జ్ రెడ్డి ఈ నెల 22న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రంలోని ‘బుల్లెట్ సాంగ్’ ప్రోమోను విడుదల చేశారు. ఈ మూవీ కంప్లీట్ సీరియస్ ప్రమోట్ అవుతుంది అనుకున్నారో ఏమో లేక జార్జ్ రెడ్డి సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి అని చూపించాలని చిత్ర యూనిట్ నేడు ఓ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. 

‘వాడు నడిపే బండీ రాయల్ ఎన్‌ఫీల్డు

వాడి చూపుల్లో ఉందీ చెగువేరా ట్రెండు

వాడు వస్తుంటే వీధంతా ఇంజిన్ సౌండు

మోగిపోతుందీ గుండెల్లో చెడుగుడు బ్యాండు

చెప్పకుండానే అయిపోయానే గర్ల్‌ఫ్రెండ్..’ అని సాగుతున్న ఈ పాటను మంగ్లీ పాడింది. 70ల్లో జరిగే కథ కాబట్టి అప్పటి పరిస్థితులకి తగ్గట్లు సాంగ్ ని డిజైన్ చేసిన విధానం బాగుంది. సీరియస్ సినిమా నుంచి వచ్చిన హుషారుగా... జార్జిరెడ్డి గర్ల్‌ఫ్రెండ్‌పై చిత్రకరించినట్టు తెలుస్తోంది. ఈ పాటను మిట్టపల్లి సురేందర్ రాయగా, జార్జిరెడ్డి తిరుగుబాటును, పోరాట పటిమను చూపే దృశ్యాలను కూడా ఈ ప్రచార చిత్రంలో పొందుపరిచారు. 1970ల కాలాన్ని గుర్తుకు తెచ్చే కాస్ట్యూమ్స్, ఇతర సన్నివేశాలు వీక్షకులను ఆ రోజుల్లోకి తీసుకెళ్తున్నాయి. ‘దళం’ జీవన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘వంగవీటి’ ఫేమ్ సందీప్ మాధవ్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. సంగీతం సురేశ్ బొబ్బిలి అందించారు. మైక్ మూవీ బ్యానర్‌పై అన్నపరెడ్డి అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ పాటతో జార్జ్ రెడ్డి గురించి తెలియని వాళ్లు కూడా జస్ట్ ఒక కొత్త సినిమా చూడడానికి వెళ్లొచ్చు అనే ఇంట్రెస్ట్ కలిగించింది.

సంబంధిత వర్గం
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.